Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలక్షన్ ఫీవర్ నడుస్తోంది. ఒకవైపు అధికార పార్టీ నేతలు గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో అధికార పార్టీ నేతలంతా జనంలో ఉంటుంటున్నారు. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు (Chandrababu) జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నారా లోకేష్ (Nara Lokesh) ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి తో యాత్ర కు రెడీ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీల హంగామా చూస్తే ఏపీలో ఎలక్షన్ మూడు వచ్చినట్టే కనిపిస్తోంది. ఏడాదిన్నర లోపే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అయితే వాటికంటే ముందే మర్చిలో మరో సమారానికి సమయం ఆసన్నమైంది.
పెద్దల సభ పదవుల కోసం అప్పుడే లాబీయింగ్ ప్రారంభమైంది. 2023 మార్చి నెలాఖరు నుంచి జులై లోపు మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో వైసీపీ కి ఆరు టీడీపీ కి 12 బీజేపీ మూడు పీడీఎఫ్ కి ఇద్దరు ఎమ్మెల్సీ లు గా ఉన్నారు.
మొత్తం కాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో మెజారిటీ గా వైసీపీ కి 19 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు అధినాయకుడిని ప్రసన్నం చేసుకునే పని లో ఉన్నారు
ఇదీ చదవండి : పసుపు దళం పునరుత్తేజం అయ్యేనా? సెంటిమెంట్ లోకేష్ కు కలిసొచ్చేనా..?
1) ఎమ్మెల్యే కోటా: ఈ కోటాలో మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29న ఖాళీ అవుతున్నాయి. ఇందులో 5 వైసీసీ 2 టీడీపీ సిటింగ్ సీట్లు.
2) స్థానిక సంస్థల కోటా:స్థానిక సంస్థల కోటాలో మార్చి 29న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతోంది. ఆ తరువాత మే 1న మరో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. మే 1నే బీజేపీ ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తవుతుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉండడంతో ఈ 9 స్థానాలూ ఆ పార్టీకే దక్కడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
3) పట్టభద్రుల కోటా:మార్చి 29న ఒక పీడీఎఫ్ ఒక వైసీపీ ఒక బీజేపీ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తికానుంది. ఇది పట్టభద్రుల కోటా కావడంతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది.
4) ఉపాధ్యాయ కోటా:మార్చి 29న ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. ఇందులో ఒకరు పీడీఎఫ్ కాగా ఇంకొకరు ఇండిపెండెంట్.
ఇవి కూడా ఉపాధ్యాయ సంఘాల బలాబలాల బట్టే ఉండనుంది. వైసీపీకి అవకాశం చాలా స్వల్పం.
5) నామినేటెడ్ కోటా:జులై 20న ఇద్దరు టీడీపీ నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికానుంది. ఈ రెండు పదవులు పూర్తిగా అధికార పక్షం కు మాత్రమే దక్కుతాయి.
వైసీపీ గతం లో అధినాయకుడు పాదయాత్రలో మతైచినవారికి అవకాశం కల్పించి మాటతప్పని మడమతిప్పని నాయకుడు అని నిరూపించుకుంటారో లేక వచ్చే ఎన్నికలను ద్రుష్టి లో పెట్టుకొని పడవముల పందేరం ఉంటుందో వేచి చూడాలి .....
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics