ANDHRA PRADESH POLITICAL NEWS ARAKU YCP MLA TURNED TO MOVIE ACTOR PRESENT SHOOTING ONGOING NGS
MLA Turned Actor: నటుడిగా మారిన అధికార పార్టీ నేత.. సినిమాలో కీరోల్ పోషిస్తున్నఎమ్మెల్యేను గుర్తు పట్టారా?
యాక్టర్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే
YCP MLA Turned Actor: ఆయనో మల్లీ టాలెంటెడ్ నేత.. బ్యాంకులో పని చేశారు.. పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలోనూ పని చేశారు.. తరువాత ప్రజా ప్రతినిధిగా మారారు.. ఎమ్మెల్యేగా నెగ్గిన తరువాల యాక్టర్ గా మారారు. అది కూడా ఓ సినిమాలో లీడ్ రోల్ లో ఆయన నటిస్తున్నారు.. ఇంతకీ ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎవరో గుర్తు పట్టరా..?
Andhra Pradesh MLA Turned Actor: అందరిలా ఆయన ఓ సాధారణ ప్రజా ప్రతినిధి కాదు.. ఎన్నో బాధ్యతల్లో గుర్తింపు తెచ్చుకున్న తరువాత రాజకీయ అరంగేట్రం చేశారు.. మొదట మాస్టర్ (School teacher) గా పని చేశారు.. తరువాత పోస్టు మాస్టర్ (Post master) విధులు చేపట్టారు.. బ్యాంకులో పని చేశారు.. పోలీస్ శాఖలోనూ బాధ్యతలు నిర్వహించారు.. ఇలా ఎన్నో పదవుల్లో ఒదిగిపోయిన ఆయన.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా తరువా కాలంలో రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ఎన్నికల్లో గెలుపొందిన ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే హాయిగా కాలుమీద కాలు వేసి కూర్చోవలసిన ఆయన మళ్లీ ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడిగా మారారు. అయితే ఇది నిజజీవంతో ప్రధానోపాధ్యాయుడు వృత్తిలో కాదు.. కానీ స్కూల్ విజిట్లో భాగంగా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. అయితే ఇదంతా ఓ సినిమా షూటింగ్ లో భాగం. ఆ సినిమాలో ప్రధానోపాధ్యాయుడు పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో గుర్తు పట్టారా..?
విశాఖ జిల్లాలను అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో అనేక ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యతలు నిర్వర్తించారు. పాఠశాల టీచర్, పోస్ట్ మాస్టారుగా, పోలీస్ శాఖతోపాటు బ్యాంకుల్లోనూ పనిచేశారు తరువాత రాజకీయ జీవితం ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగం వదులుకుని ప్రత్యక్షంగా ప్రజా సేవలోకి దిగారు. ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫల్గుణకు ఓ అవకాశం వచ్చింది. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం పేరుతో రూపొందిస్తున్న చిత్రం. పాత్ర కూడా ప్రధానోపాధ్యాయుడు..! అప్పటికే ఆయనకు ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉంది. అందులోనూ ప్రభుత్వ పథకానికి సంబంధించిన సినిమా దీంతో అవకాశాన్ని కాదనలేకపోయారు ఎమ్మెల్యే. చదువుకోలేని పేద పిల్లలకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పేరుతో చిత్రం కూడా కలిసిరావడంతో ఇక ఎమ్మెల్యే ఫల్గుణ వెనుదిరిగి చూడలేదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అమ్మఒడి చిత్రం షూటింగ్ పాడేరు మండలం దిగుమోదపుట్టు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది. స్కూలు పిల్లలు పాఠశాలకు వస్తున్నప్పుడు హెడ్మాస్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సన్నివేశం షూట్ చేశారు. దీంతో పాటు తరగతిగదిలో లెక్కలు బోధిస్తున్నట్టు మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో చెట్టి ఫల్గుణ తన పాత్రకు జీవం పోసినట్టు నటిస్తూ… కనిపించారు. నిజ జీవితంలో అధ్యాపక అనుభవం ఉండడంత.. సినిమాలో కూడా జీవించేశారు. తనకు చిత్రంలో ప్రధానోపాధ్యాయుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.
ఈ అమ్మఒడి చిత్రానికి డైరెక్టర్ దత్తాత్రేయ. అమ్మఒడి పేరుతో రెండు గంటల సినిమా షూటింగ్ నిర్మిస్తున్నామని గతంలో ఎమ్మెల్యేకు చిత్రయూనిట్ చెప్పింది. దీంతో.. అవకాశముంటే అందులో తనకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరడంతో.. చిత్ర యూనిట్ ఆ మేరకు చెట్టి ఫల్గుణను ఆహ్వానించారు. తమ చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. అందుకోసం ప్రధానోపాధ్యాయుడి పాత్రను ఎమ్మెల్యేకు కేటాయించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.