హోమ్ /వార్తలు /andhra-pradesh /

YCP MLA: ఆ జిల్లాలో యువ నేతకు పదవి ఇవ్వడం.. ప్లస్సా.. మైనస్సా..? కేడర్ లో ఇంత గందరగోళం ఎందుకు..?

YCP MLA: ఆ జిల్లాలో యువ నేతకు పదవి ఇవ్వడం.. ప్లస్సా.. మైనస్సా..? కేడర్ లో ఇంత గందరగోళం ఎందుకు..?

YCP MLA: ఈ జిల్లాపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధినేత దగ్గర నుంచి అందరికీ ఈ జిల్లాపై ప్రత్యేక అభిమానం.. అలాంటి జిల్లాలో కీలక నేత ఆ యువ ఎమ్మెల్యే.. అధిష్టానం దగ్గర వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. తాజాగా ఆ యువనేతకు కీలక పదవి ఇచ్చారు పార్టీ పెద్దలు.. అయితే ఆ పదవి తమ నేతకు మైనస్ అంటూ కేడర్ లో ఆందోళన మొదలైంది. బాధ్యతలు ఇస్తే మైనస్ ఏంటి అనుకుంటున్నారా...?

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18.         YCP MLA: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతాలకు అతీతంగా అన్ని వైసీపీ (YCP)కి పట్టం కట్టాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గాలికి ప్రత్యర్థి పార్టీలు చెల్లా చెదురయ్యాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతలు సైతం డిపాజిట్లు కోల్పోయారు.. అటు రాయల సీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల్లోనూ ఫ్యాన్ గాలి జోరుగా వీచింది. ఇంత ప్రభంజనంలోనూ ఒక్క విశాఖపట్నం (Visakhapatnam)లో మాత్రం పరిస్థితి రివర్స్ అయ్యింది. సిటీలో ఉన్న నలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ (TDP) నేతలే విజయం సాధించారు.. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీదే పైచేయి అయ్యింది. ఇక సీఎంగా జగన్ బాధ్యతల చేపట్టిన వెంటనే.. విశాఖపై ప్రత్యేక ఫోకస్ చేశారు. గతంలో వైఎస్ విజయమ్మ (YCP Vijayamma)ను ఎంపీగా ఓడించిన నియోజకవర్గం కూడా విశాఖ.. ఇప్పుడు ఇంత గాలీలోనూ వైసీపీకి సిటీలో నాలుగు సీట్లలో చుక్కెదురైంది. దీంతో ఆయన సీఎం అయిన వెంటనే విశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తనకు అన్ని వేళలా అండగా ఉండే విజయసాయి రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్ప చెప్పారు. అక్కడితో ఆగలేదు.. ఏపీ పరిపాలనా రాజధానిగా కూడా ప్రకటించారు. అయితే నేడో రేపో రాజధాని పనులు మొదలవుతాయి అనుకుంటే.. కోర్టు తీర్పులు.. సాంకేతిక సమస్యలతో ఆ నిర్ణయం ముందుకు కదలడం లేదు. అయితే జిల్లాపై మాత్రం వైసీపీ ప్రత్యేక ఫోకస్ చేస్తూనే ఉంది.

  విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. టిడిపి రెబెల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికార పార్టీకి 11 మంది శాసన సభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపించినా, రెండున్నరేళ్లు తిరిగేసరికి పరిస్థితులు తలకిందులైంది. ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణికి మధ్య గ్యాప్ పెరిగింది. పాయికరావుపేట విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో వ్యతిరేకత రోడ్డెక్కింది. మిగిలిన చోట్ల చాపకింద నీరులా అసమ్మతి విస్తరిస్తోంది. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించడంతో వైసిపి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ, క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వాల మధ్య విభేదాలు సీరియస్ గా పరిగణించి, యువ నేత, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం.

  ఇదీ చదవండి: ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం.. చంద్రబాబు త్వరగా కోలుకోవలన్న పవన్

  ఎమ్మెల్యే అమర్ నాథ్ ను అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడ్నిచేశారు. ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయట. 2009 ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో కాపు నాయకత్వ బలం ఎక్కువ. వీటన్నింటినీ బేరీజు వేసుకుని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే ఆసక్తికర చర్చ మొదలైంది. ఇది తమ నేతకు ప్రమోషన్ కాదు.. డిమోషన్ అంటూ డౌట్ పడుతున్నారు అతడి అనుచరవర్గం..

  ఇదీ చదవండి: బావల కోసం బాలయ్య తాపత్రయం..? ఆ ఇద్దరినీ ఒక్కటి చేస్తారా..? ఇదంతా ఎవరి ప్లాన్

  వాస్తవానికి అమర్నాథ్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా బెర్త్ ఖాయమని ఎమ్మెల్యే అనుచరుల ధీమా. ఇంతలో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అనుచరులు డైలమాలో పడ్డారట. పార్టీ పదవిపై అమర్నాథ్ ఆలోచనలు ఎలా ఉన్నా, క్యాడర్ మాత్రం తమ నేతకు మంత్రి పదవి ఉన్నట్టా..?

  ఇదీ చదవండి: ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారా..? ఆయన ఆత్మ ఏం చెప్పింది..? 26 ఏళ్ల తరువాత బయటపడ్డ రహస్యం..!

  లేనట్టా అని చెవులు కొరుక్కుంటున్నారట. డీలా పడిన వారికి ఎమ్మెల్యే సర్ది చెబుతున్నారట. చాలా జిల్లాల్లో మంత్రులే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నందున కొత్త పదవిని పాజిటివ్ సంకేతంగా చూడాలనేది పార్టీలో మరో వర్గం అభిప్రాయం. మిగిలిన జిల్లాల మాదిరిగానే అక్కడ అధ్యక్షుడిగా ఉన్న అమర్ నాథ్ కు లక్కు కలిసివస్తుందని చర్చ జరుగుతుంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  ఉత్తమ కథలు