Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLITICAL FIGHT IN ANANTAPURAM PARITALA SRIRAAM VS THPUDARTHI PRAKASH REDDY WAR OF WORDS NGS

TDP Vs YCP: ఆ నియోజకవర్గంలో ఢీ అండే ఢీ.. ఆస్తుల లెక్కలపై ఇరు పార్టీ నేతల సవాళ్లు..

పరిటాల వర్సెస్ తోపుదర్తి

పరిటాల వర్సెస్ తోపుదర్తి

TDP Vs YCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. విమర్శలు హద్దులు దాటాయి.. ఆరోపణలు శృతి మించాయి.. ఒకరి ఆస్తులు, సంపదలపై మరొకరు విమర్శలు దాడి చేస్తున్నారు. ఆరోపణలు రుజువు చేస్తామంటున్నారు.

ఇంకా చదవండి ...
  Paritala Shriram vs Prakash Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలకు చాలా సమయమే ఉంది. అయితే ఆ ఒక్క నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. అధికార, విపక్షా నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. సాధరణంగా కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితవతూ వస్తున్నా నేతలు.. ఇప్పుడు ఆస్తులు, సంపదలపై విమర్శల దాడి చేసుకుంటున్నారు. నీ ఆస్తి ఎంత అంటే.. నీ ఆస్తి ఎంత అంటూ ఒకరి ఆస్తుల గురించి మరొకరు బయట పెట్టుకుంటున్నారు. దీంతో ఇదే హాట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరి నేతల మధ్య వివాదంతో ఐఏఎస్ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు ఇరుక్కుంటున్నారు. ఆ నియోజకవర్గం ఏదో కాదు.. అనంతపురం జిల్లా (Anantapuram District) లోని పౌరుషాల గడ్డ రాప్తాడు.. ఇక్కడి నేతలు రక్తం పౌరుషాలతో మరుగుతుంటుంది.

  రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వైరం.. సినిమా సీన్లను తలపిస్తుంది. సాధారమంగా ఇంట్రవెల్ బ్రెక్ ముందు వచ్చే పవర్ సీన్ల తరహాలో ఆ రెండు కుటుంబాల మధ్య డైలాగ్ లు పేలుతుంటాయి. మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha), ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy) కుటుంబాల మధ్య ఇప్పుడు వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఓ రేంజ్ లో సాగుతుంది. వందలు, వేల కోట్ల ఆస్తుల అంటూ రగడ రాజేస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాప్తాడు దద్దరిల్లుతోంది.

  ఇదీ చదవండి: ఏపీలో నైట్ కర్ఫ్యూ షురూ.. తొలి రోజు జస్ట్ వార్నింగ్ తో సరి.. నేటి నుంచి జరిమానాలు

  ఈ గొడవ ప్రారంభమైంది అక్కడే.. మాజీ మంత్రి పరిటాల సునీత గౌరవ సభల్లో మాట్లాడిన మాటలే ఇప్పుడు కాంట్రావర్షీగా దారి తీసింది. రెండు వారాలుగా రాప్తాడులో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. పరిటాల సునీత కామన్ టార్గెట్ మాత్రం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్రదర్సే. నిన్నటివరకు సొంత ఇళ్లు లేక అద్దె ఇంట్లో ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తున్నారని.. రాప్తాడు నుంచి బెంగళూరు వరకూ భూదందాలు చేస్తున్నారని సునీత ఆరోపించారు. దీనికి మొదట తోపుదుర్తి బ్రదర్స్ రెస్పెండా కాలేదు కానీ.. తోపుదుర్తి పాల డైరీ విషయంలో సునీత చేసిన కామెంట్స్ వారికి కోపాన్ని తెప్పించాయి. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డైరీ ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బు వసూళ్లు చేశారని..ఇప్పుడు ఆ డబ్బును ప్రకాష్ రెడ్డి సోదరులు రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పరిటాల కుటుంబంపై వార్ షురూ చేశారు. ఇన్ని రోజులు ఎన్ని మాటలు అన్నా ఊరుకున్నాం.. ఇక ఆగేది లేదుంటూ పరిటాల ఆస్తి పాస్తులపై రివర్స్ అటాక్ ప్రారంభించారు.

  ఇదీ చదవండి: ఆ కుటుంబాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి

  ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాల పేరుతో కొండల్లో ఉన్న వారికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురంలలో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. మాకు సొంత ఇళ్లు లేదని ఎగతాళి చేస్తారా.. మరి మీకు ఎక్కడి నుంచి అన్నిఆస్తులు వచ్చాయో చెప్పండి అంటూ ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు ప్రశ్నించారు. మేము ఏదో సంపాదించుకున్నాం అంటున్నారు కదా.. అవి ఏవో చూపించండి ప్రజలకు పంచేస్తాం.. మేము కూడా మీ ఆస్తులు చూపిస్తాం అవి పంచే దమ్ముందా మీకు ఉందా అంటూ సవాల్ విసిరారు.

  ఇదీ చదవండి: నాగార్జునకు సీఎం జగన్ సపోర్ట్ చేశారా..? బంగార్రాజు సక్సెస్ మీట్ లో కింగ్ ఏమన్నారంటే

  డ్వాక్రా మహిళల భాగస్వమ్యంతో ఏర్పాటు చేస్తున్న డైరీలో అక్రమాలు జరిగాయంటున్నారు… అందులో ఒక్క రూపాయి మేము కానీ అందులో సభ్యులు కానీ పక్కదారి పట్టించి ఉంటే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించలేకపోతే మీరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు తోపుదర్తి. హత్యలు, దౌర్జన్యాలతో దోచుకోవడం దాచుకోవడం అనే విధానంతో పరిటాల రవి జీవించారని.. ఇప్పుడు మీరు మీకుటుంబసభ్యులు అదే పనిలో ఉన్నారని ప్రకాష్ రెడ్డి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  ఇదీ చదవండి: భోగాపురం ముందుకు కదిలేదెలా..? డెడ్ లైన్ ముగిసినా నో అంటున్న నిర్వాసితులు

  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పరిటాల శ్రీరామ్ లేటుగా స్పదించారు. పరిటాల రవి ఎమ్మెల్యే కాక ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన చాలా కష్టాలు పడ్డ తర్వాత నిలదొక్కుకుకున్నారు. ఆ నాటి నుంచి మా కుటుంబం అంచలంచెలుగా ఎదిగింది. ఇదిదో రాత్రికి రాత్రే వచ్చిందికాదు. మేము ఏ వ్యాపారం చేసినా.. ఏది కొన్నా అంతా పక్కా రైట్ ట్రాయల్ గా ఉంటుందని.. ప్రతి దానికి ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా దానికి మించి ఉంటే అధికారం నీదే కదా నిరూపించుకో అని సవాల్ విసిరారు. తాము నీలాగా అదేదో ఒక పాటలో చూపించినట్టు.. రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించలేదన్నారు. తోపుదుర్తి డైరీ గురించి మాట్లాడుతూ 50 లక్షలు ఎవరి అకౌంట్ కు మళ్లించారని.. మిషనరీ కొనడానికి రెండేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు. ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు, బినామీలకు ఒక్కటే హెచ్చరిక అని… అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే మూల్యం తప్పదని శ్రీరామ్ అన్నారు.

  ఇదీ చదవండి:ఆ జిల్లాలో యువ నేతకు పదవి ఇవ్వడం.. ప్లస్సా.. మైనస్సా..? కేడర్ లో ఇంత గందరగోళం ఎందుకు..?

  పరిటాల శ్రీరామ్ ముక్కోటి ఏకాదశి రోజు ప్రకాష్ రెడ్డి కౌంటర్ కు ఇస్తే.. భోగి రోజు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మరోసారి పరిటాల కుటుంబం ఆస్తుల చిట్టా విప్పారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పరిటాల శ్రీరామ్ ఒక జూనియర్ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. నేను కొందరు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్నానని అంటున్నారు.. తాను కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. తన గురించి మాట్లాడే ముందు.. అసలు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తేల్చుకోండని కామెంట్ చేశారు. సీఎం జగన్ తో నేను 20ఏళ్లుగా నడుస్తున్నాని.. ఆయన వెంటే జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు. మీ తల్లిగారు సివిల్ స్ప్లైస్ మంత్రిగా పని చేశారని..ఇప్పటికీ సివిల్ సప్లైస్ లో మీ పెత్తనం సాగుతోందన్నారు. కొడాలి నాని ఉన్నా ఆశాఖలో మీది జరుగుతోందని ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఇక నుంచి వరుసగా రిలీజ్ చేస్తానని చెప్పారు.

  ఇదీ చదవండి: ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం.. చంద్రబాబు త్వరగా కోలుకోవలన్న పవన్

  అన్నట్టుగానే ఎమ్మెల్యే ప్రకాష రెడ్డి. తాజాగా అనంతపురం, రాప్తాడు చుట్ట పక్కల జరిగిన భారీ భూ కుంభకోణాల చిట్టా బయట పెట్టారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో భూములు ఎలా కాజేశారో చూడండి అంటూ కొన్ని సర్వే నెంబర్లతో సహా వివరించారు. రెవెన్యూ చట్టాల్లోని లొసుగుల ద్వారా వందల కోట్లు విలువ చేసే భూములు కాజేశారన్నారు. ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ చట్టాల ద్వారా వీటిని చట్ట రూపంలోకి మార్చారని ఆరోపించారు. ఇందులో కొందరు రెవెన్యూ అధికారులు సహకారం అందిందని.. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్ల ఎలా సహకరించారో త్వరలోనే చెబుతానన్నారు. అసలు ఐఏఎస్ అధికారులు ఎక్కడికి ఎలా బదిలీపై వెళ్లారో చెప్తానన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Paritala sriram, TDP, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు