ANDHRA PRADESH POLICE SUSPECTED DEVININENI AVINASH FOLLOWERS ON AFTER VANGAVEETI SENSATIONAL COMMENTS NGS GNT
Vangaveeti Radha: వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించింది వైసీపీ నేత అనుచరులేనా..? బెజవాడలో ఏం జరుగుతోంది..?
విజయవాడలో వంగవీటి vs దేవినేని
Vangaveeti Radha: వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలో దుమారం రేపుతున్నాయి. మరి ఆయన వ్యాఖ్యలు నిజమేనా..? వంగవీటి ఇంటి దగ్గర కొందరు రెక్కీ నిర్వహించారా..? ఆ రెక్కిలో పాల్గొన్నది అధికార వైసీపీ పార్టీ నేత అనుచరులేనా..? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారంటే..?
Vangaveeti Radha: కాపు కీలక నేత.. విజయవాడ రాజకీయాల్లో పట్టు ఉన్న వంగవీటి రాధ హత్యకు కుట్ర జరుగుతోందా..? హత్య చేయాలనే లక్ష్యంతో ఆయన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారా..? ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. వంగవీటి రాధే స్వయంగా ఈ మాటలు అన్నారు. వంగవీటి రంగా 33 వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు రంగా విగ్రహన్ని ఆవిష్కరించిన అనంతరం వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ రెక్కీ ఎవరు చేశారోననే విషయం త్వరలోనే తేలుతుందన్నారు. తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కొడాలి నాని.. వల్లభనేని వంశీ కూడా పక్కనే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన పార్టీ మారేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా.. లేక ఆయన సన్నిహితులు టీడీపీని దెబ్బ కొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేయించారా అంటూ చర్చ మొదలైంది..
తనను హత్య చేస్తారని తెలిసినా భయపడేది లేదన్నారు వంగవీటి రాధ. అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని ఆయన తెలిపారు. తనను పొట్టన పెట్టుకోవాలని అనుకునేవారికి భయపడేది లేదని వంగవీటి రాధా స్పష్టం చేశారు. తాను ప్రజల మధ్యే వుంటానని, తనను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా పిలుపునిచ్చారు. అయితే తన సమక్షంలోనే వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయమై మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
వంగవీటి వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ఆయన విషయంపై సీరియస్ అయ్యి వెంటనే పోలీసుల అధికారులకు కీలక ఆదేశాలు చేశారు.. వెంటనే దీనిపై విచారణ చేయాలి అన్నారు. అలాగే పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. సీఎం జగన్ ఆదేశాలతో వంగవీటికి 2 ప్లస్ 2 భద్రత కల్పించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. అయితే వంగవీటి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని.. కానీ సీఎం ఆదేశాలతో విచారణ చేస్తున్నామన్నారు..
డీజీపీ ఆదేశాలతో వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. ఇప్పటికే సంచలన విషయాలను గుర్తించినట్టు సమాచారం. నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం వ్యక్తి చేస్తున్నారు. ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న అరవ సత్యం సోమవారం ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆయన స్పృహ కోల్పోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అరవ సత్యం.. ఆరవ సత్యాన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. అంతేకాదు ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడే కావడం విశేషం..
వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలోనే వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడం.. వంగవీటిపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని మంత్రి కొడాలి నాని స్వయంగా సీఎంకు చెప్పడం.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నది కూడా వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడిపైనే కావడంతో అసలు బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడంలో లేదు.. తాజా పరిణమాలు చూస్తుంటే త్వరలోనే రాజకీయంగా పలు మార్పులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.