Andhra Pradesh Government Disha App : ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ (Disha App) ఆల్రెడీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాని ద్వారా ఓ యువతిని దుండగుల నుంచీ పోలీసులు అత్యంత వేగంగా కాపాడటంతో... ఈ యాప్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. తాజాగా ఈ యాప్ ఓ సంసారాన్ని నిలబెట్టింది. ఎలాగంటే... కృష్ణా జిల్లా... పెనుగంచిప్రోలు మండలం... అనిగండ్లపాడు గ్రామ మహిళా వాలంటీర్... దిశ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన భర్త వల్ల తనకు సమస్యలు వస్తున్నాయని చెప్పారు. గురువారం రాత్రి 10.20కి ఆమె కంప్లైంట్ ఇవ్వగా... రాత్రి 10.30కి పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. మధ్యలో ఇన్వాల్వ్ అయిన పోలీసులు... రెండువైపులా సమస్యను తెలుసుకున్నారు.
ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల సంసారం రోడ్డున పడుతుందే తప్ప ప్రయోజనం ఉంటుందా? అసలు ఇదీ ఓ సమస్యేనా... భార్యాభర్తలన్నాక... ఇలాంటివి వస్తూనే ఉంటాయి. సర్దుకుపోవాలి. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇలా గొడవలు పడితే... తర్వాత మనస్పర్థలు పెరిగి... ఇద్దరూ బాధపడతారు. మీ పెళ్లినాడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో... ఇప్పుడూ అలా సంతోషంగా ఉండాలి. అంతే తప్ప గొడవలు పడితే ఎలా అంటూ ఇద్దరికీ నాలుగు మంచి మాటలు చెప్పారు.
వాలంటీర్ భర్తతో ప్రత్యేకంగా మాట్లాడిన పోలీసులు... ఆమెకు భర్త తప్ప మరో ప్రపంచం తెలియదు. అలాంటి ఆమెను తిడితే... ఆమె ఎవరికి చెప్పుకుంటుంది. తనలో తనే బాధపడుతుంది. ఇలా భార్యను బాధపెట్టొచ్చా... తప్పుకాదూ... భార్యను ప్రేమగా చూసుకోవాలి. ప్రాణంగా చూసుకోవాలి. అంటూ మంచి మాటలు చెప్పడంతో... వాలంటీర్ భర్త కూడా... తన తప్పు తెలుసుకున్నారు. ఇకపై తన భార్యను పల్లెత్తు మాట అనను అని హామీ ఇచ్చారు. దాంతో పోలీసులు... ఇద్దర్నీ హాయిగా ఉండమని చెప్పి బయల్దేరారు. పోలీసులకు గ్రామ వాలంటీర్ థాంక్స్ చెప్పారు. ఇలా దిశ యాప్ ఆ కాపురాన్ని నిలబెట్టినట్లైంది.
దిశ యాప్ విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా... వెంటనే అలర్టవుతున్నారు. క్షణాల్లో స్పాట్‌కి చేరుకుంటున్నారు. తెలంగాణలో దిశ హత్యాచారం ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం వెంటనే దిశ యాక్ట్ రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపింది. అలాగే దిశ యాప్ విషయంలోనూ అంతే సీరియస్‌గా ఉన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందువల్ల పోలీసులు కూడా అంతే సీరియస్‌గా స్పందిస్తున్నారు. కంప్లైంట్ వస్తే చాలు... ఆన్ డ్యూటీ అంటూ... సవాలుగా తీసుకుంటున్నారు. అందుకే ఈ యాప్, దీనిపై పోలీసుల స్పందనకు ప్రశంసల జల్లు కురుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP disha act, AP News, AP Politics, Disha App, Ys jagan