హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో ఆలయాలపై ఎవరు దాడి చేశారో తెలుసా?... ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

Andhra Pradesh: ఏపీలో ఆలయాలపై ఎవరు దాడి చేశారో తెలుసా?... ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

కృష్ణాజిల్లా ఉయ్యూరు శివలయం (ఫైల్)

కృష్ణాజిల్లా ఉయ్యూరు శివలయం (ఫైల్)

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల మీద దాడుల అంశం గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై జరిగిన దాడుల మీద ఈ సీఐడీ విచారణ జరపనుంది. ఈ క్రమంలో గుళ్ల మీద దాడులకు సంబంధించిన సమాచారం ప్రజల నుంచి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల మీద దాడుల అంశం గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై జరిగిన దాడుల మీద ఈ సీఐడీ విచారణ జరపనుంది. ఈ క్రమంలో గుళ్ల మీద దాడులకు సంబంధించిన సమాచారం ప్రజల నుంచి తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన మూడు నెలల కాలం గా వేర్వేరు చోట్ల వరుసగా జరుగుతున్న ప్రార్ధనా మందిరాలుపై దాడులు జరిగాయి. అలాంటి ఆకతాయిల అల్లరి చేష్టలకు సంబంధించిన చర్యలను అరికట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలపై ,రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో, అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా "సిట్" ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులను గూర్చి పూర్తి విచారణ చేస్తున్నారు.

  రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల పై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారం తెలియ జేయడానికి హెల్ప్ లైన్ నెంబర్ 9392903400 ను కేటాయించారు. కాబట్టి ప్రజలందరూ దీనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి, సమాచారం తెలిస్తే వెంటనే ఈ నెంబర్కు సమాచారం అందజేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారి సమాచారం అందజేసి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్పీ తెలిపారు.

  మరోవైపు రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసుల్లో 335 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందులో 175 కేసులను చేధించామని చెప్పారు. 2020-21లో ఆలయాలపై దాడులకు సంబంధించి 44 పెద్ద ఘటనలు జరిగాయన్నారు. వీటిల్లో 29 కేసులను చేధించామని... 85 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఆలయాల భద్రత కోసం 23,256 గ్రామాల్లో 15,394 గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామని వివరించారు. 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు నిరంతర నిఘా ఉంచామన్నారు.

  16 మందితో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

  ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద జరుగుతున్న దాడులను విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఐపీఎస్ జీవీ అశోక్ కుమార్ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో 2020 సెప్టెంబర్ నుంచి పలు ఆలయాల్లో జరిగిన దాడుల మీద సమగ్రంగా విచారణ జరపనుంది. వీటికి సంబంధించిన విచారణలో భాగంగా అవసరమైతే సహకరించాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు కూడా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, ఈ కేసులో సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. సిట్ కూడా ఆయా జిల్లాల ఎస్పీలు, స్థానిక పోలీసులు అందరితోనూ సయోధ్య చేసుకుంటూ కేసును విచారణ జరపనుంది. దాడులు జరిగిన తీరు, ఇలాంటివి గతంలో ఎక్కడైనా జరిగాయా? ఎవరు చేసి ఉంటారనే అంశాలను వారు పరిశీలించనున్నారు. ఇక సిట్‌‌కు సీఐడీలోని సైబర్ క్రైమ్ విభాగం కూడా సహకరించనుంది. ఈ కేసు విచారణలో అవసరం అయితే డీజీపీతో నేరుగా మాట్లాడి మరింత మంది పోలీసులను టీమ్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆలయాల మీద దాడులకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదిక అందించనుంది. అలాగే, ఎప్పటికప్పుడు కేసు విచారణ సమాచారాన్ని డీజీపీకి కూడా తెలియజేయాలి.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, AP Police, AP Temple Vandalism

  ఉత్తమ కథలు