హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల సంఘం మెతక వైఖరి.., ఎస్పీని దూషిస్తే ప్రెస్ నోట్ తో సరి..

Andhra Pradesh: అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల సంఘం మెతక వైఖరి.., ఎస్పీని దూషిస్తే ప్రెస్ నోట్ తో సరి..

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (ఫైల్)

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే కాదు దేశంలో ఎక్కడైనా పోలీసులపైనా, పోలీస్ వ్యవస్థపైనా ప్రతి ఒక్కరికీ గౌరవంగా ఉండాలి. స్వప్రయోజనాల కోసం పోలీసులను దూషిస్తే విమర్శల పాలవడం ఖాయం..

  ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఎక్కడైనా పోలీసులపైనా, పోలీస్ వ్యవస్థపైనా ప్రతి ఒక్కరికీ గౌరవంగా ఉండాలి. శాంతి భద్రతల కోసం అహర్నిశలు కష్టపడే పోలీసులను విమర్శించినా, బెదిరింపులకు గురిచేసినా ప్రతి ఒక్కరూ ఖండిస్తారు. ఈ విషయంలో పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడూ ముందుటుంది. కానీ నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు అధికారుల సంఘం ఒకింత సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారులు ఖండించారు. ప్రజాప్రతినిథిగా, ప్రభుత్వంలో భాగస్వాములై ఉంది. బాధ్యత గల పదవిలో ఉంటూ జిల్లా ఎస్పీపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విధి నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యంవహిస్తున్నారని భావిస్తే ఉన్నతాధికారులకు గానీ, ప్రభుత్వంలోని పెద్దలకు ఫిర్యాదు చేయాలేగానీ, ఇలా బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంటూ పత్రికా ప్రటన విడుదల చేశారు.

  ప్రసన్నకుమార్ రెడ్డి ఏమన్నారంటే..!

  కోవూరు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నల్లపురెడ్డి ఎస్పీ భాస్కర్ భూషణ్ పై ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ వాళ్లు చెప్తే కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి నువ్వెవరంటూ తిట్లదండకం ఎత్తుకున్న నల్లపురెడ్డి.., అధికార పార్టీ వాళ్లు చెప్తే కేసు నమోదు చేయగా..? అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఫోన్ చేస్తే కేసు నమోదు చేయకుండా ఉండటానికి నువ్వెవరన్నారు. ఎస్పీ వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అసలు నువ్వు ఎక్కడి నంచి వచ్చావ్.. నీకు రూల్స్ ఎవరు నేర్పారు? నెల్లూరు జిల్లాలో ఎన్నాళ్లుంటావో చూస్తా.. ఇప్పుడో నెల తర్వాతో వెళ్లక తప్పదని.., వెళ్లే ముందు మంచిపేరు తెచ్చుకకొని వెళ్లాలన్నారు. మన ఖర్మకొద్దీ ఆ ఎస్పీ జిల్లాకు వచ్చాడన్న నల్లపురెడ్డి ఏం తమాషాగా ఉందా..? ఎవరు కాపాడతారు నిన్ను.., ? విజయవాడ నుంచి డీజీపీ వచ్చి రక్షిస్తాడనుకున్నావా? బాగుండదు చెప్తున్నా..! అంటూ రెచ్చిపోయారు.

  MLA Nallapureddy Prasanna Kumar Reddy, YSRCP MLA, Police, Andhra Preadesh Police Officers Association, Andhra Pradesh, Andhra Pradesh news, AP News, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం, ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, JC Prabhakar Reddy, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ, TDP
  పోలీస్ అధికారుల సంఘం పత్రికా ప్రకటన

  ఐతే పోలీసులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడే పోలీస్ అధికారుల సంఘం.., నల్లపురెడ్డి విషయంలో ఒకింత మెత్తగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. ఒక జిల్లా ఎస్పీని దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడితే జస్ట్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిజాయితీని, విధులను శంకిస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయకపోవడం గమనార్హం. ఐతే నల్లపురెడ్డి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతోనే సీరియస్ గా రియాక్ట్ అవలేదనే విమర్శలు వస్తున్నాయి.

  ఇదే అంశంపై స్పందించిన అనంతపురం జిల్లా తాడిపత్రి  టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.., పోలీస్ అధికారుల సంఘం తీరును తప్పుబట్టారు. తనపై ఏకంగా ఫిర్యాదులు చేసిన పోలీస్ అధికారుల సంఘం.. ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra pradesh news, AP Police, Nellore

  ఉత్తమ కథలు