Chandrababu Naidu: ఆ పోస్ట్ సరైనది కాదు.. చంద్రబాబు ట్వీట్‌కు ఏపీ పోలీసుల కౌంటర్

చంద్రబాబు ట్వీట్‌కు ఏపీ పోలీసుల కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేసిన ట్వీట్‌కు ఏపీ పోలీసులు కౌంటర్ ట్వీట్ చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేసిన ట్వీట్‌కు ఏపీ పోలీసులు కౌంటర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు చేసిన ఓ ట్వీట్‌పై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ అందులో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు చంద్రబాబు నాయుడు పోలీసులకు సహకరించాలని కోరింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దంటూ అభ్యర్థించింది. వివరాలు.. ట్విటర్‌లో ఓ ఫొటోను షేర్ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎంత భయానకంగా మారిందో దీనిని చూస్తే తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న ఒక పోలీసుపై జరిగిన దారుణమైన దాడి చూస్తుంటే.. వైసీపీ గుండాలు ఎంత ధైర్యంగా దాడులకు తెగబడుతున్నారో తెలుస్తోందని విమర్శించారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేదని వ్యాఖ్యానించారు.

    దీనిపై స్పందించిన ఏపీ పోలీసు శాఖ.. ఫ్యాక్ట్ చెక్ హ్యాష్ ట్యాగ్ పేరిట చంద్రబాబు ట్వీట్‌ను తప్పుబట్టింది. "గౌరవనీయులైన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు మీరు చేసిన పోస్ట్ సరైనది కాదు. మరోసారి మీరు చేసిన ఆరోపణలు తప్పుగా ఉన్నాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు గాయపడిన పోలీసుకు సాయం అందించారు. పడిపోయిన అతన్ని లేపి గాయాలను పరిశీలించారు. ఇటువంటి తప్పుడు ప్రచారానికి, తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇటువంటి చర్యలు అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తాయి. పోలీసులను కూడా నిరుత్సహపరుస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి మీరు దయచేసి పోలీసులకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాం''అని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ట్విటర్ అకౌంట్లతో పాటు పలు మీడియా సంస్థల ట్విటర్ అకౌంట్లను కూడా ఆ ట్వీట్స్‌కు జతచేసింది.











    ఇదిలా ఉంచితే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబుకు తాజాగా మరో లేఖ రాశారు. రాష్ట్రంలో 600 మందికి పైగా టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆ లేఖలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారయని విమర్శించారు.
    Published by:Sumanth Kanukula
    First published: