Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH POLICE COMBING CONTINUES IN AOB TO CATCH MAOIST SK

ఏవోబీలో అలజడి.. కాల్పుల్లో మావోయిస్టులకు గాయాలు.. పోలీసుల వేట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాల్పుల్లో గాయపడిన చలపతి, అరుణక్క ఎక్కువ దూరం వెళ్లలేరని పోలీసులు చెప్పారు. లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వారి కోసం అడవుల్లో కూంబింగ్ జరుగుతోందని వెల్లడించారు పోలీసులు.

    ఏవోబీ (ఆంధ్రా ఒడిశా సరిహద్దు)లో మళ్లీ అలజడి రేగింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పెదబయలు మండలం లండుల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కీలక సమావేశంలో అగ్రనేత ఆర్ కె, చలపతి, అరుణక్క పాల్గొన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

    ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఆర్కే తప్పించుకోగా అరుణ, చలపతి గాయపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం పోలీసులు అడవిని జల్లెడపడుతున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ముంచంగిపుట్టు పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కాల్పుల్లో గాయపడిన చలపతి, అరుణక్క ఎక్కువ దూరం వెళ్లలేరని పోలీసులు చెప్పారు. లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. వారి కోసం అడవుల్లో రెండు వైపుల నుంచి కూంబింగ్ జరుగుతోందని వెల్లడించారు పోలీసులు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Maoist, Maoists, Odisha, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు