• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH POLICE ARRESTED UP THEFT GANG AFTER SELLING LED TELEVISIONS FOR RS 500 IN JAHHAIAHPETA NEAR VIJAYAWADA KRISHNA DISTRICT FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: రూ.500కే ఎల్ఈడీ టీవీ.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..

Andhra Pradesh: రూ.500కే  ఎల్ఈడీ టీవీ.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..

ఫ్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కృష్ణాజిల్లా (Krishna District) విజయవాడ (Vijayawada) రూరల్ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్ (Sonovision) ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్ఈడీ టీవీలు (LED Televisions), రిఫ్రిజిరేటర్లు (Refrigerators) , ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఓ మినీ వ్యాన్లో లోడ్ చేశారు.

  • Share this:
    ఈ రోజుల్లో ఎల్ఈడీ టీవీ కొనాలంటే కనీసం రూ.12 వేల నుంచి రూ.2లక్షల వరకు ధర పలికేవి ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబమైతే ఓ రూ.20 వేలో.. రూ.25 వేలో పెట్టి టీవీ కొనుక్కుంటారు. కానీ రూ.500లకే టీవీ వస్తుందంటే నమ్ముతారా. అవును అది నిజమే.. కృష్ణాజిల్లాలో ఓ దొంగలముఠా రూ.500లకే ఎల్ఈడీ టీవీలను బేరానికి పెట్టింది. ఎంత దొంగతనంగా తీసుకొచ్చినా మరీ 500 రూపాయలే టీవీ అమ్మడమేంటనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఓ మినీ వ్యాన్లో లోడ్ చేశారు. ఐతే ఈ వ్యాన్ పై కన్నేసిన యూపీ దొంగల ముఠా చాకచక్యంగా చోరీ చేసింది.

    వ్యాన్ ను ఎవరికీ అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఐతే మార్గ మధ్యలో కథ అడ్డం తిరిగింది. వ్యాన్ లో డీజీల్ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు.. వ్యాన్ లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్ వస్తువులున్నాయి. దీంతో చేసేది లేద డీజీల్ డబ్బుల కోసం ఎల్ఈడీ టీవీని రూ.500లకు బేరం పెట్టారు. ఓ ఐదువేలో పదివేలో అయితే కావాల్సిన వాళ్లు వాటిని కొనుక్కునేవారు. మరీ రూ.500లకు బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

    Andhra Pradesh, Vijayawada, Krishna District, Sonovision Showroom, LED Televisions, Refrigerators, Theft, Thieves, UP Theft Gang, Crime, Crime news, AP news, Telugu news, Andhra News, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, కృష్ణాజిల్లా, సోనోవిజన్ షోరూమ్, ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, దొంగలు, దొంగతనం, యూపీ దొంగల ముఠా, క్రైమ్, క్రైమ్ న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఆంధ్రాన్యూస్, జగ్గయ్యపేట, హైదరాబాద్, Jaggaiahpeta,Hyderabad
    పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువుల వాహనం

    ఇది చదవండి: ఎట్టకేలకు ఫ్లైట్ ఎక్కిన చంద్రబాబు.. 9 గంటల హైడ్రామాకు తెర..



    సైలెంట్ గా విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించారు. చోరీ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ రూ.9లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగల ముఠా ఇచ్చిన సమాచారం మేరకు సోనో విజన్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్షలాది రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు తిరిగి దొరకడంతో షోరూమ్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. మొత్తానికి పక్కా స్కెచ్ తో పట్టపగలే దొంగతనం చేసిన యూపీ ముఠా.. డీజీల్ కు డబ్బుల్లేక దొరికిపోవడం ఆసక్తికరంగా మారింది.

    ఇది చదవండి: అమిత్ షా తిరుపతి టూర్ రద్దు.. కారణం అందేనా..?


    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు