Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH PEOPLE SHOCK WITH ELECTRICITY BILL DUE TO TARIFF CHANGE BS

ఏపీ ప్రజలను భయపెడుతున్న కరెంటు బిల్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ప్రజలను కరెంటు బిల్లు భయపెడుతోంది. రెండు నెలల రీడింగ్ ఒకే సారి తీయడంతో ముచ్చెమటలు పట్టిస్తోంది.

    ఏపీలో ప్రజలను కరెంటు బిల్లు భయపెడుతోంది. రెండు నెలల రీడింగ్ ఒకే సారి తీయడంతో ముచ్చెమటలు పట్టిస్తోంది. 500 యూనిట్లు దాటడంతో టారిఫ్ మారిపోయి వేలల్లో బిల్లు వస్తోంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు శాఖ ఏప్రిల్‌లో స్పాట్ బిల్లింగ్‌ను నిలిపివేసింది. దీంతో మార్చి నెలలో వినియోగించిన యూనిట్లను ఏప్రిల్‌ వినియోగంతో కలిపి మేలో బిల్లులు జారీ చేస్తోంది. ఫలితంగా కేటగిరీ మారిపోవడంతో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం, దీనికితోడు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి తిరుపతిలోని ఓ వినియోగదారుడికి ఈ నెలలో రీడింగ్ తీస్తే 531 యూనిట్లు వచ్చింది. ఆ యూనిట్ల ప్రకారం టారిఫ్ మారి రూ.2,542 బిల్లు వచ్చింది. అందులో ఫిబ్రవరిలో సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా చెల్లించిన రూ. 450 మినహాయించి మిగతా బిల్లును చేతిలో పెట్టారు.

    అనంతపురంలో ఓ వ్యక్తికి కూడా రూ.2,522 బిల్లు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రీడింగ్ తీస్తుండడంతో అది 500 యూనిట్లు దాటిపోతోంది. ఫలితంగా టారిఫ్ మారిపోయి యూనిట్‌కు రూ.9.95 వసూలు చేస్తుండడంతో బిల్లులు వేలల్లో వస్తున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం తప్పించాలని కోరుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Electricity bill, Electricity tariff

    తదుపరి వార్తలు