Home /News /andhra-pradesh /

AP Panchayat Elections: ఫిబ్రవరి లో పెన్షన్లలో వస్తాయా..? ఎస్ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు షాక్ తప్పదా..?

AP Panchayat Elections: ఫిబ్రవరి లో పెన్షన్లలో వస్తాయా..? ఎస్ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు షాక్ తప్పదా..?

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడినట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడినట్లేనా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) కోడ్ అమల్లో ఉంది. సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుతో ఎన్నిల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఐతే ఎస్ఈసీ ఆదేశాలతో కొన్ని కీలక పథకాలకు బ్రేక్ పడే అకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నిల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వాలంటీర్లుగా ఉన్న ఉద్యోగస్తులంతా ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగిచ్చేయాలని., అలాగే వాలంటీర్లెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు., దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామ వాలంటీర్లు తమ ఫోన్లను రిటర్న్ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంపై పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 1న పెన్షన్లు మంజూరు చేయాలంటే వాలంటీర్లకు ఫోన్లు తప్పనిసరి. స్మార్ట్ ఫోన్లలో బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెషన్లను మంజూరు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది.

    ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం 6గంటల నుంచే గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఈక్రమంలో వారి దగ్గర నుంచి బయోమెట్రిక్ తీసుకుంటారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా మొబైల్ ఫోన్లు తిరివ్వాలని ఆదేశించిన నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ డైలమాలో పడింది. దీనిపై ఎస్ఈసీ సడలింపునిస్తారా..? లేక ఆంక్షలు కొనసాగిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల అర్హుల నమోదు నిత్యం కొనసాగుతుంటూనే ఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల్లో మార్పులు వంటి పనులు వాలంటీర్లే చేపడుతుంటారు. ఇప్పుడు వీటికి కూడా బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది. పట్టణాల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేకపోవడంతో వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల విధులపై ఎలాంటి ఆంక్షలు లేవు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap grama sachivalayam, Ap welfare schemes, Gram volunteer, Nimmagadda Ramesh Kumar, Village secretariat, Ysr pension scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు