prawns Export: మీసం మెలేస్తున్న ఆంధ్రా రొయ్య.. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతుల్లో టాప్ ప్లేస్

Prawns

కరోనా.. కర్ఫ్యూల కారణంగా దాదాపు వ్యాపార రంగం పూర్తిగా కుదేలైంది.. లాభాల మాటే మరిచిపోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి కష్ట కాలంలోనూ ఆంధ్రా రొయ్యలు మీసం తిప్పాయి. ప్రపంచంలోనే ఎగుమతుల్లో టాప్ ప్లేస్ దక్కింది మన రొయ్యలకు.

  • Share this:
    Prawns Export : కరోనా కాటు.. లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ మన రొయ్య మీసం మెలేస్తోంది. కొన్నాళ్ల కిందట వరకు అంతంతమాత్రంగా ఉన్న రొయ్య ధర ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చాన్నాళ్లుగా ప్రతికూల పరిస్థితులతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కాటు తీవ్ర ప్రభావం చూపించింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో కొనేవారి తగ్గారు. ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కుదేలైంది అనుకున్న ఆక్వా రంగం మళ్లీ పుంజుకుంది. ఆక్వా రైతుకు వీటి ధర పెరుగుదల, ప్రభుత్వం విద్యుత్‌ యూనిట్‌ చార్జీని సగానికి పైగా తగ్గించడం వెరసి ఉపశమనం కలిగిస్తోంది. సాధారణంగా ఆక్వా సాగులో భాగమైన రొయ్యల సాగు జూదంలా ఉండేది. ఒక ఏడాది లాభాల పంట పండితే మరో ఏడాది నష్టాల పాల్జేస్తోంది. దీంతో రైతులు ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా కలిసొస్తుందన్న ఆశతో దీనిని వదులుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం రొయ్య మీసం మెలేసే స్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా పరిస్ధితులు ప్రపంచదేశాలను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుండగా ఈతరహా పరిస్ధితుల్లోనూ భారతదేశం వాణిజ్య,వ్యాపార ఎగుమతుల్లో తనదైన సత్తాను చాటుకుంటుంది.

    2020సంవత్సరానికి సంబంధించి ఎగుమతులపై డీజీసీఐఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ తన సత్తాని చాటుకుంది. ఏపి నుండి ప్రపంచంలోని 61 దేశాలకు రొయ్యలు ఎగుమతవుతున్నాయి. రొయ్యల ఉత్పత్తిలో ఏపి అగ్రస్తానంలో ఉంది. నాణ్యమైన , రుచికరమైన రొయ్యలను సాగు చేస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్ష్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) 2020లో నివేదికలే ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం రొయ్యల ఎగుమతి విలువ అక్షరాల 16,183కోట్లుగా ప్రకటించింది.

    దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల, తద్వారా వస్తున్న ఆదాయనికి సంబంధించిన వివరాలను డీజీసీఐఎస్ తెలిపింది. ఏపి నుండి 45 దేశాలకు బియ్యం ఎగుమతవుతుండగా, వీటి విలువ 3,015.9 కోట్లుగా ఉంది. రొయ్యలతోపాటు, ఫెర్రో సిలికా, మాంగనీస్ వంటి ఖనిజ సంపద ఏపి నుండి 69 దేశాలకు ఎగుమతి అవుతుంది. పొగాకు, క్యాప్సికం వంటివి అధికంగా ఎగుమతైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా వుంటే గుజరాత్ రాష్ట్రం నుండి 48దేశాలకు 77,325.1కోట్ల విలువైన డీజిల్ ఎగుమతులు జరిగినట్లు డీజీసీఐఎస్ నివేదికలో స్పష్టం చేసింది. మహరాష్ట్ర నుండి 77 దేశాలకు డైమండ్స్ ఎగుమతి అవ్వగా మన దేశం నుండి అతిపెద్ద విలువకలిగిన ఎగుమతుల్లో ఇవి ఉన్నాయి. హర్యానా నుండి బిర్యానీలో వినియోగించి బాస్మతి రకం బియ్యం 121దేశాలకు ఎగుమతయ్యాయి. వీటి విలువ అక్షరాల 16,443.09 కోట్లుగా డిజీసిఐఎస్ తెలిపింది. కేరళ నుండి బంగారం అధికంగా ఎగుమతైంది. ఎనిమిది దేశాలకు బంగారం ఎగుమతికాగా దాని విలువ 43,233.83కోట్లుగా నమోదైంది. అదే సమయంలో కేరళ నుండి జీడిపప్పు 47దేశాలకు పంపారు. జమ్మూకశ్మీర్ నుండి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలు, ఢిల్లీ నుండి టర్భోజెట్స్ ఎగుమతి అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ మాసం ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉండగా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మెడిసిన్స్ ఎగుమతులు అధికంగా ఉన్నాయి. కర్ణాటక, బీహార్ ల నుండి హైస్పీడ్ డీజిల్ ఎగుమతైంది.
    Published by:Nagesh Paina
    First published: