ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అంటే అంతలేని ఆనందం. అంతకంటే మించిన సంబరం. ముఖ్యందా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే చెప్పనక్కర్లేదు. కోడి పందేలు, జూదంతో జనాలు హోరెత్తిస్తారు. ఇక సంక్రాంతి సంబరాల పేరుతో కొంతమంది శృతిమించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తోటల్లో అశీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోనసీమలోని కొన్ని ప్రాంతాల్లో మారుమూల కొబ్బరి తోటలే వేదికలుగా చేసుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారు. ఏపీలో కొన్ని చోట్ల జాతరలు, ఉత్సవాల సమయంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేస్తుంటారు. కానీ పండుగ వేడుకల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, రాజోలు ప్రాంతాల్లో బహిరంగంగా ట్రాక్టర్లపైనే రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు.
కోనసీమలో కామన్
సంక్రాంతి పండుగ వస్తే చాలు ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి ఊర్లో ఎక్కడాలేని సందడి నెలకొంటుంది. సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, జూదానికి ఇక్కడ పెట్టింది పేరు. ఈక్రమంలో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు తిరిగొస్తుంటారు. అంతేకాకుండా బడా వ్యాపారులు, నాయకులు కూడా సొంతూళ్లలోనే మకాం వేస్తారు. ఈక్రమంలో వారికి వినోదాన్ని అందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. తోటలను క్లబ్బులుగా మార్చేసి పార్టీలు నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే రాజోలు సమీపంలో కేశనపల్లి అనే గ్రామంలో ఓ మారుమూల తోటలో అమ్మాయిలను తీసుకొచ్చి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ప్రారంభమైన రికార్డింగ్ డాన్సులు సమయం గడుస్తున్న కొద్దీ న్యూడ్ డాన్సులుగా మారిపోయాయి.
పట్టించుకోని పోలీసులు
సంక్రాంతికి ముందు కోడి పందాలు, జూదంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన పోలీసులు ఆ తర్వాత అటువైపు చూడలేదు. సరికదా అస్సలుపట్టించుకోలేదు. పందేల బరుల్లో యదేచ్ఛగా మద్యం అమ్ముతున్నా, లక్షలు పోసి జూదమాడుతున్న అటువైపు చూడలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనే ముమ్మిడి వరం మండలం, పల్లిపాలెం ప్రభల తీర్థంలో ఏర్పాటు చేసిన కోడి పందెం బరిలో రికార్డింగ్ డాన్సులు కూడా నిర్వహించారు. రికార్డింగ్ డాన్సుల సందర్భంగా పాటల విషయంలో మాటామాట పెరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న పోలీసులు మాత్రం చర్యలు తీసులేకపోతున్నారు. దీనికి కారణం కొందరు ప్రజాప్రతినిథులే వీటిని ప్రోత్సహించడం. నేతల నుంచి ఫోన్లు రాగానే అడ్డుకునేందుకు వెళ్తున్న పోలీస్ బృందాలు కూడా వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: East Godavari Dist, Sankranti 2021