బెస్ట్ పోలీస్ స్టేషన్ జాబితా రిలీజ్... ఏపీకి దక్కని చోటు..

తెలంగాణ నుంచి చొప్పదండి పోలీస్ స్టేషన్ ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఎంపిక కాలేదని కేంద్ర హోంశాఖ జాబితాను చూస్తే తెలుస్తోంది.

news18-telugu
Updated: December 7, 2019, 9:45 PM IST
బెస్ట్ పోలీస్ స్టేషన్ జాబితా రిలీజ్... ఏపీకి దక్కని చోటు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని పది బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోశాఖ రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ నుంచి చొప్పదండి పోలీస్ స్టేషన్ ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఎంపిక కాలేదని కేంద్ర హోంశాఖ జాబితాను చూస్తే తెలుస్తోంది. మొత్తం 19 అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర హోంశాఖ ఈ సర్వే చేయించింది. దేశంలో మొత్తం 15,579 పోలీస్ స్టేషన్ల ఉన్నాయి. అయితే, ఒక్కో రాష్ట్రం నుంచి మూడు పోలీస్ స్టేషన్లను సర్వే కోసం ఎంచుకుంది. సుమారు 750 పోలీస్ స్టేషన్లను ఎంచుకోగా, అందులో ప్రధానంగా చిన్న పట్టణాలకు చెందిన పోలీస్ స్టేషన్లనే ఎంచుకుంది. ఈ సర్వేలో మొత్తం 5461 మంది నుంచి సమాచారం సేకరించింది. ఒక్కో పోలీస్ స్టేషన్ గురించి కనీసం 60 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లో సదుపాయాలు, ఎలాంటి కేసులు డీల్ చేస్తున్నారు?, భూ వివాదాలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి?, మహిళలపై కేసులను ఎంత త్వరగా విచారిస్తున్నారు?, పోలీసుల తీరు ఎలా ఉంది?, వెనుకబడిన వర్గాల వారి కేసులను ఎలా డీల్ చేస్తున్నారనే అంశాలను ఈసర్వేలో పాల్గొన్న వారి వద్ద ప్రస్తావించి వారి నుంచి వివరాలు సేకరించారు. ప్రజల స్పందనకు 80శాతం మార్కులు వేయగా, మిగిలిన 20 శాతం మార్కులను సంబంధిత పోలీస్ స్టేషన్‌‌లో వసతులు, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్లు...
అబెర్దీన్ (అండమాన్ నికోబార్ దీవులు)
బాలాసినోర్ (గుజరాత్)
ఏజేకే బుర్హన్‌పూర్ (మధ్యప్రదేశ్)
ఏడబ్ల్యూపీఎస్ థేనీ (తమిళనాడు)అనిని (అరుణాచల్ ప్రదేశ్)
బాబా హరిదాస్ ద్వారక (న్యూ ఢిల్లీ)
బకానీ (రాజస్థాన్)
చొప్పదండి ( తెలంగాణ)
బిచోలిమ్ (గోవా)
బార్గవ (మధ్యప్రదేశ్)
Published by: Ashok Kumar Bonepalli
First published: December 7, 2019, 9:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading