సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కంగారు పడుతున్న మందుబాబులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్. డిసెంబర్ 31, జనవరి 1 వైన్ షాప్లు, బార్లపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తెలిపారు. ఆ రెండు రోజులు కూడా రోజువారిలాగే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ఆయన తెలిపారు. ఇక, గత కొన్ని రోజులుగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 31న, జనవరి 1న పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించనుందని సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. మద్యం దుకాణాలు, బార్లు కూడా మూతపడనున్నాయని చెబుతున్నారు. చాలా మంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. మరికొందరు మందుబాబులు మాత్రం దీనిపై క్లారిటీ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వాసుదేవరెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. న్యూ ఈయర్ సందర్బంగా మద్యం దుకాణాల వేళల్లో ఎలాంటి మార్పులు కానీ, నిషేధం గానీ లేదని చెప్పారు. డిసెంబర్ 31, జనవరి 1న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయనే ప్రచారం నేపథ్యంలో.. తన కార్యాలయానికి చాలా కాల్స్ వచ్చాయని చెప్పారు. అందుకే ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తున్నాయని చెప్పారు.
డిసెంబర్ 31, జనవరి 1న కూడా అదే సమయాల్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు పనిచేస్తాయని తెలిపారు. సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Liquor, Liquor shops