Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS WORLD LARGEST FISH WALE FOUND IN VISAKHAPATNAM BEACH ITS WEIGHT 50KGS MORE NGS VSP

World Largest Fish Whale: తంతిడి తీరంలో అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు

విశాఖకు అనుకోని అతిథి

విశాఖకు అనుకోని అతిథి

World Largest Fish whale: ఆంధ్రప్రదేశ్ ను అనుకోని అతిథి పలకరించింది. అది కూడా ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన అతిథి.. విశాఖ సాగర తీరంలో కనిపించి.. నగర వాసులను పులకించేలా చేసింది. ఎప్పుడూ చూడాని ఆ అతిథిని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు.

ఇంకా చదవండి ...
    World Largest Fish whale shark: ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ (Viskha)తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్ లో బుధవారం స్థానిక మత్స్యకారుల (Fisherman) వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెహరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరంలో కనిపించడంతో నగరవాసులు తన్మయం చెందారు. విశాఖ తంతడి బీచ్‌లో స్థానిక మత్స్యకారులకు ఇది కనిపించింది. సుమారు 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్ షార్క్ మత్స్యకారుల వలలో పడింది. మత్స్యకారులు యథావిథిగా చేప (Fish)ల కోసం వేసిన వలలో వేల్ షార్క్ చిక్కింది. వలను చాలా బరువుగా అనిపించడంతో.. మత్స్యకారులు అందరూ కలిసి పైకి లాగారు. అంతే దాన్ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

    అటవీ శాఖ అధికారులు, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌ను తిరిగి సముద్రంలోకి పంపించారని DFO తెలిపారు. "ఇది వేల్ షార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద చేప. ఇది అంతరించిపోతున్న జాతికి చెందినవని’’చెప్పుకొచ్చారు. అంతరించిపోతున్న షార్క్ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్ ను సురక్షితంగా సముద్రంలోకి పింపిచే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్ వో అనంత్ శంకర్ సూచించారు.

    వెంటనే అటవీశాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్ కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. ఆ తరువాత షార్క్ ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. దీంతో ’ఈ 2-టన్నుల చేప సజీవంగా సముద్రంలోకి తిరిగి వెళ్లింది. మా ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. వేల్ షార్క్ విజయవంతంగా సముద్రపు లోతుల్లోకి వెళ్లింది. స్వేచ్ఛగా ఈదుతోంది’ అని ఆయన చెప్పారు.

    ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి అతడే.. తేల్చి చెప్పిన సీబీఐ అధికారులు

    "మత్స్యకారులకు కూడా పలు సలహాలు ఇచ్చారు. షార్క్ లు లాంటి జీవాలు తీరాలకు కొట్టుకొచ్చిన సందర్భాల్లో నేరుగా రక్షించి, సురక్షితంగా విడుదల చేయడానికి అటవీ శాఖను సంప్రదించమని కోరుతున్నామన్నారు. అలాంటి ఆపరేషన్ల సమయంలో మత్స్యకారులకు వారి చేపల వేట వలలకు ఏదైనా నష్టం జరిగితే పరిహారం ఇవ్వబడుతుంది అన్నారు. వేల్ షార్క్‌లు చేపలు పట్టే వలల్లో చిక్కుకున్నట్లయితే వేల్ షార్క్‌లను విడుదల చేయాలని ఆయన అన్నారు.

    ఇదీ చదవండి : సినిమా కంటే కిరాణా షాపు నయం.. ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు..

    మరోవైపు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న భారీ టేకు చేప పడింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Fishermen, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు