హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Deepavali Village: ఆ ఊరి పేరు దీపావళి.. ఆ పేరు ఎలా వచ్చింది..? ఎక్కడ ఉంది..?

Deepavali Village: ఆ ఊరి పేరు దీపావళి.. ఆ పేరు ఎలా వచ్చింది..? ఎక్కడ ఉంది..?

దీపావళి గ్రామం

దీపావళి గ్రామం

Deepavali Village: కొన్ని ఊరి పేర్లు చాలా వింత వింత గా ఉంటాయి.. అసలు ఇలాంటి పేర్లు కూడా ఉంటాయ అని షాక్ అవ్వాల్సి వస్తుంది. అయితే అలా పేర్లు పెట్టడం వెనుక పెద్ద కారణాలే ఉంటాయి.. ఇలా వింత పేర్లు ఉండడం కామన్.. పండుగ పేర్లు ఉండడం చాలా అరుదు.. అలాగే దీపావళి అనే ఊరు ఉందని మీకు తెలుసా..?

ఇంకా చదవండి ...

Village Name Deepavali: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చాలా గ్రామాలకు వింత వింత పేర్లు ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే పేర్లు ఎలా ఉన్నా.. పండగల పేర్లతో ఊర్లు ఉండడం చాలా అరుదు.. ఉత్తరాంధ్రలో మాత్రం దీపావళి (Deepavali) పేరుతోనే ఓ ఊరుంది. శ్రీకాకుళం (Srikakualam) నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గార మండలం (Gara Mandal)లో ఈ ఊరు ఉంది. దీపావళి అనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు.. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనిపై చుట్టుపక్క గ్రామాల్లో ఓ కథ కూడా చెబుతుంటారు. ఆ కథ ప్రకారం.. శ్రీకాకుళాన్ని పాలించిన రాజు కళింగపట్నం ప్రాంతానికి అప్పుడప్పుడు గుర్రంపై ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు. అలా వెళ్తున్నప్పుడు ఒక రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజును గుర్తించి సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి దీపావళిగానే నామకరణం చేశారని చెబుతుంటారు..

అయితే ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ ఊరి పేరు దీపావళిగానే నమోదై ఉంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. అయితే ఊరి పేరులోనే దీపావళి ఉండడంతో.. గ్రామ ప్రజలు అన్ని పండగల్లోనూ దీపావళినే ఘనంగా జరుపుకుంటారు. ఇది తమకు ఎంతో ప్రత్యేకమైన పండగగా పేర్కొంటారు.. బంధువులను కూడా భారీగా పిలిచి ఓ వేడుకలా జరుపుకుంటారు..

ఇదీ చదవండి: కార్తీక మాసం స్పెషల్ ఏంటి..? ఏం చేస్తే శుభం కలుగుతుంది..? సోమవారానికి ఏంటి ప్రత్యేకత

పండగ పేరు.. మా ఊరు

తమ ఊరికి దీపావళి అని పేరు ఉండడం పట్ల గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేస్తుంటారు.. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు ఉండటం నిజంగా గర్వించదగ్గ అంశం అంటున్నారు. పండగ పేరుతో ఉన్న ఇలాంటి గ్రామంలో జన్మించడం ఎంతో అదృష్టంగా  భావిస్తున్నాం అంటున్నారు.

ఇదీ చదవండి: దటీజ్ స్టాలిన్.. నరికురవ మహిళను కలిసిన సీఎం, కోట్ల విలువైన సంక్షేమ పథకాల ప్రకటన

అందుకే పండగలు ఎన్ని వచ్చినా.. దీపావళిని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటామంటున్నారు. గ్రామస్థులు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ ఊరికి ప్రత్యేక గుర్తింపు ఉంది.. అందుకే కారణం ఆ గ్రామం పేరే.. కేవలం పేరుతోనే ప్రత్యేక గర్తింపు తెచ్చుకుంది దీపావళి. ముఖ్యంగా దీపావళి పండగ ఎప్పుడు వచ్చినా చుట్టు పక్కల గ్రామాల వారికి గుర్తు వస్తుంది. అందుకే  ఈ ఊరి పేరు అందరిలో నానుతూ ఉంటుంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Srikakulam, Villagers

ఉత్తమ కథలు