Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS VERY RARE AND BIG FISH FOUND IN YANAM BEACH IT IS COST MORE THANE 8 THOUSAND RUPEES NGS

Rare Fish: పండుగముందు వలకు చిక్కిన భారీ పండుగప్ప.. మత్య్సకారుల పంట పండింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు

భారీ ధర పలికిన అరుదైన చేప

భారీ ధర పలికిన అరుదైన చేప

Pandugappa Fish: పెద్ద పండుగకు కొన్ని రోజుల ముందే ఓ మత్స్యాకారుల ఇంటికి పండగ వచ్చింది. ఊహించని విధంగ వారి వలకు అతి పెద్ద చేప చిక్కింది. దీంతో వారి అనందాన్ని హద్దేలేకుండా పోయింది.. వారు ఊహించినట్టు ఆ చేప భారీ ధర పలికింది. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
    Big Pandugappa Fish: మత్స్యకారులు చాలామంది ప్రాణాలకు తెగించి వేట కొనసాగిస్తారు.. ఒక్కోసారి చేపలు చిక్కక.. దొరికిన వాటికి సరైన ధర పలుకకా పస్తులు ఉండే రోజులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం అప్పుడడప్పుడూ లక్ ఫేవర్ చేస్తుంటుంది. చాలా అరుదైన చేపలు వారి వలకు చిక్కి.. భారీ ధర పలికేలా చేస్తాయి. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప చేప మత్సకారులకు వలకు చిక్కింది. స్థానిక మత్స్యకారులు చెప్పిన దాని ప్రకారం సాధారరణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు ఉంటాయి అంటా.. కానీ తాజాగా దొరికిన పండుగప్ప సుమారు 16 కిలోలపైనే ఉంది అంటున్నారు మత్స్యాకారులు. అంత పెద్ద చేప తమ వలకు చిక్కడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ముందుగానే తమ ఇంటికి సంక్రాంతి పండుగ వచ్చింది అంటున్నారు.. కచ్చితంగా అది భారీ ధరకు అమ్ముడుపోతుందని వారు ఆశించారు..

    పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆలస్యం చేయాలేదు.. వెంటనే యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌‌కు ఈ భారీ చేపను విక్రయానికి తరలించారు. అక్కడ దీనికి వేలం నిర్వహించారు. వేలంలో ఎనిమిది వేల రూపాయలకు పోనమండ భద్రం, రత్నం దంపతులు ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా అరుదని వారు చెబుతున్నారు. నిజంగా ఇలాంటి చేపను చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. ఈ పండుగప్ప గౌతమి గోదావరిలో మత్యకారులకు దొరికింది. దీనిని ఏషియన్ సీ బాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విషయం తెలియడంతో ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు భారీగా పోటీ పడ్డారు.



    భారీగా కనిపించిన ఈ పండుగప్పకు మార్కెట్ లో భారీ డిమాండ్ పలికిందది. పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. కాగా అరుదైన చేపలు చిక్కితే వాటిని దక్కించుకునేందుకు.. మాంసం ప్రియులు కూడా అంతే ఇంట్రస్ట్ చూపిస్తారు.

    ఇదీ చదవండి : ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్.. నైట్ కర్ఫ్యూ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఇవే

    ఇటీవల ఇలాంటగి చేపలు భారీగానే బయటపడుతున్నాయి. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో సుమారు 750 కేజీల కు పైగా బరువు ఉండే టేకు చేప ఉప్పాడ మత్స్యకారులకు వలకు చిక్కింది. దానిని క్రేన్ సహకారంతో బయటకు తీసుకురావాల్సి వచ్చింది... ఇంత పెద్ద చేపను చూడడానికి చుట్టుపక్కల జనాలు పోటెత్తారు. ఇంత పెద్ద చేపను చూడడం ఇదే ఫస్ట్ టైం అంటూ స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Fish, Fishermen

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు