ANDHRA PRADESH NEWS TELUGU WRITER RECOGNIZED GET AMAZON YEAR OF THE BOOK AWARD NGS VSP
Andhra Pradesh: అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు.. తెలుగు రచయితకు అరుదైన గౌరవం
విశాఖ రచయితకు అరుదైన గౌరవం
Andhra Pradesh: తెలుగు రచయితకు అరుదైన గౌరవం లభించింది. అమెజాన్ బుక్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో వందలమందితో పోటీ పడి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆ విభాగంలో పోటీలో నిలిచిన ఏకైక భారతీయుడిగా కూడా గుర్తింపు పొందారు.
Amazong Book of the year: తెలుగు రచయితకు ఊహించని గౌరవం దక్కింది. విశాఖపట్నానికి చెందిన రచయితకు అద్బుత గుర్తింపు వచ్చింది. అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్ గా విశాఖ రైటర్ పుస్తకం గుర్తింపు పొందింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఇందులో విశాఖ రచయితతో పాటు.. విశాఖకి ఖ్యాతి వచ్చింది. ఇంతకీ ఆ రైటర్ ఎవరు..? ఎవరు..,? ఆ పుస్తకం ఏంటో తెలుసా..? దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 28 వరకు ఆన్లైన్లో నిర్వహించిన ఓటింగులో విశాఖపట్టణానికి చెందిన శ్రీధర్ బెవర రాసిన ‘ద రోలింగ్ ల్యాంబ్స్’ పుస్తకం 2021 సంవత్సరానికి గాను అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్‌గా ఎంపికైంది.
ప్రతి ఏడాది అమెజాన్ ఒక్కో విభాగంలో ఐదు పుస్తకాలను ‘అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసేందుకు ఓటింగ్ నిర్వహిస్తుంటుంది. ఈ పుస్తకాల్లో భారతీయ భాషా కేటగిరి, పిల్లల విభాగం, రొమాన్స్, యంగ్ అడల్ట్, బయోగ్రఫీస్ అండ్ మెమొరీస్, బిజినెస్ అండ్ ఎకనమిక్స్, క్రైం, థ్రిల్లర్ అండ్ మిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, లిటరేచర్ అండ్ ఫిక్సన్ వంటి తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాలను ఎంపిక చేసి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించింది.
ప్రస్తుతం ఎంపిక చేసిన పుస్తకాల్లో రాబిన్ శర్మ, చేతన్ భగత్, స్టీఫెన్ కింగ్, జెఫ్రీ ఆర్చర్, కెన్ ఫొల్లెట్, బ్రాడ్ స్టోన్, మ్యాథ్యూ బ్రెనన్, కబీర్ బేడీ, ప్రియాంక చోప్రా జొనాస్, రెయిన్ బో రోవెల్, కొలిని హోవర్, రస్కిన్ బాండ్, సుధామూర్తి, మానవ్ కౌల్, సంజీవ్ పాలైవాల్ వంటి రచయితలు రాసిన పుసక్తాలు కూడా ఈసారి పోటీపడ్డాయి.
బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో విశాఖ వాసి శ్రీధర్ బెవర రాసిన 'ద రోరింగ్ లాంబ్స్' పుస్తకం విజేతగా నిలిచింది. ఈ విభాగంలో శ్రీధర్ ఒక్కరే భారతీయ రచయిత కావడం గమనార్హం. అమెరికన్ పబ్లిషింగ్ సంస్థ హార్పర్ కాలిన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే బెస్ట్ సెల్లర్‌గా రికార్డులకెక్కింది.
శ్రీధర్ గతంలో రాసిన పలు పుస్తకాలు కూడా అంతర్జాతీయ ఖ్యాతినార్జించాయి. 2018లో విడుదలైన ‘మూమెంట్ ఆఫ్ సిగ్నల్’ పుస్తకం అంతర్జాతీయంగా పలువురి ప్రశంసలు అందుకుంది. శ్రీధర్ బెవర రాసిన పుస్తకాలతో కదిలిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వంటివారు శ్రీధర్‌ను ప్రశంసించారు. శ్రీధర్ చేతుల మీదుగా రెండు బెస్ట్ సెల్లర్స్‌ను అందుకున్న శశిథరూర్.. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి పేదరికం నుంచి ఈ స్థాయికి ఎదిగిన శ్రీధర్ జీవితం తనకు స్ఫూర్తి దాయకమని, అదే తనను ఈ పుస్తకాలు చదవమని తనను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.