ANDHRA PRADESH NEWS TELINILAPURAM BIRD SANCTUARY FOREIGN BIRD ARE NO MORE THIS IS THE REASON NGS VZM
Siberia Birds: విదేశీ పక్షుల కేంద్రంలో విషాదం.. సైబీరియా పక్షులకు ఏమైంది..?
విదేశీ పక్షుల కేంద్రంలో విషాదం
Siberia Birds: తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రంలో విషాదం నెలకొంది. సుమారు 30 పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన సైబీరియా పక్షులు మ్ళతి చెందాయి.. అకస్మాత్తుగా ఇలా అన్నీ ఒకే సారి మరణించడానికి కారణం ఏంటి..?
Siberia Birds: అది ఒక అందమైన పర్యాటక ప్రాంతం.. ముఖ్యంగా వేల రకాల విదేశీ పక్షులు వలస వచ్చి విడిది ఉండే కేంద్రం.. వేలాది కిలోమీటర్లు దాటి వివిధ రకాల పక్షులు ఇక్కడకు వచ్చి సేద తీరుతాయి. పర్యాటకుల మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఇది ఎక్కడో కాదు.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం తేలినీలాపురంలోనే ఉంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో పక్షుల కిలకిలా రావాలతో ప్రాంతమంతా చాలా సందడిగా ఉంటుంది. పర్యాటకులు సైతం వాటిని చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు. ఇలా వింటర్ సందడిగా ఉండాల్సిన ఆ కేంద్రంలో ఇప్పుడు పెను విషాదం నెలకొంది. సుమారు 30 పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ జాతులకు చెందిన సైబీరియా పక్షులు మ్ళతి చెందాయి. దీంతో ఇప్పుడు ఆ పక్షుల మరణం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
జిల్లాకు చెందిన ఫారెస్ట్ అధికారులు, తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రంలో ఉన్న పక్షులు ఇలా మ్ళత్యువాత చెందడంతో దర్యాప్తు చేస్తున్నారు. తేలినీలాపురం చుట్టుపక్కల ఉన్న చెరువులలో ఉండే చేపల వంటి ఆహారం తినడం వల్ల అవి మృత్యువాత పడ్డాయని అధికారులు అంచనాకు వచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం లోని ..తేలినీలాపురం గ్రామం ఉంది. ఈ గ్రామానికి .. ప్రతీ సంవత్సరం 3 వేల పెలికాన్ పక్షులు, పెయింట్ స్టార్క్ పక్షులు.. సైబీరియా నుండి ఈ గ్రామాలకు వస్తుంటాయి. సెప్టెంబర్ నెల ఆరంభంలో వచ్చే ఈ విదేశీ పక్షులు మార్చి వరకూ ఇక్కడే ఉంటాయి. పక్షులను ప్రేమించేవారికి, పక్షుల మీద వివిధ పరిశోధనలు చేసేవారికి, పరిశీలకులకు ఇది స్వర్గం.
దాదాపు 12 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి పక్షులు వస్తుంటాయి. ప్రతీ ఏటా లాగానే ఈ ఏడాది కూడా వేలాది సంఖ్యలో వచ్చే విదేశీ పక్షులు వలస వచ్చాయి. దాదాపు 3 వేల పెలికాన్ పక్షులు తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రానికి ఈ ఏడాది కూడా వచ్చాయి.
అవసరమైన చేపలు, నత్తల వంటి ఆహారం దొరుకుతుండడం, నీటి లభ్యత ఉండడంతో వేలాది కిలోమీటర్ల దూరం నుండి ఈ పక్షులు వస్తున్నాయి. ప్రతీ ఏటా లాగానే ఈ ఏడాది కూడా వేలాది సంఖ్యలో వచ్చే విదేశీ పక్షులు వలస వచ్చాయి. కానీ అకస్మాత్తుగా.. ఈ విదేశీ పక్షుల విడిది కేంద్రంలో ఏం జరిగిందో తెలియదు గానీ, 30 విదేశీ పక్షులు మ్ళత్యువాత చెందడం విషాదం నింపింది.
చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుండి వస్తున్న వ్యర్ధాలు ఇక్కడి చెరువులు, నీటిలో కలిసిపోవడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, కాలుష్యం అధికమవడం వల్ల.. పక్షులు మ్ళత్యువాత పడి వుంటాయని ఇక్కడి పక్షి ప్రేమికులు అంటున్నారు. నీటిబాతుల కోసం ఇక్కడి వేటగాళ్లు చెరువులలో వేసే మందును తిని అవి అప్పుడప్పుడు చనిపోతున్నాయని కూడా చెబుతున్నారు.
గ్రామ సమీపంలోని కర్రివానిచెరువు, దాలిచెరువు, తంపర భూముల్లోని చెరువులను పరిశీలించారు. మృతి చెందిన విదేశీ పక్షులను పోస్టుమార్టం నిర్వహించారు. చెరువులోని చేపలను తినడం వల్ల వాటిలోని పరాన్నజీవులు పక్షుల జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించి పక్షులు మృత్యువాత పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు అటవీ అధికారులు తెలిపారు.
ఇప్పటికైనా ఈ కేంద్రంలో మరిన్ని పక్షులు మ్ళత్యువాత చెందకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇక్కడికి వచ్చిన పక్షుల సంఖ్య 3 వేలకు పడిపోగా.. ఇప్పుడు ఈ విషాద ఘటనతో వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.