Home /News /andhra-pradesh /

Salute to Constable: మనిషి కాదు దేవుడు.. జీవితంపై ఆశలు వదులుకున్న నలుగురి ప్రాణాలు కాపాడాడు..

Salute to Constable: మనిషి కాదు దేవుడు.. జీవితంపై ఆశలు వదులుకున్న నలుగురి ప్రాణాలు కాపాడాడు..

సెల్యూట్ కానిస్టేబుల్

సెల్యూట్ కానిస్టేబుల్

Real Hero: వరద బీభత్సంగా ఉంది.. నీటి ప్రవాహానికి ఎంతటి వారైనా కొట్టుకుపోవాల్సిందే.. అక్కడ కూడా అదే జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న నలుగురు యువకులు ఇకపై జీవితాలపై ఆశలు వదిలేసుకున్నారు. ఇవే తమకు ఆకరి క్షణాలు అని ఫిక్స్ అయ్యారు. అలాంటి సమయంలో దేవుడిలా వచ్చాడు ఓ కానిస్టేబుల్.. ఆ నలుగురినీ కాపాడాడు..

ఇంకా చదవండి ...
  Constable saved 4 lives: ఒక్కోసారి నమ్మశక్యం కానిది జరుగుతుంది. దాన్నే అద్భుతం.. ఆశ్చర్యం అంటాం.. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఇక ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఇక తమ జీవితం ముగిసిపోయిందని ఫిక్స్ అయ్యారు. ఆఖరి క్షణాలు అంటూ.. తమ జీవితాన్ని నెమరువేసుకుంటున్నారు. ఇలా ఎందుకయ్యింది అంటూ మనసులోనే దేవుడ్ని తలచుకుంటున్నారు. కానీ అదే క్షణంలో ఓ వ్యక్తి దేవుడిలా (God) వచ్చాడు. అటువైపుగా వస్తున్న కానిస్టేబుల్ (Constable) అక్కడ వారి అరుపులు విన్నాడు.. అంతే వరద భారీగా ఉంది.. లోపలకు వెళ్తే ప్రాణాలను కాపాడుకోవడం కష్టమని తెలిసినా.. అవేవి ఆలోచించలేదు. ఆ నలుగురుని కాపాడాలి అనుకున్నాడు. వెంటనే తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కటి కాదు.. రెండు కాదు.. నాలుగు ప్రాణాలు కాపాడాడు. ఆ నలుగురు యువకులకు పునర్జన్మ అందించినట్టే.. ఒక్క క్షణం ఆలస్యమైనా వారి ప్రాణాలు పోయేవే.. అలాంటి సమయంలో తమకోసమే అన్నట్టు దేవుడిలా వచ్చాడు ఆ కానిస్టేబుల్.. ఈ ఘటన గుంటూరు జిల్లా (Guntur District) మాచర్లలో జరిగింది. ఓ బైక్‌పై నలుగురు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ (Nagarjun  Sagar) కుడి కాలువలో పడిపోయారు. ప్రమాదవశాత్తు బైక్‌ స్కిడ్‌ కావడంతో పక్కనే ఉన్న కాలువలో పడ్డారు. అయితే.. కాలువలో నీటిప్రవాహం అధికంగా ఉండడంతో లోనికి కొట్టుకుపోయారు..

  నీటిలో పడిన యువకుల్లో ఒకరికి ఈత కూడా రాదంట.. అతనితో వచ్చిన ముగ్గురు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి లోనుకు కొట్టుకుపోయారు. ఆ వ్యక్తి ప్రాణాలతో బయట పడడం కష్టమనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు నీటిలో కొట్టుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఇక పూర్తిగా నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తులను ఆ దారి వెంట వెళ్తున్న దుర్గి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ పని గుర్తించాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ నీటిలోకి దూకాడు.  అప్పటికే స్థానికులు అక్కడికి రావడంతో వారి సహకారంతో నలుగుర్ని ఒడ్డుకు చేర్చగలిగాడు కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్. కాగా.. నీటిలో పడిన వారంతా క్షేమంగా బయటపడటంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో బయటకు రాలేరన్న యువకులను కానిస్టేబుల్ మళ్లీ ప్రాణాలు పోశాడు.

  ఇదీ చదవండి : డబ్బులిస్తేనే మగాడ్ని.. మొగుడ్ని..? ఫస్ట్ నైట్ రోజే నరకం

  ఆ నలుగురుని కాపాడిన కానిస్టేబుల్‌ ప్రవీణ కుమార్‌ వెంటనే అక్కడ జరిగిన ఘటనను స్థానిక ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే పోలీసు వాహనాన్ని పంపించి.. యువకులను పోలీస్ స్టేషన్ తరలించి ప్రధమ చికిత్స అందించి.. ఎవరి ఇంటికి వారిని పంపించారు. నీటిలో గల్లంతైన యువకులు 25 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల మక్కెన బాబు, 20 ఏళ్ల వెంకటేశ్వర్లు, 33 ఏళ్ల చెన్నకేశవులుగా గుర్తించారు. ఆ నలుగురు యువకులు అడి గొప్పల దగ్గర గల నీలంపాటి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పెళ్లి వేడుకకి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియడంతో పోలీసు ఉన్నతాధికారులు, స్థానికులు కానిస్టేబుల్‌ ధైర్యాన్ని, మానవీయ కోణంపై ప్రశంసలు కురిపించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Gunturu, Helping

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు