హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ramathirtham: రామతీర్థం శంకుస్థాపనపై పొలిటికల్ ఫైట్.. టార్గెట్ అశోక్ గజపతి రాజేనా..?

Ramathirtham: రామతీర్థం శంకుస్థాపనపై పొలిటికల్ ఫైట్.. టార్గెట్ అశోక్ గజపతి రాజేనా..?

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

Ramathirtham: రామతీర్థం ఆలయం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వర్సెస్ వైసీపీ మంత్రులు అన్నట్టుగా పరిస్థితి మారింది. చివరికి వ్యవహారం కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.

Ramthirtham Temple Political Fight:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విజయనగరం జిల్లా (Vizianagaram District) రామతీర్థం (Ramathirtham) లో చోటుచేసుకున్న వివాదం పెను దుమారం రేపుతోంది. అధికార, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ మధ్య మాటల యుధ్దం నడుస్తోంది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీసుస్టేషన్‌లో కేసు న‌మోదైంది. బుధవారం రామతీర్థంలోని బోడికొండ కోదండ రామాలయ శంకుస్ధాపన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. అశోక్ గజపతిరాజుపై గుర్రుగా ఉంది. బుధవారం అశోక్ తీరుపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి (Minster vellampalli) చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుకున్న విధంగానే .. బుధవారం రాత్రి ఆలయ ఈఓ అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు సెక్షన్ల కింద అశోక్ పై  కేసులు నమోదు కావడం జరిగిపోయాయి.

ప్రభుత్వ విధులకు భంగం కల్గించడం, గందరగోళం సృష్టించడం, డేమేజ్ చేశారనే అభియోగాలపై 353, 427 సెక్షన్ల కింద నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసారు. ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసుల విషయం లో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జనవరి కోటా విడుదల.. వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఇవే.. ఇలా బుక్ చేసుకోండి

రామతీర్థంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి , తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్ గజపతిరాజుపై పోలీసులకు ఆలయ ఈవో ఫిర్యాదు చేశారు. అనువంశిక ధర్మకర్త‌గా ఉన్న ఆయ‌నికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఫిర్యాదులో ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : సామాన్యుడిలా షాకిచ్చిన మంత్రి.. ఆర్టీసీ బస్సులో టికెట్ కొని ప్రయాణం

బుధవారం బోడికొండపై శంకుస్ధాపన సందర్భంగా ప్రభుత్వ మంత్రులు, అధికారులు వ్యవహరించిన తీరుపై అశోక్ గజపతి రాజు ఫైరయ్యారు. ఈ ఉదయం విజయనగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని అశోక్‌ గజపతిరాజు విమర్శించారు. రామతీర్థం లోని బోడికొండపై సంప్రదాయ బద్దంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని.. వాళ్లకి ఇష్టం వచ్చినట్లు చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి : మేమింతే.. మా ఇష్టం అంటే కుదరదని నానికి బొత్స కౌంటర్.. థ్యాంక్స్ చెప్పిన అనిత

దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం అనుసరించడం లేదని అశోక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన తనపై కక్ష గట్టి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ట్రస్ట్‌ల ఆచారాలు, సంప్రదాయాలు అందరూ పాటించాలి. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమంలో సంప్రదాయం పాటించకపోవడం చూసి బాధ కలిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నాపై ప్రత్యేక దృష్టి ఉందని అందుకే తనను టార్గెట్ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇదీ చదవండి : తంతిడి తీరంలో అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు

శాస్త్రీయంగా జరగాల్సిన పూజా విధానాన్ని, అర్చకులు కొత్త పద్దతిలో చేస్తుంటే సర్కస్ లా చేయొద్దని అన్నానన్నారు. అక్కడే తనకు ఆలయ అధికారులు మర్యాదలు చేయబోతే.. దేవాదాయ శాఖ మంత్రి నా ముందే సిబ్బందిని, పూజారులను తిట్టారన్నారు.

ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి అతడే.. తేల్చి చెప్పిన సీబీఐ అధికారులు

అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరు, మంత్రులు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ .. ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివ్ళద్ది శాఖ మంత్రి బొత్స. ఆలయ ధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరును మరోసారి ఎండగట్టారు. తాను అశోక్ గజపతిరాజుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఫైరయ్యారు.

ఇదీ చదవండి : సినిమా కంటే కిరాణా షాపు నయం.. ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు..

రామతీర్ధంలోని బోడికొండపై రాముని ఆలయ నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు, కింద ఉన్న రామాలయానికి కోటి రూపాయలు కలిపి 4 కోట్ల రూపాయల నిధులతో బుధవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మాజీ మంత్రి, ధర్మకర్త అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్నారు.  చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకొని, వివరాలు తెప్పించుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. బుధవారం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. ఇదేనా మీ పెంపకం., మీ తల్లిదండ్రులు ఇలానే పెంచారా? ఇదేనా సంస్కారం? అన్న మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు.


ఇదీ చదవండి : ప్రధాని మోదీ మెచ్చిన తెలుగు తేజం.. సేల్స్ మెన్ కొడుక్కి నాసాలో ఆఫర్

ఈ సంఘటన పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలకు దిగారు. ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది? గాడిదకు గంధం వాసన తెలియనట్టే! ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతినిజాయితీ-దానం గుణంగల మహారాజు అశోక్ గజపతిరాజు గారి గొప్పతనం తెలియదని మండిపడ్డారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Ramatemple, Vizianagaram

ఉత్తమ కథలు