ANDHRA PRADESH NEWS PROBLEMS IN GOVERNMENT SCHOOLS 194 STUDENTS AND 2 CLASS ROOMS ONLY NGS VZM
Government School: నాడు నేడు అంటూ నిధులు ఖర్చు చేశారు.. కానీ ఈ స్కూల్ పరిస్థితి చూస్తే షాక్ తింటారు..
ప్రభుత్వ పఠశాల దుస్థిితి ఇదీ
Government Schools: నాడు నేడు అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది.. చేస్తూనే ఉంది. పాఠశాల రూపు రేఖలు కూడా మారిపోయాయని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి చూడండి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
Government Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. పేద విద్యార్థులకు ఉన్నత చదువే లక్ష్యంగా నాడు-నేడు (Nadu Nedu) ద్వారా వేల కోట్ల రూపాయలతో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని, కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా సదుపాయాలు ఏర్పాటు చేసామని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతూ వస్తోంది. విద్యార్ధులకు పాట్లు తప్పడం లేదు. నాడు నేడు ద్వారా స్కూల్స్ (Schools)ను మోడల్ స్కూల్స్ గా మారుస్తున్నాం అంటూ చెబుతున్న మాటలు మాత్రమే మిగులుతున్నాయి. ఒక్కో పాఠశాలలో ఒక్కొక్క ఇబ్బందితో విద్యార్ధులు, టీచర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అన్ని సదుపాయాలు ఉన్నా విద్యార్ధులు (Students) లేక మూతపడుతుంటే.. విద్యార్ధులు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) ప్రభుత్వం మౌలిక వసతులను, సదుపాయాలను ఏపీ ప్రభుత్వం (AP Government) కల్పించడంలేకపోతోంది. దీంతో అరకొర చదువులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి. విజయనగరం జిల్లాలోని అలాంటి ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే షాక్ అవుతారు.
ఇది విజయనగరం జిల్లా (Vizianagaram) పార్వతీపురం (Paravathipuram) పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల ఆడబడి వీధిలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాల. ఒకటి నుండి ఐదో తరగతి వరకూ ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో 194 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం ముగ్గురు టీచర్లు పనిచేస్తున్నారు. ఇంతమంది కోసం అక్కడున్న తరగతి గదులు ఎన్నో తెలుసా. కేవలం రెండే. ఆ 194 మంది విద్యార్ధులు ఆ రెండు గదుల్లోనే ఇరుక్కొని కూర్చోవలసి వస్తోంది.
స్కూల్ లో రెండు గదులను ఆనుకొని ఉన్న వరండాలో 30 మంది కింద కూర్చుంటారు. ఇక్కడ ఉన్న ఒక గదిలో 2, 3 తరగతుల విద్యార్దులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ రెండో తరగతి విద్యార్ధులు 36మంది, మూడో తరగతి విద్యార్ధులు 48 మంది అంటే మొత్తం 84 మంది కింద కూర్చుంటారు. వారికి ఒకే సమయంలో ఇద్దరు టీచర్లు బోధించాలి. మరో గదిలో నాలుగో తరగతి విద్యార్ధులు 31 మంది, ఐదో తరగతి పిల్లలు 49 మంది. అంటే.. 80 మంది. ఇలా ఈ ప్రాధమిక పాఠశాలలో 194 మంది చదువుతున్నారు. స్కూల్ వరండాలో ఒకటో తరగతి విద్యార్థులకు క్లాస్ లు చెబుతుంటే.. ఒక గదిలో రెండు, మూడు తరగతులు, మరోగదిలో నాలుగు, ఐదు తరగతి విద్యార్ధులకు చదువులు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
అనేక ఇబ్బందుల మధ్యనే ఈ స్కూల్ లో ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. గదులు లేక, రెండేసి తరగతుల విద్యార్ధులు కలిసి ఇరుకు ఇరుకుగా కూర్చోబెట్టి చదివించాల్సి వస్తోంది. ఇంత మంది విద్యార్ధులు ఒకే క్లాస్ లో కూర్చోవడంతో.. విద్యార్ధులు ఏం చదువుతున్నారో టీచర్లకు అర్ధం కాక, ఆ టీచర్లు ఏం చెబుతున్నారో విద్యార్ధులకు బోధపడక.. ఆ గోల మధ్యలో చదవాల్సిన పరిస్థితి.
గదిలో రెండు వైపులా బ్లాక్ బోర్డులు ఉంటాయి. ఓ వైపు ఒక క్లాస్ విద్యార్ధులు కూర్చొంటే. మరోవైపు ఇంకో తరగతి విద్యార్ధులు కూర్చొంటారు. గదులు సరిపోక పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం 40 మందికి ఒక తరగతి గది చొప్పున ఉండాలి. విద్యార్ధులు కూర్చొని చదివేందుకు ఇబ్బందులు లేకుండా కనీసం బల్లలు ఉండాలి. మరోవైపు బాత్ రూమ్ లు, టీచర్లకు ఒక గది ప్రిన్సిపల్ కు ఒక గది ఇలా అనేక సదుపాయాలు అవసరం. అవేవీ ఇక్కడ మనకు కనబడవు.
ఇదీ చదవండి : తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి.. వారి చదువులు ఆపడం మంచిది కాదంటూ జగన్ కు లోకేష్ లేఖ
మరో వైపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రతీ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అందుకు తగ్గ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పింది. ఒక్కో స్కూల్ కు అక్కడ ఉన్న విద్యార్ధులకు తగ్గట్టుగా ఏఏ సదుపాయాలు కల్పించాలో తేల్చి, వాటికి ఎంత ఖర్చయినా నిధులు కేటాయిస్తామని చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో అటు విద్యార్ధులు, ఇటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందుల మధ్యే స్కూల్ ను నడపాల్సిన దుస్ధితి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.