Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS POWER STAR PAWAN KALAYAN DEMAND TO ENQUIRY ON RTC BUS ACCIDENT IN ANDHRA PRADESH NGS

Pawan Kalyan: బస్సు ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి.. వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్?

బస్సు ప్రమాదంపై విచారణకు పవన్ డిమాండ్

బస్సు ప్రమాదంపై విచారణకు పవన్ డిమాండ్

Pawan on RTC Bus Accident: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని.. వెంటనే విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
    Pawan on RTC Bus Accident:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డి గూడెం వద్ద  ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు (RTC Bus) వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయాన వారిలో ఆరుగు మహిళలు సైతం ఉన్నారు. ఈ ప్రమాదంపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime minster Naredra Modi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అటు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు (vice president venkaiah Naidu), ఏపీ సీఎం సీఎం జగన్ (AP CM YS Jagan) ,  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) సహా ఇతర నేతలంతా  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    తాజాగా ఈ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (jana sena chief pawan kalyan) స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలచి వేసిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. అలాగే, ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

    ఇదీ చదవండి: సిక్కోలు టు బిగ్ బాస్ 5.. ఎలిమినేట్ అయ్యాక గ్లామర్ హద్దులు దాటిస్తున్న ప్రియాంక

    బస్సు ప్రమాద మృతుల్లో డ్రైవర్ తో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరిద్దరి పరస్థితి కాస్త విషమంగానే ఉంది అంటున్నారు వైద్యులు.  అయితే ఈ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు .2 లక్షల  రూాపాయల చొప్పున ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఇటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

    ఇదీ చదవండి: షణ్ముఖ్ మరో రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో ఫస్ట్ టైం.. అదే జరిగితే విన్నర్ అతడే

    ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే ఘటనపై పై మంత్రులు, అధికారులను ఆరాతీసిన జగన్.. మృతుల కుటుంబాలకు  ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సహయాక చర్యలు వేగవంతం చేయాలన్న జగన్.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

    ఇదీ చదవండి: ఆందోళన పెంచుతున్న కరోనా కొత్త వేరియంట్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని ముప్పు

    ప్రధాని మోదీ, సీఎం జగన్ లతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వారు వెల్లడించారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bus accident, Pawan kalyan, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు