Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS POLICE FOCUS ON GANJA SUPPLY AT ANDHRA AND ODISHA BOARDER NGS VZM

Operation Parivarthan: గంజాయి సాగుపై ఉక్కు పాదం.. గిరిజనుల ప్రతిఘటన మధ్యే 800 ఎకరాలు ధ్వంసం.. ఏపీ పోలీసులకు కొత్త పవర్

Operation Ganja in Andhra Pradesh

Operation Ganja in Andhra Pradesh

Operation Ganja: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ప్రధాన ఆదాయం గంజాయిగా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా గంజాయి చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కు పాదం మోపారు.. అయితే అక్కడక్కడా గిరిజనులు అడ్డుపడుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  Operation Ganja at andhra - Odisha Border: దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి (Ganja), డ్రగ్స్ (Drugs) పట్టుబడినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పేరే వినిపిస్తుండటం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలే కేంద్రంగా గంజాయి రవాణా విపరీతంగా జరుగుతుండటంతో.. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం (AP Government) సీరియస్‌గా తీసుకుంది. గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు చాలా తక్కవగా చోటుచేసుకుంటున్నాయన్నారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారన్నారు. 150 ఎకరాల్లో గంజాయి పంటని గిరిజనులే స్వయంగా ధ్వంసం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

  ఏవోబీ (AOB)లోనే ఈ సమస్య అధికంగా ఉందని ఆయన వెల్లడించారు. ఏపీ-ఒడిస్సాల్లో కలిపి మొత్తంగా ఎమిమిది జిల్లాల్లో గంజాయి సమస్య ప్రధానంగా ఉందన్నారు. రాష్ట్రాల సమమన్వయంతో పాటు ఇతర ఎన్ఫోర్సెమెంట్‌ విభాగాలతో కూడా కో ఆర్డినేట్‌ చేసుకుంటున్నా మ న్నారు. గంజాయి సాగు, సరఫరా వెనుక గిరిజనులను అడ్డం పెట్టు కుని ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా.. అనే కోణంలోనూ విచారణను చేపట్టామని ఆయన వెల్లడించారు.
  ఇదీ చదవండి: సగం ధరకే కొత్త బ్రాండెడ్ సెల్‌ఫోన్లు.. ఎగబడ్డ జనం.. ఆ తరువాత షాక్..

  గంజాయి సాగు సమస్యను శాంతి భద్రతల అంశంగా కాకుండా ఆర్థిక-సామాజిక సమస్యగానే చూస్తు న్నామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గంజాయితో పాటు హెరా యిన్ వంటి ఇతర డ్రగ్స్ సమస్యల పైనా ఎస్ఈబీ ఫోకస్ పెట్టిందని ఈ సందర్భంగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు.

  ఇదీ చదవండి: దరువేసి చెప్పిన ఎమ్మెల్యే రోజా.. మొన్న కబడ్డీ.. నిన్న వాలీబాల్.. నేడు డప్పు వాద్యం..

  మరోవైపు గుట్కా, జర్ధా, పాన్‌మసాలా విక్రయాలు కూడా పెరిగాయి. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. శరీరానికి డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి. ఎక్కువగా పేద వర్గాలే వీటికి అలవాటుపడుతుంటారు. ఇప్పటికే గంజాయి అంతానికి నడుం బిగించిన ఏపీ సర్కార్.. హానికరమైన పదార్థాల నిషేధానికి కూడా రంగం సిద్దం చేసింది.

  ఇదీ చదవండి: లాహిరి లాహిరి లాహిరిలో.. పాపికోండల టూర్ కు సూపర్ క్రేజ్.. కార్తీక మాసంలో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు..

  యువత బంగారం భవిష్యత్‌ను నాశనం చేస్తోన్న గుట్కా, జర్ధా లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని డిసైడయ్యింది. ఇప్పటికే వీటి తయారీ, క్రయవిక్రయాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇకపై ఆంక్షలు కాదు.. ఏకంగా నిషేధమే. ఈ మేరకు చట్టం తీసుకురాబోతుంది ఏపీ సర్కార్. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా, జర్ధా, పాన్‌మసాలా, తయారు చేసినా… విక్రయించినా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఎస్సై(S.I.)స్థాయి అధికారి సైతం గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకునే పవర్స్ ఇవ్వనున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganja case, Odisha, Visakhapatnam, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు