P. Anand Mohan, Visakhapatnam, News18,
Papikondalu Boat Ride Starts: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అందమైన పర్యాటక ప్రాంతాలు (Tourist Places in Andhra Pradesh) చాలానే ఉన్నాయి. అందమైన బీచ్ లు, పచ్చనైన వనాలు, నదీపరివాహక ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందులో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. ఐతే కొంతకాలంగా పాపికొండలు యాత్ర (Papikondalu Tour) నిలిచిపోయింది. రెండునర ఏళ్ల తరువాత మళ్లీ పాపికొండల యాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కార్తీక మాసంలో ప్రారంభమైన బోట్ల షికారు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్లు, ప్రస్తుతం 11 బోట్లకు ఫర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్( Minster Avanti Srinivas . బోటు ప్రయాణం విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామన్నారు మంత్రి.. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల ప్రకారం.. భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పోలీసులు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు సిబ్బంది సహకరిస్తాన్నారు. ఆదివారం పోచమ్మగండి నుంచి పాపికొండల పర్యాటక బోట్లను పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. శాటిలైట్ సిస్టంతో చిన్న పిల్లల దగ్గరి నుంచి ప్రయాణీకులందరూ.. లైఫ్ జాకెట్స్ ధరించాలన్నారు. టూరిజం సిబ్బందికి సహకరించాలని సూచించారు. విమానం ఎక్కిన సమయంలో..ఏ విధంగా సీట్ బెల్టు పెట్టుకుంటారో..అదే విధంగా…బోటు ఎక్కి దిగే వరకు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మిగిలిన బోట్లకు త్వరలోనే ఫర్మిషన్ ఇస్తామన్నారు. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించామని..
2019లో కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల యాత్రను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అనుమతి ఇచ్చింది. కేవలం 11 బోట్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 2 టూరిజం బోట్లు, 9 ప్రైవేటు బోట్లు ఉన్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి పోచమ్మగండికి తిరిగి వచ్చేలా పేరాలంటాపల్లిలో ఉండే సమయాన్ని కుదించింది. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం దగ్గర బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు.
ఇదీ చదవండి : ఆ టేస్టే వేరు.. ఒకప్పుడు ఫిరంగులకు.. ఇప్పుడు మసాలా పకోడీలకు కేరాఫ్
పర్యాటకులు ముందుగా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా APTDC వెబ్‌సైట్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 12 వందల 50 రూపాయలు చెల్లించాలి. అటు పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది.
ఇదీ చదవండి : కార్తీక మాసం స్పెషల్.. పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు.. అందుబాటులో ధరలు
గతంలో పెద్దలకు రూ.750 వరకూ తీసుకునేవారు. రాజమహేంద్రవరం నుంచి తీసుకుని వెళ్లి బోటు ఎక్కించి భోజనం, స్నాక్స్ పెట్టి సాయంకాలం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ పూర్తి కావడంతో ఇక బోటింగ్ గండిపోచమ్మ గుడి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములు వరదలో మునిగిపోవడంతో వాటిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు 500 రూపాయలు పెంచింది ప్రభుత్వం..
ఇదీ చదవండి : సామాన్యులను ఏడిపిస్తున్న టమోటా.. రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యే మార్కెట్లోనే కిలో రూ.75
పాపికొండలు టూర్ కోసం పర్యాటక శాఖ పలు ప్యాకేజీలు అమలు చేస్తోంది. ఇందులో ఒకరోజు, రెండు రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజీలున్నాయి. ఈ టూర్ ను ముందుగా ఆన్ లైన్లో www.papikondalu.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ap tourism, Best tourist places