హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Corona Vaccine: 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు

Corona Vaccine: 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి శుభవార్త.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు

Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ ను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. ఒకే రోజు పది కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా టీనేజర్స్ కు ఓ శుభవార్త చెబుతూ.. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

  AP Medical Health Department Key Orders: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) తగ్గుతున్నాయి.. సెకెండ్ వేవ్ (Second Wave) ప్రమాదం ముగిసింది అని అంతా ఊరట చెందుతున్న సమయంలో.. ఇప్పడు కొత్త వేరియంట్ భయపెడుతోంది. తాజాగా ఒకే రోజు 10 కేసులు రావడం.. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య 16కు పెరిగాయి. మరికొంతమంది పరీక్షలు తేలాల్సి ఉంది.. అయితే ఇప్పటికే చాలామందికి ఇంకా వ్యాక్సినేషన్ (Vaccine) పూర్తి కాలేదు.. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా టీనేజర్లకు అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ (Thirdwave) హెచ్చరికలు భయపెడుతున్నాయి. 18 ఏళ్ల లోపు వారిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్ విస్తరన థర్డ్ వేవ్ కి సంకేతాలను వైద్య నిపుణుల అంచనా.. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముందుగానే అలర్ట్ అయ్యింది. కీలక ఉత్తర్వులు జారీ చేసింది..

  ఏపీ వ్యాప్తంగా టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు, 15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముందుగా 15 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి కొత్త ఏడాది కానుకగా శుభవార్త చెప్పింది. జనవరి ఒకటి నుంచి టీనేజర్ల కు వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌ ను ప్రారంభించాలని ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది.

  ఇదీ చదవండి : న్యూ ఇయర్ వేడుకలు అంటూ రోడ్డుపైకి వస్తే అంతే.. సీపీ వార్నింగ్.. గైడ్ లైన్స్ ఇవే

  టీనేజర్ల వ్యాక్సిన్ తో పాటు.. బూస్టర్ డోస్ పైనా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది.

  ఇదీ చదవండి : పది రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పందెం కోళ్లు.. ఎందుకో తెలుసా..? అయినా ముందుకు రాని యజమానులు

  టీనేజర్ల వ్యాక్షినేషన్.. బూస్టర్ డోస్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలామంది బూస్టర్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. రెండు డోస్ లు వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతుండడం ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి మయంలో బూస్టర్ డోస మాత్రమే రక్షిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona alert, Corona Vaccine

  ఉత్తమ కథలు