Old lady in forest: దేవుడ్ని చూడడమే లక్ష్యం.. 70 ఏళ్లుగా అడవిలోనే ఆవాసం.. కర్పూరమే ఆహారం..

70 ఏళ్లుగా అవడిలోనే జీవనం

Old Lady: ఆమె వయసు 87 ఏళ్లు.. చిన్నప్పటి నుంచి దేవుడ్ని చూడాలన్నది ఆమె కోరిక.. ఇంట్లోవాళ్లు చెప్పినా వినకుండా 12 ఏళ్లకు అడవిలోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ అక్కడే ఉంటుంది. కానీ కర్పూరం తప్ప ఏం తినకుండానే ఆమె జీవిస్తోంది..

 • Share this:
  Old lady stay in forest: దేవుడు కరుణించాలి.. తమ కోరికలు తీర్చాలని.. ఒక్కసారైనా దేవుడు తమ మొర ఆలకిస్తాడని భావిస్తూ పూజలు, వ్రతాలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు. నోములు నోచుతారు. తీర్థయాత్రలు చేపడతారు.. దేవుడి దయ తమపై ఉండడానికి ఇలా ఎన్నో పాట్లు పడుతుంటారు. దేవుడుపై భక్తులకు ఉండే నమ్మకం అలాంటింది. అలా పూజలు, వ్రతాలు చేయడం కామన్.. అయితే పద్మావతి (Padmavathi) అనే మహిళ మాత్రం దేవుడుని చూడడమే తన లక్ష్యం అంటోంది. ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువ చేస్తుండడం.. ఆధ్యాత్మిక కథలు వినడంతో.. దేవుడుపై అపారమైన నమ్మకం పెరిగింది. పురాణ కథలు విని.. అప్పటి మునులు లా తాను కూడా దేవుడ్ని దర్శించుకోవాలని సంకల్పించింది. అయితే సాధారణంగా పురాణాల్లోనూ, కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం కానీ చూసిన అనుభవం లేదు. ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్లు ఉన్నారంటే నమ్మలేం కదా! కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఒకటి రెండేళ్లు కాదు.. ఆమె ఏడు దశాబ్దాలుగా (7 Decades)ఒంటరిగా అడవిలోనే ఉంటుంది.

  అడవుల్లోకి ఎప్పుడు వెళ్లింది..
  విజయనగరం జిల్లా (Vizianagaram District) గజపతినగరం (Gajapathi Nagaram) మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే ఏడు దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. తనని వేంకటేశ్వర స్వామి ( Lord Venkateswara Swamy)పిలుస్తున్నారంటూ.. 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్లి.. అక్కడే నివాసం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు.

  కొండపై గుడి కట్టిన గ్రామస్తులు..
  12 ఏళ్ల వయసులోనే ఎవరికీ చెప్పకుండా అడవిలోకి వెళ్లిందని తెలియడంతో.. ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రాణాలు అయినా తీసుకుంటాను కానీ దేవుడ్ని చూడకుండా రానని తేల్చి చెప్పేసింది. ఎంతగా ప్రయత్నించిన పద్మావతి అంగీకరించలేదు. దీంతో కూతురు ప్రాణమే ముఖ్యమని ఎక్కడ ఉంటే ఏంటని చేసిది లేక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేశారు. తన దైవం వేంకటేశ్వర స్వామి అని.. అక్కడి నుంచి రాలేనని చెప్తూ.. కొండపై ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండేది. దీంతో ఆమె విషయం తెలిసిన గ్రామస్తులు చుట్టు పక్కల గ్రామాల సహకారంతో ఆ కొండ పై గుడి నిర్మించారు.

  ఇదీ చదవండి: వ్యాయామం చేయకుండానే.. బెల్లీఫ్యాట్ కరిగించొచ్చు.. ఈ 5 విషయాలు తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం

  ఎలాంటి ఆహారం తింటోంది..?
  ఆ గుడిని చూసేందుకు వచ్చే వారు.. అక్కడ ఉండే పద్మావతికి పాలు, పళ్లు, కానుకలు లాంటివి ఇచ్చేవారు. కానీ ఆమె ఏమి తీసుకునేది కాదని, అవన్నీ మళ్లీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల దూపం, టీ మాత్రమే తీసుకుంటుందని చెబుతున్నారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు.
  Published by:Nagesh Paina
  First published: