హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Orphan Girl life: నాన్న లేడు.. అమ్మ రాదు.. ఆధార్ లేదని అధికారులు వదిలేశారు.. అయ్యో జ్యోతి..

Orphan Girl life: నాన్న లేడు.. అమ్మ రాదు.. ఆధార్ లేదని అధికారులు వదిలేశారు.. అయ్యో జ్యోతి..

అయ్యో జ్యోతి

అయ్యో జ్యోతి

Orphan Girl No Support From Government: నాన్న చిన్నప్పుడే చనిపోయింది. ఆ తరువాత మరో పెళ్లి చేసుకున్న అమ్మ.. కన్న బిడ్డను కాదనుకుంది. చివరకు వృద్ధాప్యంలో ఉన్న తాతే ఆ ఆడబిడ్డకు ఆధారంగా ఉన్నాడు. ప్రభుత్వం అండంగా ఉంటుంది అంటే ఆమెకు ఆదార్ కార్డు లేదని అధికారులు పట్టించుకోవడం లేదు.. దీంతో తనను ఆదుకునేవారు లేరా అంటూ జ్యోతి కన్నీరు పెడుతోంది..

ఇంకా చదవండి ...

  Orphan Girl No Support From Government:  అమ్మ లేదు.. నాన్న లేడు.. ఆదుకునే దిక్కు లేదు.. పోనీ అధికారులైనా పట్టించుకుంటారా అంటే.. ఆదార్ (aadhar) లేదంటూ వదిలేస్తున్నారు.. ఇది అనాథ జ్యోతి కథ..  విశాఖపట్నం (Viskhapatnam)లోని  బర్మా కాలనీకి చెందిన గొర్లె సత్యవతికి కొత్తవలసకు చెందిన గురయ్యతో పుష్కర కాలం కిందట వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె జ్యోతి ఉంది. అయితే తండ్రి గురయ్య ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో సత్యవతి తన బిడ్డ జ్యోతితో ఎస్‌.కోట (S Kota)లోని తండ్రి అంకులు దగ్గరకు వచ్చేసింది. రెండేళ్ల కిందట సత్యవతి.. తన జీవితం కోసం మరో వ్యక్తిని వివాహమాడి (Marriage).. కన్నబిడ్డ అయిన జ్యోతిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో తండ్రి లేక తల్లి వదిలేయడంతో తాత దగ్గర జ్యోతి ఉంటోంది. కానీ తాతే తాను బతకడానికి తీవ్ర అవస్థులు పడుతున్నాడు. తట్టా, బుట్ట అల్లి విక్రయించగా వచ్చే కాసింత డబ్బు వస్తోంది. అది తినడానికి కూడా సరిపోవడం లేదు. ఇంత పేదరికం మధ్య మనమరాలు జ్యోతితో అష్టకష్టాల నడుమ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరికీ కనీసం ఇల్లంటూ లేకపోవడంతో పుణ్యగిరిలోని ప్రభుత్వ సామాజిక భవనంలోనే తలదాచుకుంటున్నారు.

  దయ చూపని అధికారులు

  ఇన్ని అవస్థల నడుమ కూడా జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో (Government School) ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి (Ammavodi), జగనన్న విద్యా కానుక (Jagan anna vidhya kanuka) లాంటి పథకాలు ఏవీ ఆమెకు అందడం లేదు. దీనిపై ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు. ప్రభుత్వ అధికారులకు, స్థానిక నేతలకు వినతులు ఇస్తున్నా.. ఎవరూ కనికరించడం లేదు. చదువుపై తనకు ఇష్టం ఉన్నా.. ఎవరూ అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది జ్యోతి...

  ఇదీ చదవండి: పెళ్లి ముచ్చట తీరలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్య దాంపత్యం అనుకుంటే.. అంతలోనే..

  అయితే ఆమె ఆవేదనను అధికారులు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఆధార్‌ లేకపోవడమే. ఆధార్‌ లేకపోవడంతో పాఠశాలలోని ఛైల్డ్‌ ఇన్‌ఫో యాప్‌లో జ్యోతి వివరాలు నమోదు కావడం లేదని హెచ్‌ఎం ఎం.పార్వతి అంటున్నారు.

  ఇదీ చదవండి: మత్స్యకారుల పంట పండించిన గోల్డెన్ ఫిష్.. ఈ చేప ఖరుదు తెలిస్తే షాక్ అవుతారు..? ఎందుకంత డిమాండ్

  తనకు చదువుకోవాలని ఉందని, వసతి గృహంలో వేస్తే చదువుకుంటానని జ్యోతి చెబుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చిన్నారి జ్యోతికి ప్రభుత్వ పథకాలు అందేలా, చదివేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఆ చిన్నారి ఆశను బతికించాలని ఆశిద్దాం.

  ఇదీ చదవండి: పెళ్లికి వెళ్తుంటే ప్రాణాలు తీసిన టైరు.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: AADHAR, Andhra Pradesh, AP News, Orphaned girl

  ఉత్తమ కథలు