ANDHRA PRADESH NEWS NINE PANDEM KOLLU ARRESTED LAST TEN DAYS THEY ARE IN WEST GODAVARI JAIL NGS
Pandem Kodi in Jail: పది రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పందెం కోళ్లు.. ఎందుకో తెలుసా..? అయినా ముందుకు రాని యజమానులు
పది రోజులుగా జైల్లో పందెం కోళ్లు
Pandem Kodi in Jail: సాధారణంగా పోలీసులు స్టేషన్ లో ఎవరుంటారు అంటే.. నేరం చేసే వాళ్లు.. దొంగలు, దొపీడీ దారులు, ఖైదీలు వీళ్లు మాత్రమే ఏడు ఊసలు లెక్కపెడుతుంటారు.. కానీ ఓ పోలీస్ స్టేషన్ జైల్లో పందెం కోళ్లను పెట్టారు. వాటికి పోలీసులు పహారా కాస్తున్నారు. ఒకటి రెండు రోజులు కాదు.. గత పది రోజులుగా ఇవి జైల్లోనే ఉన్నాయి. ఎందుకో తెలుసా...?
Pandem Kodi in Jail: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంక్రాంతి(Sankranthi) సందడి అప్పుడే కనిపిస్తోంది. ముఖ్యంగా పెందెం కోడి కాలు దువ్వుతోంది.. ఇప్పటికే చాలా చోట్ల బరులు కూడా సిద్ధమయ్యాయి.. సంక్రాంతి సందడిలో భాగంగా ముందుగానే కొందరు పందాలు కాస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పందెం కోళ్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇలా బరుల దగ్గర.. యజమానుల ఇంటి దగ్గర కనిపించాల్సిన పందెం కోళ్లు.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ జైల్లో ఉంటున్నాయి. గత పది రోజులుగా అవి జైల్లోనే ఉన్నాయి. దీంతో పోలీసులే వాటికి కావాల్సిన తిండి, నీళ్లు పెడుతున్నారు. గత పది రోజులుగా ఇవి జైల్ (Jail)లో నే ఉన్నా.. అవి తమవే అంటూ ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే అవి ఏ నేరం చేయలేదు.. అసలు వాటి ప్రమేయమే లేదు.. కానీ పది రోజులుగా జైల్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు పోలీసులే ఇప్పుడు పందెం కోళ్లను మేపాల్సిన పరిస్థితి నెలకొంది.. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కోళ్ల పందేలే. ఏపీలో పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కోళ్ల పందేలను నిర్వహిస్తుంటారు. వీటిపై ఎప్పుడూ ఆంక్షలు ఉన్నా.. పందాలు మాత్రం నిరంతంరగా కొనసాగుతూనే ఉంటాయి. పందేలను నిర్వహించకూడదని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా.. రాజకీయ నేతల (Political Leaders) అండతో డోంట్ కేర్ అంటుంటారు నిర్వాహకులు.
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో పందేం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి నుంచే పందేలను నిర్వహిస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ యదేచ్ఛగా కోళ్ల పందాలను నిర్వహిస్తున్నారు. వేలల్లో బెట్టింగులకు పాల్పడుతున్నారు. కఠిన ఆంక్షల నేపథ్యంలో తాజాగా పాములపర్రు, కలుగొట్ల గ్రామాల్లోని కోళ్ల పందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. అక్కడే పట్టుబడ్డ పలువురు పందెం గత పది రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నాయి. కోళ్లను విడిపించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
మామూలుగా అయితే పందెం కోళ్ల ఓనర్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫైన్ కట్టి వాటిని తీసుకెళ్తారు. అయితే ఈ సారి కఠిన ఆంక్షలు ఉన్నాయి. కోళ్ల పందెం నిర్వహిస్తున్నారని తెలిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు పదే పదే చెబుతున్నారు. దీంతో కోళ్లు తమవి అని ఎవరైనా ముందుకు వస్తే కఠిన శిక్షలు తప్పవని భయపడుతున్నారు. దీంతో వారు తమ కోళ్ల కోసం ముందుకు రావడం లేదు. అయితే ఈ పందెం కోళ్లను తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో పోలీసులే వాటి పోషణను చూసుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.