Home /News /andhra-pradesh /

Marriage Twists: డబ్బులిస్తేనే మగాడ్ని.. మొగుడ్ని..? ఫస్ట్ నైట్ రోజే నరకం

Marriage Twists: డబ్బులిస్తేనే మగాడ్ని.. మొగుడ్ని..? ఫస్ట్ నైట్ రోజే నరకం

ఫస్ట్ నైట్ రోజే నరకం

ఫస్ట్ నైట్ రోజే నరకం

Marriage twitst: కొత్తగా పెళ్లైన వెంటనే పుట్టింటి నుంచి మెట్టినింట అడుగు పెట్టిన మహిళ ఎన్నో ఆశలతో తన జీవితాన్ని ఊహించుకుంటుంది. బాధ్యతలే కాదు.. భర్త అనే బంధం జీవితంతం తోడుగా ఉంటుందని ఆశిస్తుంది. కానీ కొంతమంది యువతులకు తొలి రోజే నరకం చూపిస్తున్నారు.. భర్తలు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

ఇంకా చదవండి ...
  P. Anand Mohan, Visakhapatnam, News18
  Gay Husbands:  వివాహం (Marriage). భారత దేశంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మతం వేరైనా.. కులాలు ఏవైనా పెళ్లికి అంతా చాలా విలువ ఇస్తారు. ఇక మహిళలు అయితే పెళ్లైన తరువాత.. కన్నవారిని అందరినీ వదిలి.. భర్తే (Husband) సర్వస్వం  అంటూ  ఏడుగు అడుగుల బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలి అనుకంటున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వస్తే బాధ్యతలు పెరగడమే కాదు.. బలమైన బంధం తోడుగా నిలుస్తుందని కలలు కంటారు.. మూడు ముళ్ల బంధం ముచ్చటైన కాపురానికి నాంధి పలుకుతుందని ఆశలు పెట్టుకుంటారు.. ఇలా మదిలో ఎన్న ఆశలు..  కోరికలతో ఫస్ట్ నైట్ (First Night) రోజు.. పాల గ్లాస్ తో భర్త.. దగ్గరకు వెళ్తారు.. నేటి నుంచి నువ్వు నా సర్వస్వం.. అని తనను అర్పించుకోవాలి అనుకుంటున్నారు.. అలా ఎన్నో ఊహలతో పడకగదిలోకి అడుగుపెట్టే.. యువతులకు.. భర్త తొలి రేయే షాక్ ఇస్తే.. వారి బాధ ఎవరికి చెప్పగలరు.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.

  అమ్మాయి పేరు కళ్యాణి( పేరు మార్చాం). హైదరాబాద్ లో ఉంటోంది. పెళ్లికోసం ఎన్నో కలలు కంది.. పెద్దలు కుదిర్చిన సంబంధంతో ఓ యువకుడ్ని పెళ్లాడింది. ఇక తనజీవితం సరికొత్తంగా ఉంటుందని కోటి ఆశలతో మొదటి రాత్రి భర్త దగ్గరకు వెళ్లింది.. ప్రేమగా అక్కున చేర్చుకోవాల్సిన ఆ భర్త తొలి రోజే నరకం చూపించడం మొదలు పెట్టాడు.

  ఇదీ చదండి : ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

  తనను ముట్టుకోవాలంటే రెండున్నర లక్షలు కావాలన్నాడు కట్టుకున్న భర్త. ఇదెక్కడి వింత అనుకుంటూనే.. తన సంపాదనంతా భర్తదే కదా అనే ఉద్దేశంతో అడిగిన వెంటనే ఆ డబ్బు అతడికి ట్రాన్సఫర్ చేసింది... కానీ "ఆ తంతే" జరగలేదు. నెలలు గడుస్తున్నాయి. తన భర్త దగ్గరకి రావట్లేదని ఇంట్లోవాళ్లకి చెప్పింది. "విషయం" తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. తమ కుమార్తె జీవితం బుగ్గిపాలైందని లబోదిబోమన్నారు. పెద్దలు కూడా అబ్బాయిలో "విషయం" లేదని తేల్చేశారు. తాను కట్టుకున్నవాడు మగాడు కాదంటోంది అమ్మాయి. మెడికల్ టెస్ట్ లకి రమ్మంటే రానంటాడు.. విడాకులు ఇస్తే తనతో పాటు.. తన కుటుంబ పరువు పోతుందని ముందుకు రావడం లేదని.. ఆ వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

  ఇదీ చదండి : వరదలు మంచెత్తితే టాలీవుడ్ ఎక్కడుంది..? టికెట్లు మాత్రం పెంచాలా..? వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  మరో అమ్మాయి పేరు వాసవి( పేరు మార్చాం). భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. ఆయనదీ ఇదే బాగోతం. "అసలు విషయం" లేదని పెద్దలు అంటున్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు. మెడికల్ టెస్ట్ లకి రమ్మని పెళ్లి పెద్దలు మధ్యవర్తులు అడిగారు.  తాను మగాడ్నేనని నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటాడు ఆ యువకుడు. కానీ అమ్మాయితో మాత్రం కలవనంటాడు. ఇదేంటో అర్ధమయ్యి అర్థంకాక.. ఆ పెళ్లిపెద్దలు పోలీసులు, పెద్ద మనుషులు.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

  ఇదీ చదండి : భక్తులకు బిగ్ షాక్..? 16 నిమిషాల్లోనే 3 లక్షల టికెట్లు.. కరోనా భయమే కారణమా..?

  ఇప్పుడు  హైదరాబాద్, విశాఖ లాంటి మహా నగరాల్లో చాలా పెళ్లిళ్లు ఇలాగే పెటాకులవుతున్నాయి. పెళ్లైన వారానికే అసలు సంగతి తెలుస్తోంది. వెయ్యి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని చాలా మంది అంటారు. పెళ్లికి.. కాపురాని కారణమైన కాపురానికి పనికిరాని విషయాన్ని దాచి కొందరు పెద్ద తప్పే చేస్తున్నారని లాయర్ల మాట.

  ఇదీ చదండి : రోజాకు ఆత్మ గౌరవం లేదా..? కన్నీరు పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని చంద్రబాబుకు బొత్స ప్రశ్న

  పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే ఇలాంటి రెండు కేసుల విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అలాగే పెళ్లి చేసిన అమ్మాయి తరఫు వాళ్లకి పెద్ద ఎత్తున డబ్బూ పోయింది. కట్నకానుకల రూపంలో లక్షలు చదివించేసి.. ఆడంబరంగా పెళ్లి చేసిన ఆ పెద్దలు పెళ్లి కుమారుడిలో లోపం ఉందని తెలియడంతో ఖంగుతింటున్నారు.

  ఇదీ చదండి : ఏపీలో టమాట దొంగలున్నారు జాగ్రత్త.. పక్కా స్కెచ్ తో వందల కిలోల టమాటాలు మాయం

  చెప్పిన రెండు ఘటనల్లోనూ అమ్మాయిలకి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. జరిగిన పెళ్లి పెటాకులే. మరో పెళ్లి చేసుకోవాలంటే మొదటి సంబంధం విడాకులు అవ్వాలి. అలా కాకుండా పెళ్లిచేసుకోవడానికి వీలుకాదు. మరోవైపు ఇలాంటి రకం అబ్బాయిలు సంఘంలోకి తమ గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగని అమ్మాయి వైపునా న్యాయం జరగదు. తాము ఈ టైపు అనే విషయాన్ని బయటపెట్టడానికి తమలో తామే  కుమిలిపోతున్నారు. కొందరైతే మానసిక జబ్బులకి గురవుతున్నారు. ఇంకొందరు ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ చేయడంతో.. పాటు వారి యధాతథ స్థితిని తెలపాలన్నది మానసిక నిపుణుల మాట. ఇదీ చదండి : రాకాసి రాయల చెరువు.. మరోసారి డేంజర్ బెల్స్.. వరుస లీకేజీలతో ప్రజల్లో భయం భయం

  ఇక ఇలాంటి రకం అబ్బాయిలు చాలా వరకూ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారనేది మానసిన నిపుణుల మాట. పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో ఇలాంటి విషయాల్ని ముందే తెలుసుకునే అవకాశం ఉండబోదు. అబ్బాయి ఆస్తిపాస్తులు.. చదువు, ఉద్యోగం, గుణగణాలు చూస్తారే తప్ప.. ఈ లోపం ఉంటుందని అమ్మాయిని ఇచ్చేవారికి అవగాహన ఉండదుకదా అంటున్నారు. గతంలో అయితే ఈ విషయం తెలిసినా.. మహిళలు సర్దుకుపోయేవారని.. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన పెరగడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి అంటున్నారు మానసిక నిపుణులు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు