హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag Beach: విశాఖ సాగర తీరంలో అనుకోని అతిథి సర్ ప్రైజ్.. కనుమరుగవుతున్నాయని ఆందోళన

Vizag Beach: విశాఖ సాగర తీరంలో అనుకోని అతిథి సర్ ప్రైజ్.. కనుమరుగవుతున్నాయని ఆందోళన

విశాఖ బీచ్ లో డాల్ఫిన్

విశాఖ బీచ్ లో డాల్ఫిన్

Dolphins at Beach: ఢాల్పిన్ ను చాలా దగ్గర చూడాలని చాలామంది అనుకుంటారు.. అవి నీటిలో ఎగిరి పడుతుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటాయి. అలాంటి ఢాల్పిన్ ను ముట్టుకునేంత దగ్గర చూస్తే ఆ ఫీలింగే వేరు.. విశాఖ బీచ్ లో సందర్శకులకు అలాంటి అనుభవమే ఎదురైంది.. ఇంతకీ ఏం జరిగిదంటే..?

ఇంకా చదవండి ...

Vizag Beach: విశాఖ సాగర తీరం (vizag beach)లో డాల్ఫిన్ సందడి చేసింది. చాలా అరుదుగా.. తీరానికి సుదూరంగా సముద్రం లో కనిపించే జీవి ఒడ్డుకు వచ్చి కనువిందు చేసింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి వెళ్లే మార్గంలో తీరానికి డాల్ఫిన్ (Dholphin)కొట్టుకు వచ్చింది. అయితే అప్పటికి ఇంకా ఆ డాల్ఫిన్ కు ప్రాణం ఉందని గమనించిన స్థానికులు తిరిగి సముద్రంలోకి పంపించారు. అసలు సముద్ర తీరంలో అరుదుగా కనిపించే డాల్ఫిన్ తీరానికి రావడంతో ఆ సమయంలో బీచ్లో ఉన్న సందర్శకులు ఆసక్తిగా గమనించారు. సాధారణంగా డాల్ఫిన్‌లు లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇవి చాలా అరుదుగా తీరం సమీపంలోకి వస్తుంటాయని మత్స్యకారులు (Fisherman)చెబుతున్నారు. దూరం నుంచి అయినా డాల్ఫిన్ ఒక్కసారి చూడాలనిచాలామంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది డాల్ఫిన్ ఇంత దగ్గరగా కనిపించే సరికి దాన్ని చూసేందుకు అంతా ఎగబడ్డారు. అయితే ప్రాణంతో ఉండడంతో వెంటనే అక్కడ ఉన్న మత్స్యకారులు దాన్ని సముద్రంలోకి పంపించారు. కానీ సముద్రంలో బోట్లు తగలడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇలా కొట్టుకు రావడం సహజం జరుగుతుందంటున్నారు స్థానికులు. అలాగే ఈ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చినట్టు భావిస్తున్నారు. ఇలా బోట్లు తగులుతుండడంతో చాలా వరకు డాల్పిన్ జాతి అంతరిస్తోందని ఆందోళన చెందుతున్నారు జంతు ప్రేమికులు..

విశాఖ బీచులు చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే డాల్ఫిన్ మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుంది. సరిగ్గా రెండు నెలల క్రితం విశాఖ తీరంలో డాల్ఫిన్‌లో సందడి చేశాయి. రుషికొండ లోని లివిన్‌ అడ్వెంచర్‌ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు స్పీడ్‌ బోట్‌లో తీరం నుంచి సుమారు మైలు దూరం వెళ్లగానే డాల్ఫిన్లు కనిపించాయి. 15కుపైగా డాల్ఫిన్లు అలలతో పోటీపడుతున్నట్లు ఎగురుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాలను లివిన్‌ అడ్వెంచర్స్‌ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు.

ఇదీ చదవండి: దరువేసి చెప్పిన ఎమ్మెల్యే రోజా.. మొన్న కబడ్డీ.. నిన్న వాలీబాల్.. నేడు డప్పు వాద్యం..

రెండేళ్ల కిందట కూడా ఇలాగే డాల్ఫిన్లు కనిపించాయని. మళ్లీ ఇప్పుడు అవి కనబడ్డాయని స్కూబా డైవింగ్‌ ప్రతినిధులు చెబుతున్నారు. వివిధ దేశాల సముద్ర తీరాల్లో విరివిగా కనిపించే డాల్ఫిన్లు సాగర తీరంలో సందడి చేశాయి. సముద్రంలో అవి పై పైకి ఎగిరి పడుతుంటూ ఆ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు.. అలాంటి అందమైన డాల్ఫిన్లు అంతరిస్తే ఎలా అని ఆందోళన పెరుగుతోంది.

ఇదీ చదవండి:నీట మునిగిన ఆ రెండు జిల్లాలు.. మరో మూడు రోజుల పాటు వానలే వానలు.. ఈ ప్రాంతాల్లో అప్రమత్తం

మరోవైపు అంతకుముందు శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో కూడా డాల్ఫిన్ కలకలంరేపింది. వజ్రపుకొత్తూరు మండలంలోని కంబాలరాయుడు పేట తీరానికి ఓ డాల్ఫిన్‌ కొట్టుకొచ్చింది. సుమారు నాలుగన్నర అడుగుల పొడవు, 100 కిలోల బరువు ఉంది. దీన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించి సముద్రంలో తిరిగి విడిచి పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది అప్పటికే చనిపోవడంతో సమీప దిబ్బల్లోనే పాతి పెట్టారు. ఇంజిన్‌ బోట్లు తగిలో.. కలుషిత జలాల వల్ల మృత్యువాత పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు