Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS HUSBAND CARRY HIS WIFE TO TAKE HOSPITAL WHO PREGNANT WOMEN NGS VZM

Pregnant Lady: గర్భిణిని భుజంపై మోస్తూ నది దాటించిన భర్త.. ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు..

ఎన్నాళ్లీ కష్టాలు

ఎన్నాళ్లీ కష్టాలు

Pregnant Women: ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు అంటున్నారు ఏజెన్సీ ప్రజలు.. కాలా మరుతోంది. ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ తమ కష్టాలు తీరవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Pregnant Women Tension:  కాలం వేగంగా పరుగులు పెడుతోంది. సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కొత్త కొత్త పాలకులు వస్తున్నారు. అయితే తమ బతుకులు మారవా అని ప్రశ్నిస్తున్నారు ఏజెన్సీ ప్రజలు ముఖ్యంగా
    విజయనగరం జిల్లా ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి మరీ దుర్బరంగా మారుతోంది.  గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తరలించాలి అంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది.  తాజాగా ఆంద్రా- ఒడిశా సరిహద్దు గ్రామమైన కొమరాడ మండలంలోని చోళపదం పంచాయితీ వనధార గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు భర్త, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

    వేగంగా  ప్రవహిస్తున్న నాగావళి నదిలో భుజాలపై మోసుకుంటూ గర్భిణీ మహిళను నది ఇవతల ఉన్న వత్తాడ గ్రామానికి తీసుకురావాల్సి వచ్చింది.  అక్కడి నుండి 108 ఆంబులెన్స్ లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్ణపాడు -లాబేసు వంతెన పూర్తయ్యుంటే.. తమకు ఈ ఇబ్బందులు తప్పేవని.. ఏళ్ల తరబడి సాగుతున్న పూర్ణపాడు-లాబేసు వంతెనను ఇప్పటికైనా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    ఇదీ చదవండి : టీటీడీపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే అది జరుగుతుందని వ్యాఖ్య

    విజయనగరం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. వారిని ఆస్పత్రికి తరలించాంటే.. గిరిజన గ్రామాల ప్రజలు నానా పాట్లు పడాల్సి వస్తోంది. నిత్యం ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడమో, గర్భిణీ స్త్రీలైతే నొప్పులు రావడమో జరిగితే.. ఇక వారి పాట్లు అన్నీఇన్నీ కావు. ఆస్పత్రికి తరలించాలంటే.. నిత్యం డోలీ మోతలు, లేదంటే గ్రామస్తులంతా కలిసి భుజాలపై మోసుకురావడమో.. కామన్ అయిపోయింది. గిరి శిఖరాల మీద ఉండే గ్రామాలైతే.. రోడ్లు లేకపోవడం, నదులు, గెడ్డలు దాటుకొని రావాల్సి రావడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

    ఇదీ చదవండి : పండుగముందు వలకు చిక్కిన భారీ పండుగప్ప.. మత్య్సకారుల పంట పండింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు

    తాజాగా.. విజయనగరం జిల్లా ఏజెన్సీలోని ఒడిశా సరిహద్దు మండలమైన కొమరాడ మండలంలోని చోళపదం పంచాయితీలోని మారుమూల గిరిజన గ్రామమైన వనధార లో కె.చామంతి అనే గర్భిణీ స్త్రీ కి సోమవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో తన భర్త అయిన నాగేశ్వరరావు 108 కి ఫోన్ చేసారు. గర్భిణీ మహిళకు వత్తాడ వరకూ తీసుకురావాలని అక్కడ 108 ఆంబులెన్స్ లో సిద్దంగా వుంటామని చెప్పారు.

    ఇదీ చదవండి : నమ్మి అప్పు ఇప్పించారు.. చివరికి ఇలా చేశారు

    వనధార గ్రామం నుండి వత్తాడ గ్రామానికి రావాలంటే.. నది దాటి రావాల్సి ఉంది. దీంతో వనధార గ్రామం నుండి గర్భిణీ స్త్రీ చామంతిని ఆమె భర్త, మరిది, ఇతర కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకుంటూ ఉద్ళతంగా ప్రవహిస్తున్న నాగావళి ఒడ్డున తరలించారు. అక్కడ ఉన్న 108 సిబ్బంది సహాయంతో .. నదిని దాటించి అవతల ఉన్న వత్తాడ గ్రామానికి చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న 108 ఆంబులెన్స్ లో చామంతిని ఎక్కించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉందని, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆమె బంధువులు చెబుతున్నారు. నదిని దాటుతున్న సమయంలో ఇక వీడియో రికార్డు చేసి తాము పడుతున్న ఇబ్బందులను ఇప్పటికైనా తీర్చాలని కోరుతున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Pregnant women, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు