హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP PRC: మొన్న ఊ అన్నారు.. ఇప్పుడు ఉఊ అంటున్నారు.. మళ్లీ మొదలైన పీఆర్సీ లొల్లి

AP PRC: మొన్న ఊ అన్నారు.. ఇప్పుడు ఉఊ అంటున్నారు.. మళ్లీ మొదలైన పీఆర్సీ లొల్లి

ap employees protest

ap employees protest

AP PRC Fight: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారా..? మొన్న సీఎం జగన్ ప్రకటన తరువాత.. ఊ అన్నారు ఉద్యోగ సంఘం నేతలు.. మరి ఇప్పుడు ఉఊ అని ఎందుకు అంటున్నారు.. వారి డిమాండ్లు ఏంటి..?

AP PRC Fight:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక (Sankrathi Gift) ఇటీవలే అందించారు.. ఉద్యోగులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న పీఆర్సీతో పాటు.. కీలక వరాలు కురిపించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వివాదంగా మారిన పీఆర్సీ (PRC)ని  ప్రకటించారు.  23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు పలు హామీల వర్షం కురిపించారు. అయితే ఫిట్ మెంత్ తక్కువే ప్రకటించినా.. మిగిలిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారో.. లేదా ఆయన ఉద్యోగ సంఘాలకు ఏం చెప్పారో కానీ.. సీఎం జగన్ ప్రకటన వెంటనే బయటకు వచ్చిన  ఉద్యోగ సంఘాల నేతలు అంతా.. ఆనందం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయంపై సంతోషంగా ఉన్నామంటూ  ప్రకటించారు. కొన్ని చోట్ల అయితే సీఎం జగన్ కు పాలభిషేకాలు చేస్తే.. మరికొన్ని చోట్ల బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు. దీంతో పీఆర్సీ అంశం ముగిసినట్టే అని అంతా భావవించారు.. అయితే అప్పుడు ఊ అంటూ బయటకు వచ్చేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు.. ఇప్పుడు ఉఊ అంటున్నాయి. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..?

2010లో అప్పటి పీఆర్సీ సిఫార్సులతో 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని ఉద్యోగులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏలు యథాతథంగా కొనసాగించాలని పట్టుపడుతున్నారు. 70 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న5 డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలు కొనసాగించాలని విజ్జప్తి చేశారు. వీటితో పాటు ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరింది.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అహోబిలం ఆలయం దగ్గర చిరుత భయం.. త‌ృటిలో ప్రమాదం మిస్.. ఏం జరిగిందో చూడండి

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం వల్ల ఏటా ఖజానాపై 10 వేల 247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని ముగిసిన అధ్యాయంలా చూస్తుందా? లేక ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారిస్తుందా? చూడాలి.. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే మళ్లీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రం.. అప్పుడు ఊ అని ఇప్పుడు మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీయడం సరైన నిర్ణయం కాదంటున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Employees

ఉత్తమ కథలు