Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS FIRE ON CHARIOT WHEELS AT KANIPAKAM IN CHITOOR DISTRICT NGS TPT

Kanipakam: కాణిపాకంలో మరో దారుణం.. స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు..

కానిపాకంలో దారుణం

కానిపాకంలో దారుణం

Kanipakam: ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు ఆగడం లేదు.. ఓ వైపు విపక్షాలు.. హిందువులు ఆందోళనలు చేస్తున్నా.. ఈ దాడులకు బ్రేక్ పడడం లేదు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం కానీపాకంలో దారుణం చోటు చేసుకుంది. స్వామివారి రథ చక్రాలకు దుండగులు నిప్పు పెట్టటారు.

ఇంకా చదవండి ...
  Kanipakam: హిందూ దేవాలయాలే (Hindu Temples) టార్గెట్ గా దుండగులు రెచ్చిపోతున్నారు.. ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) లో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర విగ్రహాల ధ్వంసం అనే వార్తలు వినాల్సి వస్తోంది.  ఏపీ ప్రభుత్వం (AP Government) కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా.. దాడులు ఆగడం లేదు.. మరోవైపు బీజేపీ (BJP) సహా విపక్షాలు.. హిందూ సంఘాలు ఏపీలో పరిస్థితిపై పదే పదే ఆందోళనలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల కన్ను సన్నల్లోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండేవి. ఏపీలో దేవాలయాలపై దాడులు కాస్త తగ్గాయనుకుంటే.. తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి. హిందూ దేవాలయాల్లో వరుస దాడుల తర్వాత జనం కాస్త ఊపిరి పీల్చుకుంటుండగానే.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam) ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథచక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా? లేక కావాలని ఎవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  ఏపీలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్త కాదు.. ముఖ్యంగా అంతర్వేది ఘటన ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలింది. విగ్రహాలపై దాడులు చేయడమే కాదు.. రథాలకు నిప్పు పెట్టడమనేది ఇది కొత్తేమీ కాదు.. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రత్యేకమైన పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నేటికీ పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. ఇక నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు. స్వామివారి ఉత్సవాలకు రథాన్ని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

  ఇదీ చదవండి : కొత్త జిల్లాలపై మొదలైన అసంతృప్తి.. కొందరు వైసీపీ నేతల అభ్యంతరం..? ఎక్కడ..? వివాదం ఏంటి..?

  ఏపీలో సంచలన రేపిన మరో ధ్వంస ఘటన రామతీర్థంలో జరిగింది. ఇప్పటికే ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ధ్వంసమైన విగ్రహాల బదులు.. కొత్త విగ్రహాలు తెప్పించారు.. ఆలయ పునర్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు.. ఆ సందర్భంగా ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజు.. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మధ్య పెను వివాదం చెలరేంది. విషయం కేసుల వరకు వెళ్లింది..

  ఇదీ చదవండి : ప్రమేయం లేకుండానే కదులుతున్న కాళ్లూ చేతులు.. ఆహారాన్ని బయటకు నెడుతున్న నాలుక.. కారణం అదే..?

  ఇక బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురయ్యారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది ఆ దుర్గమ్మకే తెలియాలి. చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక చిన్న చిన్న ఆలయాల్లో దాడులు గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.. నిత్యం వింటూనే ఉన్నాం..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Hindu Temples

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు