Elephants Attack: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.. ముఖ్యంగా విజయనగరం జిల్లా (Vizianagaram District) ఏజెన్సీలో ఏనుగులు బీభత్సం (Elephants Attack) గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. సుమారు ఐదేళ్ల క్రితం ఒడిశా ఏజెన్సీ (Odisha Agency) నుండి పార్వతీపురం (Paravathipuram) ఏజెన్సీలోని గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో అడుగుపెట్టిన ఏనుగుల గుంపు.. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసాయి. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో సంచరిస్తూ.. రైతులు వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక గిరిజన గ్రామాలలోని ఇళ్లు, హాస్టల్ భవనాలు, వాహనాలపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. ఇటీవల పంటపొలాలు, రోడ్లపై వెళ్తున్న వారిపై దాడిచేసి పొట్టన పెట్టుకుంటున్నాయి. పార్వతీపురం ఏజెన్సీలోని కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోనే తిష్టవేసిన ఏనుగుల గుంపు.. పలు గ్రామాలలో సంచరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇప్పటివరకూ పార్వతీపురం ఏజెన్సీలో ఏనుగుల దాడిలో ఆరుగురు చనిపోగా, పదుల సంఖ్యలో గిరిజనులు గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు.
ఒడిశా అధికారులు తమ అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపును అనేక విధాలుగా ప్రయత్నించి ఏవోబీలోని విజయనగరం, శ్రీకాకుళం అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. దీంతో 2018 లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) లోని సీతంపేట ఏజెన్సీలో అడుగుపెట్టిన ఏనుగుల గుంపు.. కొద్దిరోజులకు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం డివిజన్ లోని గిరిజన ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఇలా ఐదేళ్లు కావస్తున్నా.. ఫారెస్ట్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగుల గుంపు ఇక్కడే తిష్ట వేసింది.
ఇదీ చదవండి: పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్‌లో అలజడి.. సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
అటవీ ప్రాంతంలో తిరగాల్సిన ఏనుగుల గుంపు.. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో సంచరిస్తూ.. రైతుల పంటలును నష్టం చేస్తున్నాయి. ఏడు పెద్ద ఏనుగులు, ఓ పిల్ల ఏనుగుతో కలిపి ఎనిమిది ఏనుగులు .. విజయనగరం జిల్లా ఏజెన్సీలో ప్రవేశించగా.. అందులో వివిధ కారణాలతో రెండు పెద్ద ఏనుగులు, ఓ పిల్ల ఏనుగు మ్ళతి చెందాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఐదు ఏనుగులు సంచరిస్తున్నాయి, అందులో ఒక ఏనుగు ఇటీవల గుంపు నుంచి విడిపోయి.. ఒంటరిగా గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.
ఇదీ చదవండి: భర్త జైల్లో.. భార్య ప్రియుడి ఒడిలో.. గిరజనేతరుడితో సంబంధం ఉందని నగ్నంగా ఊరేగింపు
పంటలను తొక్కేయడమే కాక అటవీశాఖ వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల్లో పలు వాహనాలను కూడా ధ్వంసం చేసింది. ప్రధాన రహదారిలో సంహరించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ట్రాకర్ల సహాయంతో ఆ గుంపు నుండి విడిపోయిన ఏనుగును.. తిరిగి ఏనుగుల గుంపుతో పాటు కలిపారు.
ఇదీ చదవండి: లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు.. యవ్వనంలో గుండెపోటు వస్తే ఎలా నివారించాలో తెలుసా..?
విజయనగరం ఏజెన్సీలో వేల ఎకరాల్లో .. వరి, అరటి, చెరకు సహా అనేక పంటలను నాశనం చేసాయి. ఐదేళ్లుగా రైతులు తమ జీవనాధారం కోసం వేసుకున్న పంటపొలాల్లోకి దిగి.. పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. అలాగే రైతులు పండించిన మొక్కజొన్న, టమోటా, కంది, బొప్పాయి, జామ వంటి పంటలు బాగా నష్టం చేశాయి. దీనికి అటవీశాఖ తరపున.. నష్టపరిహారం కూడా పెద్దఎత్తున అధికారులు చెల్లించారు. ప్రభుత్వం కూడా పెద్దఎత్తున పంట నష్టం భరించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: సినీ పరిశ్రమకు పవన్ పెద్ద గుదిబండ.. ఆయన్ను పెద్దలు పక్కన పెట్టారన్న సజ్జల
ఇటీవల కొమరాడ మండలం అర్థంవలస గ్రామంలో అర్ధరాత్రి ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పూరిల్లు ధ్వంసం చేసిన ఏనుగు.. అనంతరం అక్కడే తిష్ట వేసాయి. దీంతో అక్కడే ఇళ్లలో ఉన్న ప్రజలంతా భయంతో పరుగులు తీసారు. గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై ప్రాణాపాయంతో.. గ్రామంలోని డాబాల పైకి ఎక్కి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇలా ఏనుగుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామంటూ గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేసారు.
ఇదీ చదవండి: వంట నూనె రెండోసారి వాడుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇక గరుగుబిల్లి మండలం సంతోషపురం గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు తొక్కేస్తుండడంతో.. భయాందోళనకు గురైన గ్రామస్తులు అంతా ఏకమై కర్రలతో.. ఏనుగుల గుంపు గ్రామంలోకి రాకుండా తరిమికొట్టారు. ఇక ఈ ఏనుగుల గుంపు దాడుల్లో అనేక మంది గాయాలపాలై ఆసుపత్రుల పాలవ్వగా, ముగ్గురు ఏనుగుల దాడిలో అక్కడికక్కడే చనిపోయారు.
ఇదీ చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రెచ్చిపోతున్న పోకిరీలు.. ర్యాష్ డ్రైవింగ్.. తుపాకీ స్టంట్లతో అలజడి
జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామంలోని అంగన్వాడీ బిల్డింగ్ పై దాడి చేసి తలుపులు, టైల్స్ ను ద్వంసం చేసాయి. ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు లేకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల క్రితం కొమరాడ మండలం దళాయిపేటలో మరోసారి ఏనుగుల బీభత్సం స్ళష్టించి.. అర్ధరాత్రి ఆవుపై దాడిచేసి చంపేసాయి. ఇలా అర్ధరాత్రి సమయాల్లో ఏనుగులు తమ గ్రామాలపైకి వస్తుండడంపై గ్రామస్తులు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏనుగులను ఆటవీప్రాంతంలోకి తరలించలేక పోతున్నారని, చేతులెత్తేస్తున్నారంటూ గిరిజన గ్రామా ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సరైన ప్రణాళికతో.. ఏనుగులను గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతంలోకి పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Elephant attacks, Vizianagaram