హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP New Districts: వైసీపీకి కొత్త జిల్లాలు రాజకీయంగా కలిసి రాలేదా..? అసలు సమస్య ఏంటంటే?

AP New Districts: వైసీపీకి కొత్త జిల్లాలు రాజకీయంగా కలిసి రాలేదా..? అసలు సమస్య ఏంటంటే?

కొత్త జిల్లాల నిర్ణయం సీఎం జగన్ కు కలిసి రాలేదా..?

కొత్త జిల్లాల నిర్ణయం సీఎం జగన్ కు కలిసి రాలేదా..?

AP New District: రాజకీయ.. సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుంటూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాల విభజన చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావించారు.. కానీ పరిస్థితి భిన్నంగా ఉందా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP News District: సాధారణంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే .. అధికార పార్టీకి పొలిటికల్ గా ప్లస్ అవుతుందని అంచనా వేస్తారు. ఆ లెక్కలతోనే నిర్ణయాలు తీసుకుంటారు.  లేకపోతే ఆ పార్టీనే దాన్నుంచి మైలేజ్ లాక్కోవాలి. కానీ ఓ విషయంలో మాత్రం వైసీపీ (YCP) ఫెయిల్ అందన్న టాక్ నడుస్తోంది. నిర్ణయం అయితే తీసుకున్నారు.. అమలు కూడా చేస్తున్నారు. కానీ పొలిటికల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ప్రజలకు మంచి జరిగినా పార్టీకి మాత్రం ఇంచైనా మైలేజ్ రాలేదన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలు (AP News Districts) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామని చెప్పింది. అందుకు తగ్గట్లుగానే కొత్త జిల్లాలను విభజించింది. అరకు పార్లమెంట్  (Araku Parlment) నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో  జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పాలనాపరమైన సౌలభ్యాలు కూడా వచ్చాయి.

ఈ నిర్ణయంతో గతంలో మాదిరిగా జిల్లా కేంద్రాలకు వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన బాధ తప్పింది. కలెక్టర్లు, ఎస్పీల వంటి ఉన్నతాధికారులు ప్రజలకు చేరువగా వచ్చారు. జిల్లా యంత్రాంగం స్థాయిలో జరగాల్సిన పనులు సులభంగా జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికీ వైసీపీకి కలిసొచ్చే అంశమే. అన్ని విషయాల్లోనూ పబ్లిసిటీ చేసుకునే వైసీపీ నేతలు.. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోయారన్న చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. రెబల్ ఎంపీకి నోటీసులు.. ఎంత ఆఫర్ చేశారంటే..!

కొత్త జిల్లాల విషయంలో చాలా వివాదాలు చుట్టుముట్టాయి. చాలా చోట్ల వ్యతిరేకత వచ్చింది. కోనసీమ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. అన్నింటినీ దాటుకుంటూ జిల్లాలను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఈ అంశాన్ని మాత్రం పొలిటికల్ అజెండాలో చేర్చలేదన్న మాట వినిపిస్తోంది. దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయం చేసే వైసీపీ జిల్లాలను ఎందుకు వదిలేసింది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : వైసీపీలో భారీ మార్పులు.. చేర్పులు.. మాజీ మంత్రులకు ఊహించని షాక్.. జిల్లా అధ్యక్షుల మార్పు.. జాబితా ఇదే

గడప గడపకు కార్యక్రమంలోనూ వైసీపీ నేతలు జిల్లాల విషయాన్ని ప్రస్తావించడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శల్లో నిజం లేకపోలేదు. అలాంటప్పుడు కొత్త జిల్లాల వల్ల ప్రతి ఒక్కరికీ లాభం చేకూరింది. ఇందులో రెండో ఆలోచన లేదనే మాట చాలా చోట్ల వినిపిస్తోంది.  ఇదిలా ఉంటే కార్తీక భోజనాల్లోనే రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. అంతెందుకు వనభోజనాలకు తప్పనసరిగా వెళ్లి పార్టీని ప్రమోట్ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేసించిందన్న  వార్తలు కూడా వస్తున్నాయి.

ఇదీ చదవండి: నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?

కొత్త జిల్లాల టాపిక్ ను వైసీపీ వదిలేయడం చర్చనీయాంశమవుతోంది. అందరికీ చెప్పుకొని ప్రచారం చేసుకోవాల్సిన విషయాన్ని కూడా వైసీపీ తన పొలిటికల్ స్ట్రాటజీలో ఎందుకు చేర్చడం లేదు..? జిల్లాల వల్ల తమకే నష్టం జరిగిందని వైసీపీ నేతలు భావిస్తున్నారా? దీన్ని రాజకీయం చేయడం ఎందుకని ఫీలవుతున్నారా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Andhra pradesh news, Ap cm jagan, AP new districts, AP News, AP Politics

ఉత్తమ కథలు