AP New Districts: కొత్త జిల్లాల ప్రచారం వారి కొంపముంచిందా..? మొదటికే మోసం తెచ్చిందా..?

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటవుతున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొచ్చాయి. కానీ..

 • Share this:
  Anna Raghu, Guntur Correspondent, News18

  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చాన్నాళ్లుగా చర్చజరుగుతోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి ఏడాది కాలంగా కొత్త జిల్లాలు ఏర్పడతాయంటూ జరుగుతున్న ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపొచ్చింది. కొత్తగా ఏర్పడబోతున్న జిల్లా కేంద్రాలలో ఎందుకూ కొరగాని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ వ్యాపారం మంచి ఊపుమీద ఉన్నతరుణంలో అనేక మంది మధ్యతరగతి ప్రజలు కూడా ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. రియల్ వ్యాపారం బాగా ఊపుమీద ఉండటంతో ఎంతో మంది సామాన్య మద్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంలో కూడబెట్టిన సొమ్ముకుతోడు కొంత అప్పులు చేసి విపరీతమైన ధరలకు భూములు కొనడం ప్రారంభించారు. పావలా పెట్టుబడితో రూపాయి లాభం వస్తుందని ఆశపడి అందినకాడికి అప్పులు తెచ్చిమరీ భూములుకొన్న సదరు సామాన్యులపై అటు పంచాయితీ ఎన్నికలు ఇటు కరోన వైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టాయనే చెప్పాలి. ఎలక్షన్ కోడ్ మరియు లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వాయిదా పడటంతో ఒక్కసారిగా భూముల ధరలు పాతాళానికి పడిపోయాయి.

  ఎందుకూ కొరగాని భూములను ఒకటికి పదిరెట్లు పెట్టి కొన్న వాళ్ళంతా ఇప్పుడు తమ కష్టార్జితం మొత్తం వడ్డీలరూపంలో కృష్ణార్పణం అవుతుందని ఊహించలేదంటూ లబోదిబోమంటున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడులు తిరిగొస్తే చాలని భావిస్తున్నారు. అమ్ముదామన్నా కొనేవాడు కరువై లబోదిబోమంటూ విలపిస్తున్నారు. రియల్ మాయలో పడి తమ జీవిత కాలం కష్టపడి సంపాదించిన సొమ్ము చేజేతులా నాశనం చేసుకున్నామంటూ బాధపడిపోతున్నారు.

  ఇది చదవండి : ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..! సీఎం జగన్ కీలక నిర్ణయం


  ఐతే రియల్ వ్యాపారం కనుచూపుమేరలో కోలుకునే అవకాశమే లేకపోవడంతో చాలవరకు కొనుగోలు మరియు అమ్మకం ఒప్పందాలు గడువు ముగుస్తుండటంతో వివాదాలు మొదలయ్యాయి. తాము కట్టిన డబ్బుకు ఎంతమేర భూమి వస్తే అంత మేర రిజిష్టర్ చేయమంటూ కొనుగోలు దారులు బ్రతిమాలుతుంటే.. మీ లాభనష్టాలతో మాకు పనిలేదు ఒప్పందం ప్రకారం తమకు రావలసిన డబ్బు చెల్లించి రిజిష్టర్ చేపించుకోండి అంటూ అమ్మకందారులు తేల్చిజెబుతున్నారు. కాస్త పలుకు బడి కలిగిన వారు పోలీసుల సమక్షంలో రాజీలో చేసుకుంటుంటే మరి కొంత మంది దీనంగా దిక్కుతోచని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు మాత్రం కొత్త జిల్లాల ప్రకటన వస్తే భూముల ధరలు పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నారు. కానీ రియల్ భూమ్ వస్తుందా రాదా అనే ఆందోళన కూడా వారిలో నెలకొంది. ఏది ఏమైనప్పటికీ దురాశ ధుఃఖానికి చేటు అనే సామెత ఇప్పుడు నిజమైందంటున్నారు కొందరు మేధావులు.

  ఇది చదవండి: రూటు మార్చిన ఎమ్మెల్యే రోజా... చాలా రోజుల తర్వాత ఇలా..

  Published by:Purna Chandra
  First published: