Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEWS DISTRICT COMMITTEE START THEIR WORK FIRST THEY DISCUSS BEFORE UGADI NGS

New Districts: కొత్త జిల్లాల ఏర్పాటులో ముందడుగు.. ఏ జిల్లా నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి? మార్పులు తప్పవా?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం దూకుడుగా దూసుకుపోతోంది. ఎట్టిపరిస్థితిలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావాలనే పట్టుదలతో ఉంది. దీతో భాగంగా గడువుకంటే ముందే.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై కమిటీ ఫోకస్ చేసింది. అయితే ఈ జిల్లా నుంచి ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి.. తాజా సూచనల ప్రకారం మార్పులు తప్పవా..?

ఇంకా చదవండి ...
    AP New Districts: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం (AP Government).. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలు సూచనలపై సమీక్షలు మొదలెట్టారు కమిటీలో అధికారులు.. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 1478 అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో అత్యధికంగా అనంతపురం జిల్లా (Anantapurm District)లో 700 అభ్యంతరాలు, అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో 16 విజ్ఞప్తులు వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తం 13 జిల్లాల కలెక్టర్లతో ఈనెల 28వ తేదీ వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి (Tirupati), విజయవాడ (Vijyawada), అనంతపురం (Anantapuram), విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో వచ్చిన విన్నపాలు గురించి ఈ సమావేశంలో సామీక్షించాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ కూడా చేశారు. ఆ తరువాత కృష్ణ (Krishna) ,పశ్చిమ గోదావరి (West Godavari), ప్రకాశం (Prakasham), గుంటూరు (Guntur) జిల్లాల కలెక్టర్లతో 23వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. 24వ తేదీన తిరుపతి (Tirupati)లో చిత్తూరు, నెల్లూరు (Nellore), కడప  (Kadapa)జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది. 26వ తేదీన అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగబోతుంది. 28వ తేదీన విశాఖపట్నంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి (East Godavari), శ్రీకాకుళం (Srikakulam) , విజయనగరం (Vizianagaram) జిల్లా కలెక్టర్‌తో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల తరువాతే మార్పులు చేర్పులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

    సాధారణంగా అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువు ఉంది. అయినా ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు మొదలెట్టింది కమిటీ. ఇప్పటి రకు
    హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ అనంతపురం జిల్లా నుంచి మొత్తం సుమారు 800 దాకా విజ్ఞప్తులొచ్చాయని సమాచారం. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 350 విజ్ఞప్తులు అందాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ ప్రకటించాలని 330 వినతులొచ్చాయి. పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని 3, రామగిరి మండల కేంద్రాన్ని అనంతపురం డివిజన్‌లో కలపాలని 3 విజ్ఞప్తులు అందాయి.

    ఇదీ చదవండి : బాలయ్య మజాకా..? కొత్త జిల్లాలపై అభ్యంతరాల్లో టాప్ ప్లేస్..? డిమాండ్ ఇదే

    ఇక విశాఖపట్నం నుంచి ఇప్పటి వరకు సుమారు 245 అభ్యర్థనలు వచ్చాయి. నర్సీపట్నం కేంద్రంగా అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలంటూ 72 మంది విన్నపాలు ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కలపొద్దని విశాఖలోనే ఉంచాలని కోరుతున్నారు. అరకు కేంద్రంగా అల్లూరి జిల్లాను ఏర్పాటుచేయాలని, రంపచోడవరాన్ని అల్లూరి జిల్లాలో కలపొద్దని, మైదాన ప్రాంతంలోని షెడ్యూల్‌ ప్రాంతాలను అల్లూరి జిల్లాలో కలపాలని డిమాండ్లున్నాయి.

    ఇదీ చదవండి : విదేశీ కరెన్సీ కావాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ వేలానికి ఇలా సిద్ధం కండి..? ఏ దేశ కరెన్సీ ఎంతంటే..?

    మరోవైపు కృష్ణా జిల్లాలో 37 అభ్యర్థనలు అందాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాలో కలపాలని, అవనిగడ్డ, కంకిపాడు, మైలవరం మండలాలను రెవెన్యూ డివిజన్‌లుగా చేయాలని కోరారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని.. ఇప్పటికే విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్‌ పేరును కృష్ణా జిల్లాకు మార్చాలని కోరుతున్నారు. దీంతో పాటు గుంటూరు జిల్లాలో.. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రం చేయాలని, జాషువా పేరునూ జత చేయాలనే విన్నపంతో వందల సంఖ్యలో అర్జీలొచ్చాయి. బాపట్ల జిల్లాకు భావపురి పేరు పెట్టాలని కోరారు. పెదకూరపాడు-సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్తు జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు విన్నవించారు.

    ఇదీ చదవండి : ఎనిమిది మంది ఐఏఎస్.. ముగ్గురు ఐపీఎస్ లు.. ఏపీలో భారీగా బదిలీలు.. కారణం అదేనా..?

    ఇక విజయనగరం జిల్లాలో 42 విజ్ఞప్తులందాయి. మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించాలని.. ఐదారు గిరిజన గ్రామాల వారు మాత్రం మన్యంలో చేర్చాలంటున్నారు. మన్యం పేరు కాకుండా పార్వతీపురం పేరును కొనసాగించాలని లేకపోతే పార్వతీపురం మన్యం అని పెట్టాలంటున్నారు. శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటుచేయాలని ఎక్కువ విజ్ఞప్తులొచ్చాయి. ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో ఉన్న వంగర మండలం కొత్తగా ఏర్పాటుకానున్న విజయనగరం జిల్లాలో కలవనుంది. వంగర మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచాలని విజ్ఞప్తులు వచ్చాయి.

    ఇదీ చదవండి : ట్విన్స్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంక, ప్రియా సిస్టర్స్.. యూట్యూబ్‌ ద్వారా ఫేమస్

    తూర్పుగోదావరి జిల్లాలో 130 అభ్యర్థనలు అందినట్టు సమాచారం. రంపచోడవరం డివిజన్‌నుజిల్లాగా ప్రకటించాలని... పెదపూడి, తాళ్లరేవు మండలాలను కాకినాడలో కలపాలని... మండపేట, గోకవరం మండలాలను రాజమహేంద్రవరంలో ఉంచాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 60 సూచనలు అందాయి. భీమవరం జిల్లా కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న పశ్చిమగోదావరి జిల్లాపై 25 విజ్ఞప్తులు అందాయి. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా చేయాలనేది వీటి సారాంశం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలను రాజమండ్రి జిల్లాలో కలపడంపై 25కు పైగా అభ్యంతరాలొచ్చాయి.

    ఇదీ చదవండి : ఆళ్ళగడ్డలో హై ఓల్టేజ్.. రోడ్డు విస్తరణతో మొదలైన రాజకీయం.. ఎమ్మెల్యే లక్ష్యంగా భూమా సవాల్

    ప్రకాశం జిల్లాకు సంబంధించి 150 వినతులు అందాయి. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపకుండా... ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 148 అభ్యంతరాలొచ్చాయి. మదనపల్లె జిల్లాను ఎక్కువ మంది కోరుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై 58 అభ్యంతరాలు, 4 సలహాలు కడప జిల్లా అధికారులకు అందాయి. వీటిలో రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనేవే ఎక్కువ మంది సూచించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు