ANDHRA PRADESH NEWS CM JAGAN SAYS GOOD NEWS TO WHO MISS THEIR FAMILY SUPPORTERS IN CORONA 1ST 2ND WAVES NGS
CM Jagan: ఆ కుటుంబాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి
సీఎం జగన్ (ఫైల్)
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ను కరోనా భూతం తీవ్రంగా భయపెట్టింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ లో నమోదవుతున్న కేసుల కంటే.. సెకెండ్ వేవ్ లో నమోదైన మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. చాలామంది కరోనా బారిన పడి ప్రణాలు కోల్పోయారు. అలా కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను కరోనా మహమ్మారి వెంటాడింది. ఇప్పటికే వెంట పడుతూనే ఉంది. తొలి రెండు దశలతో పోల్చుకుంటే ప్రస్తుతం పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు (Corona Cases) కొత్తగా నమోదైని కొద్ది రోజులకే ఆరు వేల మార్కును దాటింది అంటే ప్రస్తుతం పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ థర్డ్ వేవ్ (Third Wave) తో పోల్చుకుంటే.. తొలి రెండు వేవ్ ల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా కరోనా సెకెండ్ వేవ్ లో కుటుంబాలకు కుటుంబాలను సైతం కరోనా బలి తీసుకుంది.. ఎంతో మందిని అనాథలుగా మార్చేసింది. పెద్ద పెద్ద కుటుంబాలపైనా ప్రభావం చూపించింది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్డుర్ని కూడా బలి తీసుకుంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. ఇంటిని పోషించే వారు కోవిడ్ తో చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ (CM Jagan) అప్పట్లో వారందరికీ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలో భాగంగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతి ఇచ్చారు.
అంటే కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి సీఎం జగన్ అనుమతి కల్పించారు. కరోనా కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా కుటుంబాల్లో అర్హులైన వారికి తప్పకుండా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంపై బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా తమను రోడ్డున పడేసినా.. సీఎం జగన్ పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక భద్రత కల్పన చర్యగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నియమకాలను చేపట్టనుంది. కొందరిని గ్రామ/వార్డు సచివాలయాల్లో నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు మళ్లీ ఏపీని కరోనా భయపెడుతూనే ఉంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో రెట్టింపు అయ్యాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య ఏకంగా 6 వేలు దాటేసింది. రికవరీలు క్రమంగా పెరుగుతున్నా.. కొత్తకేసుల సంఖ్య మాత్రం భారీగా ఉంటోంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18 శాతం దాటింది. గత 24 గంటల్లో 38,055 టెస్టులు నిర్వహించగా... 6,996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,834, విశాఖపట్నం జిల్లాలో 1,1263, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 200 కంటే అధికంగానే కేసులు నమోదయ్యాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.