ANDHRA PRADESH NEWS CASTE DISCRIMINATION IN GOVERNMENT SCHOOL AT EAST GODAVARI DISTRICT NGS
Caste Discrimination: ఏపీలో కుల వివక్ష.. అగ్నికుల క్షత్రియ, అగ్రకుల విద్యార్థులకు వేర్వేరుగా పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాల
Caste Discrimination: ఆంధ్రప్రదేశ్ లో కుల పిచ్చి రాజ్యమేలుతోంది. ఎంత దారుణం అంటే.. కులాల వారిగా ప్రభుత్వం స్కూలును విభజించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికూడ ప్రభుత్వ అధికారులే అక్కడి కులల మధ్య విభజన తెస్తూ ఒకే పాఠశాలు వేర్వేరు స్కూల్స్ గా విభజించారు..
Caste discrimination in government school: కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పు వచ్చింది. సైన్స్, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతోంది. అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం.. ఇలా సమాజం ఎంతో మందుకు వెళ్తుంటూ.. ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు. సాధరణంగా అంటరానితనం అమానుషం.. అంటరానితనాన్ని పాటించడం నేరం అయితే ఇవన్నీ కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. వాస్తవానికి వచ్చే సరికి ఇంకా కులం కుంపట్ల పేరుతో కొట్టుకుంటున్నారు. మా కులం మీ కులం అంటూ తిట్టుకుంటున్నారు. మనుషులంతా ఒక్కటై ఉంటేనే బలం అన్న సంగతి మరిచి.. మాకు మేమే అనే గిరి గీసుకుంటున్నారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే.. మొన్నటి వరకు ఒకే స్కూళ్లో కలిసి చదువుకున్న విద్యార్థులను.. కులాలుగా విభజించి వేర్వేరు స్కూల్స్ గా విడదీశారు. విద్యాలయంలోనే ఇలా కుల వివక్ష ఘటన వెలుగు చూడడం నిజంగా అమానుషం. అది కూడా విద్యాశాఖ అధికారులు దీన్ని పాటించడాన్ని ఏమనాలి...
ఈ ఘటన ఎక్కడో ఏజెన్సీలోనో.. మారు మూల గ్రామంలోనూ కాదు.. బాగా రాజకీయ చైతన్యం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామంలోని.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కులవివక్ష విషయం కలకలం రేగింది. అగ్నికుల క్షత్రియ విద్యార్థులందరికీ ఒక పాఠశాల.. మిగతా విద్యార్థులందరికీ మరో పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో అగ్నికుల క్షత్రియుల సంఘ నాయకులు భగ్గుమంటున్నారు. గ్రామ సర్పంచ్ సూచనల మేరకు విద్యార్థులను కుల విభజన చేశారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మొన్నటి వరకు బ్రహ్మపురిలో మొత్తం 52 మంది విద్యార్థులతో ఈ ప్రాథమిక పాఠశాల కొనసాగేది. అయితే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 9 లక్షలతో.. ఈ స్కూలుకు ఆధునీకరించింది. అన్ని మౌలిక వసతలతో స్కూల్ ను అందంగా తయారు చేసింది. దీంతో విభజనకు బీజం పడింది. అన్ని వసతులు ఉన్న బిల్డింగ్ లో అగ్ర వర్ణాల వారిని.. వసతులు తక్కువగా ఉన్న స్కూలును అగ్ని కుల క్షత్రియులను వేరే స్కూల్లో ఉంచారు. అయితే రాజకీయ నాయకుల జోక్యంతో స్కూల్లో చదువుతున్న విద్యార్థులను కులాల పేరిట విభజించారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఎలాంటి సదుపాయాలు లేని స్కూల్కు 26 మంది విద్యార్థులను పంపించారని ఆగ్రహం వ్యక్తం ఆ విద్యార్థులు తల్లిదండ్రులు, ఆ వర్గం వారు. ఇప్పటికైనా అంతా కళ్లు తెరిచి గ్రామంలో ఒకే పాఠశాల కొనసాగేలా చూడాలని తల్లిదండ్రులు, అగ్నికుల క్షత్రియుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో చదివే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.