ANDHRA PRADESH NEWS CASE FILE AGAINST EX CENTRAL MINSTER ASHOK GAJAPATI RAJU IN RAMATHIRTHAM ISSUE NGS VZM
Ashok Gajapati Raju: రామతీర్థం వివాదంలో మరో ట్విస్ట్.. అశోక గజపతి రాజుపై కేసు నమోదు
రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత
Ashoka Gajapati Raju: ప్రముఖ రాముల వారి ఆలయం రామతీర్థం వివాదం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. రాముడి విగ్రాహాన్ని ధ్వంసం చేసిన అంగతుకుడు ఇంకా దొరకలేదు.. కానీ ఆ పరిణామాలు అధికార, విపక్షాల మధ్య హీటు పుట్టిస్తూనే ఉన్నాయి. తాజాగా పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిలో భాగంగా అశోక్ గజపతి రాజుపై కేసు నమోదైంది.
Case registered on Ashok Gajapati Raju : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఒకటి రామతీర్థం (Ramatirtham)లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. విజయనగరం (Vizianagaram) రామతీర్థం బోడికొండపై జరిగిన శంకుస్థాపనను మాజీ కేంద్ర మంత్రి , ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతి రాజుకు (Ashok Gajapati Raju) తనకు అవమానం జరిగింది అంటూ ఆందోళనకు దిగారు. క నీసం కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లం పల్లి కొట్ట నివ్వకుండా రచ్చ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులతో అశోక్ గజపతి రాజు వర్గానికి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాదు శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు అశోక్ గజపతి రాజు.ఆ నిరసన మధ్యే శంకుస్థాపనను ముగించారు అధికారులు.
ఆలయ శంకుస్థాపనను అడ్డుకున్నారనే ఫిర్యాదు కారణంగా అశోకగజపతి రాజుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. దీంతో 473, 353 సెక్షన్ల కింద అశోకగజపతి రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అధికారుల వాదన ఒకటైతే.. అశోక్ గజపతి రాజు మాత్రం ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పట్టారు. రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.
రాముల వారి విగ్రహ ధ్వంసం ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని.. ఏడాదిలో గుడి కట్టి తీరుతామని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఆలయ ధర్మకర్తకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని, గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారాయన. విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన వాహన మిత్ర డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
అశోక గజపతి రాజు తీరును మంత్రి తీవ్రంగా తప్పు పట్టారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతి రాజును ఆహ్వానించడం జరిగిందన్నారు. దేవాలయ శంకుస్థాపనలో ఎక్కడా ప్రోటోకాల్ తప్పలేదని స్పష్టం చేశారు. ఆయనకు శంకుస్థాపన ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే.. గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి. మాజీ కేంద్రం మంత్రి అయి ఉండి ఆయన మాట్లాడే తీరు అభ్యంతకరంగా ఉందని, శంకుస్థాపన కార్యక్రమాన్ని సర్కస్ తో పోల్చడం దురదృష్టకరమని వెల్లడించారు. ఎవరి వాదన ఎలా ఉన్నా తాజాగా అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.