హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CAG Report: ఖర్చులు.. అప్పులు అస్తవ్యస్తం.. రాష్ట్ర బడ్జెట్ నిర్వహణపై కాగ్ అక్షింతలు.. వడ్డీల కోసమూ అప్పులా అని ప్రశ్న?

CAG Report: ఖర్చులు.. అప్పులు అస్తవ్యస్తం.. రాష్ట్ర బడ్జెట్ నిర్వహణపై కాగ్ అక్షింతలు.. వడ్డీల కోసమూ అప్పులా అని ప్రశ్న?

ఏపీ అప్పులపై కాగ్ అక్షింతలు

ఏపీ అప్పులపై కాగ్ అక్షింతలు

CAG objected to AP’s financial situation: ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రగా మారిపోతోందనే భయం పెరుగుతోంది. అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చేందుకు అప్పు చేస్తున్నారు. ఆ అప్పుల వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు. అసలు అప్పు లేనిది ఒక రోజు గడాలి అంటే భారంగా మారేలా పరిస్థితి తయారవుతోందా అనే ఆందోళన వ్యక్తం చేసిందది కాగ్.

ఇంకా చదవండి ...

Andhra Pradesh CAG Report 2021: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎటు వెళ్తోంది. రోజు రోజుకి అప్పులు కుప్పగా మారుతోంది. ఇలా ఉంటే పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. అప్పుల కోసం రాజ్యాంగ ఉల్లన సరైంది కాదు. ఈ మాటలు చెబుతున్నది ప్రతిక్ష నేతలు కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులోని వ్యాఖ్యలు.. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై (ap financial status) శుక్రవారం ఏపీలో అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను (cag report) ప్ర‌క‌టించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన అనుబంధ ప‌ద్దుల‌ను ఖ‌ర్చు చేసి.. త‌ర్వాత జూన్ 2020లో శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దని నివేదిక పేర్కొంది. రాజ్యాంగ నిబంధ నలకు వ్య‌తిరేకంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు జ‌రిగాయని జగన్ సర్కార్ కు అక్షింతలు వేసింది కాగ్. చట్ట సభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీనపర్చారని కాగ్ తీవ్రంగా విమర్శించింది. ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునావృతం అయ్యాయని ఆక్షేపించింది. 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయిన తెలిపింది. కొత్త సంక్షేమ పథకాలతో 6.93 శాతం రెవెన్యూ ఖర్చులు పెరిగాయని వెల్లడించింది.

ఓవారల్ గా చూసుకుంటే రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని మండిపడింది. శాసనసభ ఆమోదమే పొందకుండా అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. అసలు ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని వార్నింగ్ ఇచ్చింది. ఖర్చుల తీరుతెన్నులను, బడ్జెట్‌లో చూపకుండా అప్పులు చేయడం దారుణమంది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది.

ఇదీ చదవండి : నెల్లూరు జిల్లాలో అమానుషం.. బీటెక్ విద్యార్థిని హత్య చేసి కాల్చేసిన దుండగులు.. అసలేం జరిగింది?

ఒక వేళ రాష్ట్రానికి నిధులు అవసరం అని భావిస్తే.. శాస‌న స‌భ నుంచి ముంద‌స్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని హితవు పలికింది. గత ఐదేళ్ల నుంచి చెబుతోన్నా మార్పు రావడం లేదని... 2018 -19 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబ‌డులు తగ్గాయని తెలిపింది. కొత్త సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల 6.93 శాతం మేర రెవెన్యూ ఖ‌ర్చులు పెరిగాయని వెల్లడించింది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర పెరిగిన బ‌కాయిల చెల్లింపులు పూర్తి చేశారని కాగ్ నివేదిక పేర్కొంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివ‌రాల‌ను బ‌డ్జెట్ ప‌త్రాల్లో స‌రిగా చూప‌లేదని...శాన‌స వ్య‌వ‌స్థను నీరు గార్చేలా… నిధుల నిర్వ‌హ‌ణ ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి : ఏపీకి పొంచి ఉన్న మరో ఉపద్రవం.. రాయలసీమకు ఏమైంది అంటూ జనంలో భయం భయం

ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందట్లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు తీర్చేందుకు ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించే వనరులు మరింత తగ్గిపోతాయని తెగేసి చెప్పింది. 2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ పూర్తయిన పద్దుల ఆధారంగా కాగ్‌ ఈ విశ్లేషణ చేసింది.

ఇదీ చదవండి : కరవు సీమలో ఎప్పుడూ చూడని అద్భుతం.. ఆగకుండా ఉబికి వస్తున్న పాతాళ గంగ

ఒకవైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోంది. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే ఎక్కువగా ఉంటోంది. గత ఐదేళ్లలో చూసుకుంటే ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65-81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోందని వెల్లడించింది. ఒకవేళ అప్పు తీసుకోవాల్సిన పరిస్తితి వస్తే.. దానితో ఆస్తులు సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి ఆదాయం అందించే అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండవని కాగ్‌ స్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఇదీ చదవండి : రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.. కౌరవసభలో అడుగు పెట్టనన్న చంద్రబాబు..

గత కొన్ని నెలలుగా విపక్షాలు సైతం ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. పీఏసీ సభ్యుడు.. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సైతం ఇదే అంశంపై గతంలో గవర్నర్ ఫిర్యాదు చేశారు కూడా.. అయితే విపక్షాలవి అర్థం లేని విమర్శలు అంటూ ప్రభుత్వం కొట్టి పడేస్తూ వచ్చింది. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి అంటోంది ఏపీ ప్రభుత్వం.. దుబారాగా అప్పులు చేయడం లేదని.. అవసరాల మేరకే అప్పులు చేస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన సైతం వివరణ ఇచ్చారు. కానీ తాజాగా కాగ్ నివేదిక చూసిన తరువాత అయినా.. ఏపీ ప్రభుత్వం పద్దతి మార్చుకుంటే మంచిది అని.. లేదంటే రాష్ట్రం దివాళా తీసే ప్రమాదం ఉందని అర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap government, AP News

ఉత్తమ కథలు