హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Airport: భోగాపురం ముందుకు కదిలేదెలా..? డెడ్ లైన్ ముగిసినా నో అంటున్న నిర్వాసితులు

Airport: భోగాపురం ముందుకు కదిలేదెలా..? డెడ్ లైన్ ముగిసినా నో అంటున్న నిర్వాసితులు

భోగాపురం ముందుకు కదిలేనా..?

భోగాపురం ముందుకు కదిలేనా..?

Bhoga Purma Airport: విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భూముల సేకరణలో అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. భూసేకరణ కు డెడ్ లైన్ ముగిసినా.. నిర్వాసితులు ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికొస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...

Bhogapuram Airport:  భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు (Airport) నిర్మాణ పనులు ముందడుగు వేస్తాయా.. తాజా పరిస్థితి చూస్తే మళ్లీ మొదటికే వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా  నిర్వాసితులను అక్కడి నుంచి కదిలించడం కష్టంగా మారింది. ఇదే విషయంలో అధికారుల తీరు సైతం వివాదాస్పదం అవుతోంది.  సంక్రాంతి (Sankranti) ముందు తమ గ్రామాలకి వచ్చి ఈ నెల 18 తర్వాత  ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో.. పండుగ కూడా సరిగా జరుపుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  ఇప్పటికే ఆలస్యమయిందని నిర్వాసిత కాలనీల నిర్మాణం పూర్తి చేసి, నిర్వాసితులను వెంటనే గ్రామాల నుండి ఖాళీ చేయించి.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాఫీగా సాగేలా చూడాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. మొత్తానికి ఎన్ని రివ్యూలు చేస్తున్నా.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.  ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా.. అప్పటి కేంద్ర ప్రభుత్వం (Central Government)  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఒక గ్రీన్ ఫీల్డ్  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ఏపీ కి కేటాయించగా.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉన్న భోగాపురం వద్ద సముద్రానికి ఆనుకొని ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి  గత టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. భోగాపురం వద్ద సుమారు 5వేల ఎకరాల భూములు సేకరించాలని నిర్ణయించి.. చివరకు 2700 ఎకరాల భూములు మాత్రం సేకరించింది.

ఇదీ చదవండి : ఆ జిల్లాలో యువ నేతకు పదవి ఇవ్వడం.. ప్లస్సా.. మైనస్సా..? కేడర్ లో ఇంత గందరగోళం ఎందుకు..?

ఇంతలో ప్రభుత్వం మారటం, వచ్చిన ప్రభుత్వంలో ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన వివిధ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ప్రభుత్వ భూములు సహా 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 4 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి వారికి ఆయా గ్రామాలలోని నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ల చెల్లింపులు, నిర్వాసితుల కుటుంబాలలోని 18 ఏళ్ల లోపు ఉన్న వారికి భూమికి భూమి ఇవ్వడం వంటి అనేక హామీలను జిల్లా యంత్రాంగం ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుండి పరిహారాల చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో, ఏం చేయలేని పరిస్ధితిలో పడ్డారు.

ఇదీ చదవండి : ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం.. చంద్రబాబు త్వరగా కోలుకోవలన్న పవన్

అయితే ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని, వెంటనే భూములు నిర్మాణ సంస్ధకు కట్టబెట్టాలంటూ .. ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో.. జిల్లా అధికారులు  భూములను ఉన్నపళంగా తమకు అప్పగించాలంటూ నిర్వాసితుల మీద పడ్డారు. భూములను చదును చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణ సంస్ధకు అప్పగించాల్సి ఉందంటూ 4 పంచాయితీల పరిధిలో ఉన్న మరడపాలెం, ముడసర్లపేట, రెల్లిపేట, బొల్లింకలపాలెం గ్రామాలలో సంక్రాంతి పండుగ ముందు పర్యటించి గ్రామాలలో ప్రకటనలను జారీ చేసారు.

ఇదీ చదవండి : బావల కోసం బాలయ్య తాపత్రయం..? ఆ ఇద్దరినీ ఒక్కటి చేస్తారా..? ఇదంతా ఎవరి ప్లాన్

తమకు ఉండేందుకు నివాసాలకు చూపించకుండా.. ఇప్పటికప్పుడు 400  కుటుంబాలను రోడ్డున పడిస్తే ఎలా ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు.  ఇప్పటికిప్పుడు గ్రామాలను ఖాళీ చేయలేమని, అధికారులకు తెగేసి చెప్పారు. భూ సేకరణతో మరడపాలెంలో 223, ముడసర్ల పేటలో 39, బొల్లింకలపాలెంలో 55, రిల్లిపేటలో 65 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంది. వీరికోసం గూడెపువలసలో 17 ఎకరాలు, పోలేపల్లి రెవెన్యూలోని లింగాలవలసలో 25 ఎకరాల్లో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. గ్రామాలు తరలించే నాటికి బాధిత యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని నిర్వాసితులు తెలిపారు. కానీ ఇప్పటివరకు తమకు ఎలాంటి సహాయమూ అందలేదని, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ వస్తే గ్రామం నుంచి వెళ్లిపోతామని అంటున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Vizianagaram

ఉత్తమ కథలు