Pancharama Kshetras tour: కార్తీక మాసం (Kartika masam) అంటే పరమ పవిత్రంగా భావిస్తారు హిందువులు.. అందుకే ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించాలని ఆరాటపడతారు. ముఖ్యంగా కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలు (Pancharama Kshetralu) దర్శించుకుంటే పుణ్యమని భక్తుల నమ్ముతుంటారు. కచ్చితంగా ఎక్కువమంది ఈ నెలలో శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఒక కుటుంబం మొత్తం పంచారామాలను దర్శించాలంటే భారీగానే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది అందరికీ ఆర్థిక భారమే.. అయినా చాలా మంది మాత్రం పంచారామాలకు వెళ్లే మంచిది అని భావిస్తారు. కానీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) కార్తికమాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సు (Special Buses) సర్వీసులను నడుపుతోంది.ఇవి ఎక్కడ నుంచి ప్రారంభమవుతాయి అంటే.. తుని ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తుని నుంచి ఈ నెల 14, 21, 28 తేదీల్లో ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట తదితర శైవ క్షేత్రాలకు తీసుకువెళతారు. దర్శనం తరువాత భక్తులను తుని డిపోకు తీసుకువస్తారు.
రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి అంటే...
పంచారామాలకు ఈ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలి అంటే రిజర్వేషన్ చేసుకోవడం కూడా చాలా సులభమే.. తుని ఆర్టీసీ డిపోతో పాటు పాయకరావుపేట, గొల్ల అప్పారావు సెంటర్, అన్నవరం, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్ టికెట్లు పొందవచ్చు. ఇలా ఆఫ్ లైన్ లో టికెట్లు తీసుకోవచ్చు.. ఆన్ లైన్ వాడే వారు తమ మొబైల్ లేదా కంప్యూటర్లలో ఆన్లైన్లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు ఆర్టీసీ అధికారులు..
: సామాన్యులను ఏడిపిస్తున్న టమోటా.. రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యే మార్కెట్లోనే కిలో రూ.75
ధరలు ఎలా ఉన్నాయి అంటే..?
చారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు బస్సు కేటగిరి ఆధారంగా పెద్దలకు, పిల్లలకు వేర్వేరు టికెట్ ధరలను అందుబాటులో ఉంచారు. తుని డిపో నుంచి పల్లెవెలుగు పెద్దలకు 720 రూపాయలు, పిల్లలకు 570 రూపాయలు, అల్ట్రా డీలక్స్ పెద్దలకు 1040 రూపాయలు, పిల్లలకు 810 రూపాయలు, సూపర్ లగ్జరీ పెద్దలకు 1080 రూపాయలు, పిల్లలకు 840 రూపాయలుగా టికెట్ల ధరను అధికారులు నిర్ణయించారు.
: బీజేపీ వర్సెస్ వైసీపీ.. కేంద్రం తీరుపై కౌంటర్ ఎటాక్.. పత్రికల్లో ప్రకటనలు.. వాస్తవం ఏంటి..?
ఎక్కువమంది బృందాలుగా వెళ్లే వారికి ప్రత్యేక అవకాశం
పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడానికి బృందాలుగా వెళ్లే వారికి ఆర్టీసీ వారి స్వగ్రామం నుంచే బస్సు సౌకర్యం కల్పిస్తోంది. బస్సు సీటింగ్ కెఫాసిటీ మేరకు టికెట్లు ఉంటే వారి నివాస గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారు. నాలుగైదు సీట్లు మిగిలిపోయినా బస్సును అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
: బిగ్ షాక్ తప్పదా..? లీటరు పెట్రోల్ ధర 200 రూపాయలు దాటుతుందా..?
వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు
ఉద్యోగులు, వ్యాపారుల సౌకర్యం కోసం శనివారం బస్సులు బయలు దేరి ఆదివారం సాయంత్రానికి తిరిగి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ నెల13, 20, 27 తేదీల్లో వీరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు కండీషన్లో ఉన్న బస్సులను తుని డిపో నుంచి నడుపుతున్నారు. రెగ్యులర్ భక్తులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.
:ఆ ఊరి పేరు దీపావళి.. ఆ పేరు ఎలా వచ్చింది..? ఎక్కడ ఉంది..?
టికెట్ల రిజర్వేషన్, అదనపు వివరాలకు ఇలా సంప్రదించవచ్చు..
తుని డిపో మేనేజర్: 99592 25539
అసిస్టెంట్ మేనేజరు: 94928 33885
ఎంక్వయిరీ : 08854–253666
రిజర్వేషన్: 73829 13216, 73829 13218
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Apsrtc