Andhra Pradesh: అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు షాకింగ్ అనుభవం.. తొలి రాత్రి నుంచే భర్త వింత ప్రవర్తన.. ఆమె ప్రశ్నించడంతో..

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి వింత అనుభవం ఎదురైంది. తొలి రాత్రి నుంచి భర్త ప్రవర్తన చూసి.. షాక్ తింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని.. యువతి పోలీసులను ఆశ్రయించింది.

  • Share this:
    కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి వింత అనుభవం ఎదురైంది. తొలి రాత్రి నుంచి భర్త ప్రవర్తన చూసి.. షాక్ తింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని.. యువతి పోలీసులను ఆశ్రయించింది. అబద్ధం చెప్పి తన జీవితాన్ని నాశనం చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన ఓ మహిళ తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే ఆమె తన కొడుకుకి ఉన్న సమస్యను కప్పిపుచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన కొడుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి.. గుంటూరుకు చెందిన ఓ యువతి పెళ్లి ఫిక్స్ చేసింది. మే 26వ తేదీన పెళ్లి కూడా జరిగింది. కట్నం కింద యువతి బంధువుల నుంచి రూ. 6 లక్షలు తీసుకోవడంతోపాటుగా, పెళ్లి కోసం మరో రూ. 2 లక్షలు ఖర్చు చేయించారు.

    అయితే పెళ్లి జరిగాక తొలి రాత్రే యువతికి షాక్ తగిలింది. తొలిరాత్రి భర్త వింత ప్రవర్తన చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరికి వచ్చిన అతడు.. ఈ వయసులో కోరికలు ఉండకూడదంటూ ట్యాబ్లెట్ వేసుకోని నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇలాగే జరిగింది. దీంతో యువతిని ఎన్నో అనుమానాలు వెంటాడాయి. ఈ క్రమంలోనే ఆమె భర్తను నిలదీసింది. దీనికి అతడు.. భార్యభర్తలు అంటే శారీరక సంబంధం పెట్టుకోవడం కాదని.. స్నేహితులుగా ఉందామని సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు విన్న యువతి.. ఒక్కసారిగా మొత్తం బ్లాంక్ అయింది. మరోవైపు అతడు మాత్రలు వేసుకోకపోతే తలనొప్పి, ఇతర సమస్యలు వస్తాయనే విషయం కూడా తెలిసింది.

    దీంతో ఆందోళన చెందిన యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పంది. దీంతో యువతి తల్లిదండ్రులు.. యువకుడి తల్లిని ప్రశ్నించారు. అయితే ఆమె కేవలం తలనొప్పి ఉందని.. అందుకే ట్యాబ్లెట్స్ వేసుకుంటాడని చెప్పింది. కావాలంటే ఓ డాక్టర్‌తో మాట్లాడాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. అయితే తొలుత డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే ఆ తర్వాత యువతి ప్నశ్నించగా.. అతడు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆ యువకుడికి మానసిక స్థితి సరిగాలేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని.. వ్యాధి తీవ్రమవుతుందని చెప్పారు.

    దీంతో యువతి తీవ్ర ఆందోళన చెందింది. అసలు నిజాలు దాచి పెళ్లి ఎందుకు చేశారని అడిగితే.. అత్త తనపై బెదిరింపులకు పాల్పడుతుందని యువతి ఆరోపించింది. ఈ మేరకు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారని పేర్కొంది. తనను మోసం చేసి ఈ విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: