హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap New Districts: కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నాయా..?ఇలా చెప్పొచ్చు.. పత్యేక కమిటీ ఏర్పాటు

Ap New Districts: కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నాయా..?ఇలా చెప్పొచ్చు.. పత్యేక కమిటీ ఏర్పాటు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Ap New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం దూకుగుగా ముందుకు వెళ్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నాటికి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించాలని కంకణం కట్టుకుంది. అయితే చాలామంది వీటిపై అభ్యంతరాలు చెబుతున్నారు. మరికొందరు సూచనలు చేయాలి అనుకుంటున్నారు. అలాంటి వారందరి కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇంకా చదవండి ...

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల (AP New Distirct) ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఏప్రిల్ రెండో తేదీ నాటికి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేలా చేయాలని ఏపీ ప్రభుత్వం (AP Government) లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల అంటే మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ఆ వెంటనే ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొత్త జిల్లాలకు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితి బంద్ ల వరకు వెళ్లింది. అధికార పార్టీ నేతలు సైతం బంద్ లో భాగమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వానికి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఎలాంటి వివాదాలకు తావులేకుండా జిల్లాల ఏర్పాటు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

తాజాగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీలు ప్రముఖుంగా ఉంటారు. వీరితో పాటు.. ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ కమిటీకి విజ్ఞప్తులు చేసేందుకు ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ విజ్ఞప్తులను కలెక్టర్లు సేకరిస్తారు. కొత్త జిల్లాలపై ప్రజలు, నిపుణులు, రాజకీయ పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ (drp.ap.gov.in)కు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుండాలి.

ఇదీ చదవండి : ఏపీలో మెగా స్టూడియో..? ప్లేస్ ఫైనల్ చేశారా..? అదే దారిలో మహేష్..!

ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన తరువాత.. విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే సిఫారసు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని సదరు రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. అయితే ఈ కమిటీ సిఫార్సులు ఎలా ఉన్నా.. ఫైనల్ చేసేది మాత్రం.. సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీనే.. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నుంచి కొత్త జిల్లాలు తీసుకురావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : : 27 ఏళ్ల ఆమె 23 ఏళ్ల యువకుడిపై మోజు పడింది.. 40 ఏళ్ల భర్తను ఏం చేసిందంటే..?

రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేసింది ప్రభుత్వం. దీంతో 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ త్వరలో 13 జిల్లాలుగా మారానుంది. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కొత్త సంవత్సరాది ఉగాదికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. అరకు నియోజకవర్గం భౌగోళికంగా పెద్దది కావడం, ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉండటంతో ఆ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజించారు.

ఇదీ చదవండి :సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి కీలక పదవి.. రాజధానికి ముహూర్తం ఫిక్స్..?

భవిష్యత్తులో సాంకేతికంగా.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండకూడదు అంటే.. అభ్యంతరాలు, సూచనలపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా అన్ని అంశాలను అధ్యయనం చేయడమే మంచిందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మరో కమిటీ నియమించింది. జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలకు సంబంధించి తమ దృష్టికొచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి :అధికారుల అతిపై సీఎం జగన్‌ సీరియస్‌. పునరావృతం కావొద్దని డీజీపీకి ఆదేశం

ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసిన తర్వాత.. వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కమిటీ పరిశీలిస్తుంది. ఆ అభ్యంతరాలు ఎంతవరకు సహేతుకమైనవో తేలుస్తుంది. అదే విధంగా ప్రతి అభ్యంతరాన్ని పరిగణలో తీసుకోవాలా వద్దా అనేది కూడా కమిటీ సిఫారసు చేస్తుంది. కమిటీ స్క్రూటినీ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిటీ సూచనల మేరకే.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులపై ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP new districts, AP News

ఉత్తమ కథలు