Home /News /andhra-pradesh /

ANDHRA PRADESH NEW DISTRICTS UPDATE ANY IF YOU HAVE ANY OBJECTIONS TOMORROW WILL BE LAST DATE NGS

AP New District: రేపటితో గడువు పూర్తి.. ఆ జిల్లా నుంచే అధిక అభ్యంతరాలు.. ఫైనల్ అయ్యినట్టేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP New District: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఫైనల్ అయినట్టేనా..? కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఎన్ని..? ఏ జిల్లా నుంచి ఎక్కువ వినతులు వచ్చాయి..? రేపటితోనే అభ్యంతరాల గడువు ముగుస్తోంది. మరి అధికార ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు.. మార్పులు చేసే అవకాశం ఎక్కడెక్కడ ఉంది. రేపటితోనే గడువు ముగియనుంది.

ఇంకా చదవండి ...
    AP New District: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల (New districts) పునర్‌ వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టర్లకు 7,500 సలహాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే ఎవరూ ఊహించనట్టు ఇప్పటి వరకు విజయనగరం జిల్లా (Vizianagaram District)నుంచి ఎక్కువగా 4,500 అభ్యంతరాలు, సూచనలు వచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత అధిక సూచనలు కృష్ణా జిల్లా (Krishna District)నుంచి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని పరిశీలించిన తరువాత వర్చువల్ గా మంత్రి వర్గ సమావేశం జరిగింది. తరువాత ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లూ ఆమోదం తెలిపారు. ఇంకేవైనా అంశాలుంటే అవన్నీ కూడా తుది నోటిఫికేషన్‌ ఇచ్చేలోగా తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ఆ తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా..? సూచనలు ఇవ్వాలి అనుకున్నా.. మార్చి 3వ తేదీ వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం.. దీంతో ఆ గడువు రేపటితో ముగియనుంది.

    25 పార్లమెంట్ నియోజకవర్గాలను.. జిల్లాలుగా ప్రకటించాలని ప్రభుత్వం ముందు నుంచే చెబుతూ వచ్చింది. అయితే అరుకు నియోజకవర్గం పెద్దది కావడంతో.. దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 13 జిల్లాలుగా ఉన్న ఏపీ కొత్తగా 26 జిల్లాలుగా మారుతోంది. దీంతో పెద్దగా అభ్యంతరాలు ఉండవని ప్రభుత్వం ఊహించింది.. కానీ ఊహించని విధంగా వైసీపీ నేతల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది. అఖిలపక్ష నేతలతో కలిసి చాలా జిల్లాల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కొత్త పల్లి సుబ్బారాయుడు కొత్త జిల్లాల విషయంలో తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ వైసీపీ నేతల నుంచి భారీగా అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గడువు ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

    ఇదీ చదవండి : వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు పావులేనా..? సజ్జల లాంటి క్యారెక్టర్ చూడలేదన్నటీడీపీ నేత

    ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ రేపటితో ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ మేరకే 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన జారీ అవుతోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇదీ చదవండి :  చిట్టీల పేరుతో కోట్లు కొట్టేసిన కిలేడీలు.. పోలీసుల సహకరించని వాలంటీర్.. తల్లివీ పొంతనేలి సమాధానాలే

    1974 ఏపీ డిస్ట్రిక్ట్‌.. ఫార్మేషన్‌ లా.. ప్రకారం కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఈ 13 జిలాలు చాలా పురాతనమైనవే.. అందులో 11 జిల్లాలు బ్రిటీష్ పాలనలో ఏర్పాటు అయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వతా పాలన సౌలభ్యం దృష్ట్యా గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో కలిపి ఒంగోలు కేంద్రంగా ఫిబ్రవరి 2, 1970 న ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. అలాగే విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి విజయనగరం కేంద్రంగా 1979 జూన్‌ 1న చివరిగా విజయనగరం డిస్ట్రిక్ట్ (Districts) ఏర్పాటైంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు